1966
సంవత్సరంలో విడుదలైన శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన అగ్గిబరాటా చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీల తో పాడిన
"ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను"
అనే ఈ యుగళగీతం రచన డా.సినారె, స్వరపరచినది విజయా కృష్ణమూర్తి. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, రాజశ్రీ,రామదాసు, మిక్కిలినేని, ముక్కామల, వాణిశ్రీ . ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు బి.విఠలాచార్య.
#0000 | పాట: | ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను | |
---|---|---|---|
పతాకం: | శ్రీ విఠల్ ప్రొడక్షంస్ | ||
చిత్రం: | అగ్గిబరాటా (1966) | ||
సంగీతం: | విజయా కృష్ణమూర్తి | ||
రచన: | సినారె | ||
గానం: | ఘంటసాల, సుశీల | ||
ప: | సు: | ఊమ్.మ్... హొయ్ హోయ్ హోయ్ హొయ్.. | |
ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను ఈ వింత... | |||
ఘ: | ఏ వింతా .. ? | ||
సు: | ఏ నాడు లేని వింత లోలోన చక్కిలిగింత | ||
ఘ: | హొయ్ హోయ్ హోయ్ హొయ్.. | ||
ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను ఈ వింత.. | |||
సు: | ఏ వింతా.. ? | ||
ఘ: | ఏనాడు లేని వింత లోలోన చక్కిలిగింత | ||
సు: | హొయ్ హోయ్ హోయ్ హొయ్.. | ||
చ: | సు: | నిన్ను నేను చూసిన నాడే కన్ను చెదరిపోయింది | |
నిన్ను నేను చూసిన నాడే కన్ను చెదరిపోయింది | |||
కన్ను చెదరిపోయిన నాడే కన్నెమనసు మారింది | |||
ఘ: | నీ లేత వన్నె ఏదో నాలోన మెరిసింది.. | ||
నీ లేత వన్నె ఏదో నాలోన మెరిసింది.. | |||
సు: | హొయ్ హోయ్ హోయ్ హొయ్.. | ||
ఘ: | ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను | ||
ఈ వింత ఈ వింత | |||
చ: | ఘ: | నిగ్గులొలుకు బుగ్గలు చూసీ నిలిచిపోతి ఆనాడు | |
నిగ్గులొలుకు బుగ్గలు చూసీ నిలిచిపోతి ఆనాడు | |||
చేతినిండ సిగ్గులు దూసీ చేరుకుంటి ఈ నాడూ | |||
సు: | అందాల తీరమేదో అందుకుంటి నీతోడూ | ||
అందాల తీరమేదో అందుకుంటి నీతోడూ | |||
ఘ: | హొయ్ హోయ్ హోయ్ హొయ్.. | ||
సు: | ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను | ||
ఈ వింత ఈ వింత | |||
ఇ: | ఏనాడు లేని వింత లోలోన చక్కిలిగింత | ||
ఏనాడు లేని వింత లోలోన చక్కిలిగింత |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి