1953 లో వినోదా వారి సంస్థ నిర్మించిన దేవదాసు చిత్రం నుండి ఘంటసాల పాడిన పల్లెకుపోదాం పారును చూదాం. గీత రచన: సముద్రాల సీనియర్, సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్. దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య. తారాగణం: అక్కినేని, సావిత్రి, ఎస్.వి. రంగారావు, ఆర్. నాగేశ్వరరావు, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,పేకేటి, లలిత.
చిత్రం | దేవదాసు-1953 | |||
రచన | సముద్రాల రాఘవాచార్య | |||
సంగీతం | సి. ఆర్. సుబ్బరామన్ | |||
గానం | ఘంటసాల | |||
ప. | పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో ||2|| | |||
అల్లరి చేదాం చలో చలో | ||పల్లెకు|| | |||
ప్రొద్దు వాలే ముందు గానే ముంగిట వాలేమూ | ||పల్లెకు|| | |||
చ. | ఆటా పాట లందు కవ్వించు కొంటె కోణంగీ ||2|| | |||
మనసేమో మక్కువేమో..మనసేమో మక్కువేమో | ||||
నగవేమో వగేమో కనులార చూతమూ | ||పల్లెకు|| | |||
చ. | నన్ను చూడగానే చిననాటి చనువు చూపేనో ||2|| | |||
నా దరికి దూకునో.. నా దరికి దూకునో | ||||
తానలిగి పోవునో ఏమౌనో చూతమూ | ||పల్లెకు|| | |||
ప్రొద్దు వాలే ముందు గానే ముంగిట వాలేమూ | ||||
పల్లెకు పోదాం పారును చూదాం చలో చలో | ||||
అల్లరి చేదాం చలో చలో...ఛలో... ఛలో... |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి