1964 సంవత్సరంలో
విడుదలైన అశ్వరాజ్ పిక్చర్స్
సంస్థ నిర్మించిన శ్రీసత్యనారాయణమహాత్మ్యం
చిత్రం నుండి ఘంటసాల
మాస్టారు పి.లీల, బృందం తో
పాడిన "జయజయ శ్రీమన్నారాయణ"
అనే ఈ యుగళగీతం రచన
సముద్రాల జూ., స్వరపరచినది ఘంటసాల.
ఈ చిత్రంలో
తారాగణం ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, రేలంగి,కాంతారావు,రమణారెడ్డి. ఈ
చిత్రానికి నిర్మాత పి.సత్యనారాయణ మరియు దర్శకుడు
రజనీకాంత్.
#000 | బృందగీతం: | జయ జయ శ్రీమన్నారాయణ | |
---|---|---|---|
చిత్రం: | శ్రీ సత్యనారాయణ మహత్యం (1964) | ||
రచన: | సముద్రాల జూనియర్ | ||
సంగీతం: | ఘంటసాల | ||
గానం: | ఘంటసాల, లీల, బృందం | ||
నిర్మాణం: | అశ్వరాజ్ పిక్చర్స్ | ||
ఇ: | జయ జయ శ్రీమన్నారాయణా, జయ విజయీభవ నారాయణా | ||
జయ జయ శ్రీమన్నారాయణా, జయ విజయీభవ నారాయణా | |||
జయ విజయీభవ నారాయణా | |||
లీ: | జలనిధి సొచ్చి సోమకు ద్రుంచి, వేదాలు గాచిన మీనావతారా | ||
బృ: | ఆ...... | ||
ఘ: | క్షీరజలధి మథనమ్మున మంధరగిరిని మోసిన కూర్మావతారా | ||
బృ: | సా, దనిరీ, దనిసా నిదపా మగరీ గమపదనిస | ||
లీ: | ధర చాపచుట్టిన ధనుజుని బరిమార్చి, ధారుణి నేలిన వరాహావతారా | ||
బృ: | ఆ......... | ||
ఘ: | వరదుడవై ప్రహ్లాదుని కావగ తరలిన వర నరసింహావతారా | ||
బృ: | సా..... దనిసా... నిసనిదమా... గదమగసా గమదనిసా | ||
లీ: | దానమడిగి మూడడుగులనేల బలి దానవు నణిచిన వామనావతారా | ||
ఘ: | ఇటు బ్రాహ్మ్యంబని అటు క్షాత్రంబను పటుతర పరశురామావతారా | ||
లీ: | దశరథు నానతి కానలకేగి దశకంఠు దునిమిన రామావతారా | ||
ఘ: | కాళీయ విషమ నాగు గర్వము నణచీ, కంసుని కూల్చిన కృష్ణావతారా | ||
బృ: | సా..... దనిసా... నిసనిదమా... గదమగసా గమదనిసా | ||
లీ: | సత్యమహింసయే పరమధర్మమని బోధన చేసిన బుద్ధావతారా | ||
ఘ: | ధర్మముతొలగిన ధరలో కలిలో, ధర్మము నిలిపే కలికావతారా | ||
ఇ: | జయ జయ శ్రీమన్నారాయణా, జయ విజయీభవ నారాయణా | ||
జయ విజయీభవ నారాయణా |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి