1964 సంవత్సరంలో విడుదలైన అశ్వరాజ్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన శ్రీసత్యనారాయణమహాత్మ్యం చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పాడిన "జగన్నాయకా అభయదాయక" అనే ఈ బృందగీతం రచన సముద్రాల జూ., స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, రేలంగి,కాంతారావు,రమణారెడ్డి. ఈ చిత్రానికి నిర్మాత పి.సత్యనారాయణ మరియు దర్శకుడు రజనీకాంత్.
#000 | బృందగీతం: | జగన్నాయక అభయదాయక |
---|---|---|
చిత్రం: | శ్రీ సత్యనారాయణ మహత్యం (1964) | |
రచన: | సముద్రాల జూనియర్ | |
సంగీతం: | ఘంటసాల | |
గానం: | ఘంటసాల | |
నిర్మాణం: | అశ్వరాజ్ పిక్చర్స్ | |
సాకీ | హే మాధవా... మధుసూదనా... కనజాలవా...ఆ...ఆ.. | |
ఘం: | జగన్నాయక అభయదాయకా జాలము సేయగ రావా | |
హేమురారి కరుణాకర శౌరి నామొరలే వి నలేవా | ||
నమ్మిసేవించు నన్నుశోధింప న్యాయమా నీకు దేవా.. | ||
బృం: | సాకారా నిరాకారా ఆశ్రిత కామిత మందార -2 | |
ఘం: | పాలముంచిన నీటముంచినా భారము నీదే దేవా | |
శ్రీనివాస వైకుంఠనివాస దేవానాగతి నీవే | ||
జగము తరియింప కరుణ కురిపించి కావుమా దేవ దేవా.. | ||
బృం: | సాకారా నిరాకారా ఆశ్రిత కామిత మందార -2 | |
కామిత మందార | ||
ఘం: | హే మాధవా కరుణించవా -3 | |
హే మాధవా..... మధుసూదన ..... కనజాలవా |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి