Thanks to Ramragbir for providing the You Tube video
నిర్మాణం: | భరణీ పిక్చర్స్ | ||
---|---|---|---|
చిత్రం: | గృహలక్ష్మి (1967) | ||
సంగీతం: | ఎస్. రాజేశ్వరరావు | ||
రచయిత: | సముద్రాల సీనియర్ (రాఘవాచార్యులు) | ||
గానం: | ఘంటసాల, భానుమతి (మాటలతో) | ||
ఘంటసాల: | ఆ.. ఆ... ఆఆఆఆఆఆ ....ఆ.. | ||
పల్లవి: | వినవే ఓ ప్రియురాలా వివరాలన్ని ఈవేళా | ||
వినవే ఓ ప్రియురాలా వివరాలన్ని ఈవేళా | |||
మగువలు ఏమి చెయ్యాలి? | |||
భానుమతి: | ఏం చెయ్యాలేం? | ||
ఘంటసాల: | ఏంచెయ్యాలా | ||
` | మగనికి సేవ చెయ్యాలి | ||
మగువలు ఏమి చెయ్యాలి, మగనికి సేవ చెయ్యాలి | |||
వినవే ఓ ప్రియురాలా వివరాలన్ని ఈవేళా | |||
వినవే ఓ ప్రియురాలా | |||
చరణం | ఘంటసాల: | కార్యేషు దాసీ..ఈ.. కరణేషు మంత్రీ...ఈ..ఈ | |
భోజ్యేషు మాతా.. ఆ.. శయనేషు రంభా...ఆ | |||
వినవే ఓ ప్రియురాలా వివరాలన్ని ఈవేళా | |||
వినవే ఓ ప్రియురాలా | |||
భానుమతి: | ఏమిటో ఆ వివరాలు? | ||
ఘంటసాల: | తెల్లవారగనె లేవాలి, నన్ను మెల్లగ నిద్దుర లేపాలి | ||
లేత నవ్వులే రువ్వాలి, నా చేతికి కాఫీ యివ్వాలి | |||
రెండు జాములు దాటకముందే నిండైన విందులు చేయా...లి | |||
భానుమతి: | అబ్బో, ఊహాగానం చేస్తున్నారా | ||
ఘంటసాల: | త్వరగా ముస్తాబు కావాలి, పన్నీటి జల్లులా రావాలి | ||
మల్లెల పానుపు వేయాలి, చలచల్లగ గంధం పూయాలి | |||
అత్తమామ సేవలే కాస్త మాని | |||
భానుమతి: | మాని | ||
ఘంటసాల: | ఈ చందమామ సేవలే చేయాలి | ||
భానుమతి: | ఊ.. | ||
ఘంటసాల: | ఊ.. | ||
వినవే ఓ ప్రియురాలా వివరాలన్ని ఈవేళా | |||
వినవే ఓ ప్రియురాలా | |||
చరణం | భానుమతి: | అబ్బ చాల పెద్ద లిస్టు, కష్టమండీ | |
ఘంటసాల: | కష్టమంటే ఎలా | ||
ఆనాడు సీతమ్మ ఏమి చేసినది? | |||
అడవిలో విభునితో విడిది చేసినది | |||
అలనాటి దమయంతి ఏమి చేసినదీ..ఈ..ఈ? | |||
నలునికై తనువెల్ల ముడుపు చేసినది | |||
సతి చంద్రమతి నాడు ఏమి చేసినది? | |||
పతికై బ్రతుకంత ధారవోసినది ఆ.. ఆ.. ఆ.. | |||
భానుమతి: | ఇంకా | ||
ఘంటసాల: | లక్ష మాటలింక ఎందుకులే గృహలక్ష్మి ధర్మమెపుడింతే..లే | ||
లక్ష మాటలింక ఎందుకులే గృహలక్ష్మి ధర్మమెపుడింతేలే | |||
వినవే ఓ ప్రియురాలా వివరాలన్ని ఈవేళా | |||
వినవే ఓ ప్రియురాలా |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి