1964 సంవత్సరంలో విడుదలైన అశ్వరాజ్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన శ్రీసత్యనారాయణమహాత్మ్యం చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పాడిన "శ్రీ క్షీరవారాసి " అనే ఈ దండకం రచన సముద్రాల జూ., స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, రేలంగి,కాంతారావు,రమణారెడ్డి. ఈ చిత్రానికి నిర్మాత పి.సత్యనారాయణ మరియు దర్శకుడు రజనీకాంత్.
#000 | దండకం: | శ్రీ క్షీరవారాసి కన్యాపరీరంభ |
---|---|---|
చిత్రం: | శ్రీ సత్యనారాయణ మహత్యం (1964) | |
రచన: | సముద్రాల జూనియర్ | |
సంగీతం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల | |
నిర్మాణం: | అశ్వరాజ్ పిక్చర్స్ | |
ఘం: | శ్రీ క్షీరవారాసి కన్యాపరీరంభ సంభూత మందస్మితా | |
శంఖచక్రాంకితా కౌస్తుభాలాంకృతా | ||
దివ్య మందార దామోదరా నీల ధారాధరాకారా విజ్ఞానసారా | ||
నిరాకారా సాకార ప్రేమావతారా | ||
ముకుందా సదానందా గోవిందా సంరక్షితానేక యోగీశబృందా | ||
దయాపాంగ సంతోషితానంద దాసాంతరంగా! | ||
భవదివ్య సౌందర్య కారుణ్య లీలావిలాసంబు | ||
బృందారకాధీశులే చాటలేరన్ననేనెంతవాడన్ ప్రభో! | ||
దాటగారాని మాయా ప్రవాహమ్ములో చిక్కి | ||
వ్యామోహ తాపమ్ములన్ చొక్కి శోషించు | ||
ఘోషించు నీ దాసునిన్ జూచి వాత్సల్యమే పారగా బ్రోచి | ||
సాలోక్య మిప్పించుమా, నీదు సాయుజ్యమున్ గూర్చుమా, | ||
స్వామీ శ్రీ సత్యనారాయణా! | ||
నమస్తే నమస్తే నమః |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి