1964 సంవత్సరంలో విడుదలైన అశ్వరాజ్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన శ్రీసత్యనారాయణమహాత్మ్యం చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీల తో పాడిన "జాబిల్లి శోభ నీవే " అనే ఈ యుగళగీతం రచన సముద్రాల జూ., స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కృష్ణకుమారి, రేలంగి, కాంతారావు,రమణారెడ్డి. ఈ చిత్రానికి నిర్మాత పి.సత్యనారాయణ మరియు దర్శకుడు రజనీకాంత్.
| #000 | యుగళం: | జాబిల్లి శోభ నీవే | |
|---|---|---|---|
| చిత్రం: | శ్రీ సత్యనారాయణ మహత్యం (1964) | ||
| రచన: | సముద్రాల జూనియర్ | ||
| సంగీతం: | ఘంటసాల | ||
| గానం: | ఘంటసాల, పి.సుశీల | ||
| నిర్మాణం: | అశ్వరాజ్ పిక్చర్స్ | ||
| ప: | ఘ : | ఆ..... | |
| జాబిల్లి శోభ నీవే జలదాలమాల నీవే | |||
| జలతారు మెరుపు నీవే, జగమేలు స్వామి నీవే | |||
| సు: | ఆ... | ||
| జాబిల్లి శోభ నీవే జలదాలమాల నీవే | |||
| జగమేలు వలపు నీవే జవరాలి ఆశ నీవే | |||
| చ: | ఘ : | కుసుమాల సోయగాల శుకపాళి కలరవాల | ॥కుసుమాల॥ |
| జగమంత నీదులీలా.... ఆనందమధుర హేల | ॥జాబిల్లి॥ | ||
| చ: | సు: | మదిలోన మమత నీవే మనసేలు స్వామినీవే | ॥మదిలోన॥ |
| మురిపించు ఆశనీవే కరుణించి ఏలలేవే... ఏ.... | ||జాబిల్లి|| |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి