1957
సంవత్సరంలో విడుదలైన నరసూ స్టూడియోస్ సంస్థ నిర్మించిన భలే అమ్మాయిలు చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.లీల తో పాడిన
"మది వుయ్యాలలూగే నవభావాలే" అనే ఈ యుగళం రచన సదాశివబ్రహ్మం, స్వరపరచినది ఎస్.రాజేశ్వరరావు-ఎస్.హనుమంతరావు. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, సావిత్రి, గిరిజ, రేలంగి, జగ్గయ్య,పేకేటి శివరాం, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు. ఈ చిత్రానికి నిర్మాత వి.ఎల్.నరసు మరియు దర్శకుడు వేదాంతం రాఘవయ్య.
Thanks to Sri Mitta Ravi Shankar garu for providing the video clip
ఆమె | మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహొ | |
మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహొ మది ఉయ్యాల | ||
అతడు | ప్రేమతో గగన వీధులలో హాయిగా ఎగిరి పోవుదమా | |
ప్రేమతో గగన వీధులలో హాయిగా ఎగిరి పోవుదమా | ||
మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహ | ||
ఆమె | తీయని కోరికలూరెను నాలో తెలియదు కారణమేమో | |
ప్రేమ ఇదేనా ప్రణయమిదేనా...ప్రణయమిదేనా | ||
అతడు | ప్రేమ ఇదేనా ప్రణయమిదేనా...ప్రణయమిదేనా | |
నూతన యవ్వన సమయమున | ||
మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహ | ||
అతడు | చిన్నతనమేలా సిగ్గుపడనేల మన్ననలెందుకు మనలోన | |
చిన్నతనమేలా సిగ్గుపడనేల మన్ననలెందుకు మనలోన | ||
ఆమె | ప్రేమలో కరగిపోవుదమా భేదమే మరచిపోవుదమా | |
ప్రేమలో కరగిపోవుదమా భేదమే మరచిపోవుదమా | ||
మది ఉయ్యాలలూగే నవభావాలేవో రేగే మానసమానందమాయెనహ | ||
అతడు | ఓ చెలియా మన జీవితమంతా పున్నమ వెన్నెల కాదా ఆ - 2 | |
ఆమె | రేయి పగలు నే నిను మురిపించి నిను వలపించి ప్రేమ జగానికి కొనిపోనా | |
ఇద్దరు | మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహ | |
మది ఉయ్యాలలూగే నవభవాలేవో రేగే మానసమానందమాయెనహ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి