1955 సంవత్సరంలో
విడుదలైన సారథీ సంస్థ నిర్మించిన రోజులు మారాయి చిత్రం
నుండి జిక్కీ తో పాడిన ఇదియే
హాయి కలుపుము చేయి
అనే ఈ యుగళగీతం రచన
తాపీ ధర్మారావు, స్వరపరచినది మాస్టర్
వేణు. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని,
జానకి, రేలంగి, సి.ఎస్.ఆర్.
ఆంజనేయులు, అమ్మాజీ, హేమలత.ఈ చిత్రానికి
నిర్మాత సి.వి.ఆర్.ప్రసాద్
మరియు దర్శకుడు తాపీ
చాణక్య.
నిర్మాణం : | సారథీ వారి | ||
---|---|---|---|
చిత్రం : | రోజులు మారాయి (1955) | ||
రచన : | తాపీ ధర్మారావు | ||
సంగీతం : | మాస్టర్ వేణు | ||
గానం : | ఘంటసాల, జిక్కీ | ||
ప. | ఆమె : | ఇదియే హాయి కలుపుము చేయి, వేయి మాటలేలనింక | |
వేయి మాటలేలనింక ఓ.ఓ.ఓ.ఓ. | |||
ఇదియే హాయి కలుపుము చేయి | |||
అతడు : | ఇదియే హాయి కలుపుము చేయి, వేయి మాటలేలనింక | ||
వేయి మాటలేలనింక ఓ.ఓ.ఓ.ఓ. | |||
ఇదియే హాయి కలుపుము చేయి | |||
చ. | ఆమె: | ఓ..ఓ.. ఆ చూపులోనె కురియును తేనె | |
చిరునగువాహా వెలుగున వాలె | |||
మనసెదో హాయి సోలునే ఓ.ఓ.ఓ.ఓ | |||
మనసెదొ హాయి సోలునే | |||
నీ వాడిన మాట సాటిలేని పూలబాట | |||
సాటిలేని పూలబాట ఓ.ఓ.ఓ.ఓ. | |||
ఇదియే హాయి కలుపుము చేయి | |||
చ. | అతడు : | అందాలలోన నడవడిలోన | |
తొలుతను నీవే తెలియగరావె | |||
బ్రతుకున మేలు చూపవె ఓ.ఓ.ఓ.ఓ | |||
బ్రతుకున మేలు చూపవె | |||
నీ చూపే చాలు అదే నాకు వేనవేలు | |||
అదే నాకు వేనవేలు ఓ.ఓ.ఓ.ఓ. | |||
ఇదియే హాయి కలుపుము చేయి | |||
చ. | ఇద్దరు : | ఈ లోకమేమో మరే లోకమేమో | |
మనసులతోనే తనువులు తేలే | |||
బ్రతుకిక తూగుటూయలే ఓ.ఓ.ఓ.ఓ. | |||
బ్రతుకిక తూగుటూయలే | |||
ఈనాటి ప్రేమ లోటు లేని మేటి సీమ | |||
లోటు లేని మేటి సీమ ఓ.ఓ.ఓ.ఓ. | |||
ఇదియే హాయి కలుపుము చేయి, వేయి మాటలేలనింక | |||
వేయి మాటలేలనింక ఓ.ఓ.ఓ.ఓ. | |||
ఇదియే హాయి కలుపుము చేయి |
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి