తెలుగువారి అదృష్టఫలము వేమన కవి. ఇతని అసలు పేరు వేమారెడ్డి. వేమన జీవిత చరిత్రను 1947 లో "యోగి వేమన" పేరుతో ప్రతిష్టాత్మకమైన చిత్ర నిర్మాణ సంస్థ వాహినీ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రానికి ఒక నృత్య సన్నివేశానికి ఘంటసాల, యం.వి. రాజమ్మ "ఆపరాని తాపమాయెరా" అనే పాటను పాడారు. యం.వి.రాజమ్మ అలనాటి ప్రముఖ కన్నడ నటి. ఆమె తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలలో నటించారు.
యుగళగీతం | ఆపరాని తాపమాయెరా | ||
---|---|---|---|
నిర్మాణం: | వాహిని వారి | ||
చిత్రం: | యోగి వేమన (1947) | ||
రచన: | సముద్రాల సీనియర్ | ||
సంగీతం: | చిత్తూరు నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు | ||
పాడినవారు: | ఘంటసాల, యం.వి. రాజమ్మ | ||
అభినయం: | ఘంటసాల, యం.వి. రాజమ్మ | ||
ఘ: | తాం, తత్తాం తధీం తకధీం, ధిత్తాం ధిమిత ఝణు, | ||
తధిమి తధిమి తద్దణత ఝణుత ధిమితాం | |||
తకధీం తతాం, తకధీం తతాం, తకధీం తతాం | |||
ప. | ఘ+జ: | ఆపరాని తాపమాయెరా, బాలేందుమౌళీ | |
జ : | ఆపరాని తా..పమాయెరా, బాలేందుమౌళీ | ||
ప్రాపుగోరి చేరితిరా, | |||
ప్రాపుగోరి చేరితిరా - రారా- నన్నేలుకోరా, | |||
ఆపరాని తాపమాయెరా | |||
ఘ: | సరిగసా సనిదమా సమాగరిస రిగమదని | ||
గరిసనిద రిసానిదమ సదా రిగమ | |||
చ. | ఘ+జ: | వలచి వలచి, మనసు నీకై, అలసి సొలసి పోయెనురా | |
జ : | వల.చి వల.చి మనసు నీకై, అలసి సొలసి పోయెనురా | ||
బాలనురా-వగనాపగ జాలనురా, నీ సేవకురాలనురా, గైకొనరా | |||
బాలనురా-వగనాపగ జాలనురా నీ సేవకురాలనురా | |||
నెర నమ్మినార తమిదీర దరిజేరరార | |||
ఆపరాని తాపమాయెరా | |||
ఘ: | తధిమి తకిట ఝణుతాం, తత్తాం, తధిత్తాం | ||
తధిమి తకిట ఝణుతాం, తత్తాం, తధిత్తాం | |||
తద్ధి త్తరికిటతోం, తకిటథోం | |||
తద్ధి త్తరికిటతోం, తకిటథోం | |||
తద్ధి త్తరికిటతోం, తకిటథోం | |||
చ. | ఘ+జ: | ఇందుకళాధరుడవని, సుందర నటరాజువని | |
ఇందుకళా.ధరుడవని, సుం.దర నటరాజువని | |||
జ: | ఎందరినో, మున్నేలిన - అందా.లా. సామివని | ||
వింటినిరా - నిన్నుజేర గంటినిరా - జంటకు | |||
రమ్మంటినిరా - ఆర్తిదీర్తువని | |||
వింటినిరా, నిన్నుజేర గంటినిరా | |||
జంటకు రమ్మంటినిరా | |||
ఘ: | తథిం తథిం |
కృతజ్ఞతలు: పోస్టరునందించిన బొల్లాప్రగడ సోమేశ్వరరావు గారికి, సమాచారంఉ పొందుపరచిన వికిపీడియా మరియు ఘంటసాల గళామృతము వారికి, శ్రవణ ఖండికను పొందుపరచిన ప్రాజెక్టు ఘంటసాలకు, దృశ్యఖండికను అందించిన .... వారికి హృదయపూర్వక ధన్యవాదములు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి