ఘంటసాల మాస్టారు కర్ణాటక సంగీతంలోనేకాక పలు హిందుస్తానీ రాగాలలో బాణీలు కట్టారు, పాడారు. వారికి బడే గులామ్ ఆలీఖాన్ సాహచర్యంతో హిందుస్తానీ సంగీతపద్ధతితో కూడ పరిచయం ఏర్పడి ఉభయ సంగీత వైదుష్యంతో తన ప్రతిభను మేళవించి ఎన్నో శాస్త్రీయమైన రాగాలను అనువర్తించి లలితసంగీతచక్రవర్తిగా కీర్తిభాజనులైనారు. గతంలో ఘంటసాల రాగశాలలో శుద్ధమధ్యమరాగాలైన చారుకేశి, నాటకప్రియ, ప్రతిమధ్యమరాగాలైన పంతువరాళి (కామవర్ధని), షణ్ముఖప్రియ, సింహేంద్రమధ్యమం వంటి జనక రాగాలు కాక పలుజన్యరాగాలైన ఆరభి-సామ-శుద్ధసావేరి, గంభీరనాట, విజయానంద చంద్రిక, హంసానంది, హిందోళాది కర్ణాటకసంగీత పద్ధతికి చెందిన రాగాలు, దేశ్, పటదీప్, ఫరజు, బేహాగ్, రాగేశ్రీ, సారంగ, హమీర్ కళ్యాణి (కేదార్), హేమంత్ మొదలయిన హిందూస్థాని పద్ధతికి చెందిన రాగాల ఆధారంగా అయా రాగాలలో ఘంటసాల మాస్టారు ఆలపించిన మధుర గీతాలు, శ్లోకాల నేపథ్యంలో గుప్తముగానున్న సప్త స్వరాల పునాదిని తెలుసుకున్నాం. వాటిని మనకు అందించిన చంద్రమౌళి గారికి ధన్యవాదములు. ఈ రోజు ఒక అపురూపమైన, అరుదైన రాగంలో మాస్టారు గమకించిన పాటను ఆ రాగస్వరూపాన్ని తెలుసుకుందాం. మరి మన రాగశాలలోకి అడుగుపెడదామా.
పశువులనైనా - పామరులనైనా, పసివాళ్ళనైనా - పండితులనైనా పరశింపజేసేది గానం. అది ఎలాంటి గానం? గాయనలక్షణాలు? కంఠమాధుర్యమా, త్రిస్థాయిసంచార సౌలభ్యమా? అక్షర స్పష్టోచ్ఛారణమా? పదనియుక్త భావస్పందనమా, ఇవన్నిటినీ మించి మనోహృదయాలను హరించే తనదైన అవర్ణనీయమైన ప్రావీణ్యమా? లేదా సద్యఃపరనిర్వృతియను రసానంద తన్మయత్వమునొసగు ఒక దైవికాంశమా? ఊహించలేముగాని, తను, తనువును వీడి నాలుగు దశాబ్దాలైనా, తన నాదశరీరంతో నేటికీ రసికుల రసనలపై రాజిల్లు మన పాటల దేవుడే ఆ లక్షణాలకు నిర్వచనం.
సాటిలేని శాస్త్రీయ సంగీతమార్గమున సాగే సామర్థ్యమున్ననూ, బ్రతుకు తెరువు తన విజ్ఞతను వెండితరవెనుక పండించుకొమ్మన్నది. ఒక పాటను గంటన్నరపాటు గాత్రకచేరిలో విస్తరించి నాదరసాలను, స్వరభోజనమును, వేయి విస్తళ్ళలో భూజనులకు వడ్డించగలిగే గాయకుని ప్రతిభ, రెండు మూడు నిమిషాల పాటల పళ్ళెములకు (గ్రామఫోను రికార్డులకు) పరిమితము గావలసి వచ్చింది. ఐననేమి? ప్రతిభావిష్కరణకు ఒక్క గంటో, గడియో కావలెనా? నిమిషంలో నాదనాకలోకమే ముంగిట నిలిచినట్లు, ఒక అపురూపమైన రాగగంగాప్రవాహన్ని తన గళమనే జటలో నిలుపుకొని చూపిన గానగంగాధరుడు ఆయన.
స్వరమాధుర్యమో, కంఠమాధుర్యమో, మనకు ఇష్టమైన గాయకుడు పాడినందుకో కొన్ని రాగాలు లేక కొన్ని పాటలు మన చిన్నతనంలోనే మనసులో ఝంకృతిస్తూ ఉండిపోతాయి. మరుగునబడ్డ మాణిక్యంలా, ఏదో వెదుకుతున్నప్పుడు మరేదో ప్రత్యక్షమైనట్టు ఒక సినిమాపాటలోని మధ్యన తళుక్కుమని నాగగాంధారి చెవులకెక్కింది ఒక అపూర్వ అనుభవం. నాగస్వర కచేరీలలో తప్పక వినబడే రాగం నాగగాంధారి. ఈ రాగంలో ఘంటసాల గళంలో ఒక పాటొకటున్నది అనే గుర్తింపు మన రాగశాలను రంజింపజేసే అంశమేగదా!
మనం ప్రస్తావిస్తున్న ఆ నాటి (1958) పాట వెనుకటి కొన్ని విశేషాలేమనగా, ఇది ఘంటసాల పాడిన అన్నిపాటలకన్నా చిన్నపాట. పాట నిడివి ఒకటింపావు నిమిషం! పాడిన పద్ధతి స్వరగమక శోభితమైన శుద్ధ శాస్త్రీయం. రాగం: నాగగాంధారి, తాళం: ఆది, సాహిత్యం : దేవులపల్లి, సంగీతం: అశ్వత్థామ. చిత్రం : "కార్తవరాయని కథ". సాధారణమైన జానపద కథయైననూ, ఈ పాట అందులోని ఒక గీతమాల మబ్బుల మధ్య మెరిసే అసాధారణమైన మెరుపుతీగ. ఘంటసాల ఏకగళగీతాలు ఎల్లప్పూడూ ఒకటవ శ్రుతిలోనే ఊంటాయి (C) . కాని, ఈ పాటకు అయన అందుకొన్నది మూడవ శ్రుతి (F).
పాటకు చిత్రకథాసందర్భం, శివవరప్రసాదియైన కథానాయకుని ప్రవేశఘట్టం. కాబోయే ప్రియురాలైన పసిపాప పవళించుటకు పాడే ఒక పాట. దాని ప్రక్కనే కథానాయకుడు పెరిగి పెద్దవాడైనాడని సూచిస్తూ ఒక సాకీ. వెంటనే గజారోహియైన నాయకుడి ప్రవేశము. అప్పుడు ఖంగుమని వినిపిస్తుంది ఘంటసాల గళం.
సాటిలేని శాస్త్రీయ సంగీతమార్గమున సాగే సామర్థ్యమున్ననూ, బ్రతుకు తెరువు తన విజ్ఞతను వెండితరవెనుక పండించుకొమ్మన్నది. ఒక పాటను గంటన్నరపాటు గాత్రకచేరిలో విస్తరించి నాదరసాలను, స్వరభోజనమును, వేయి విస్తళ్ళలో భూజనులకు వడ్డించగలిగే గాయకుని ప్రతిభ, రెండు మూడు నిమిషాల పాటల పళ్ళెములకు (గ్రామఫోను రికార్డులకు) పరిమితము గావలసి వచ్చింది. ఐననేమి? ప్రతిభావిష్కరణకు ఒక్క గంటో, గడియో కావలెనా? నిమిషంలో నాదనాకలోకమే ముంగిట నిలిచినట్లు, ఒక అపురూపమైన రాగగంగాప్రవాహన్ని తన గళమనే జటలో నిలుపుకొని చూపిన గానగంగాధరుడు ఆయన.
స్వరమాధుర్యమో, కంఠమాధుర్యమో, మనకు ఇష్టమైన గాయకుడు పాడినందుకో కొన్ని రాగాలు లేక కొన్ని పాటలు మన చిన్నతనంలోనే మనసులో ఝంకృతిస్తూ ఉండిపోతాయి. మరుగునబడ్డ మాణిక్యంలా, ఏదో వెదుకుతున్నప్పుడు మరేదో ప్రత్యక్షమైనట్టు ఒక సినిమాపాటలోని మధ్యన తళుక్కుమని నాగగాంధారి చెవులకెక్కింది ఒక అపూర్వ అనుభవం. నాగస్వర కచేరీలలో తప్పక వినబడే రాగం నాగగాంధారి. ఈ రాగంలో ఘంటసాల గళంలో ఒక పాటొకటున్నది అనే గుర్తింపు మన రాగశాలను రంజింపజేసే అంశమేగదా!
మనం ప్రస్తావిస్తున్న ఆ నాటి (1958) పాట వెనుకటి కొన్ని విశేషాలేమనగా, ఇది ఘంటసాల పాడిన అన్నిపాటలకన్నా చిన్నపాట. పాట నిడివి ఒకటింపావు నిమిషం! పాడిన పద్ధతి స్వరగమక శోభితమైన శుద్ధ శాస్త్రీయం. రాగం: నాగగాంధారి, తాళం: ఆది, సాహిత్యం : దేవులపల్లి, సంగీతం: అశ్వత్థామ. చిత్రం : "కార్తవరాయని కథ". సాధారణమైన జానపద కథయైననూ, ఈ పాట అందులోని ఒక గీతమాల మబ్బుల మధ్య మెరిసే అసాధారణమైన మెరుపుతీగ. ఘంటసాల ఏకగళగీతాలు ఎల్లప్పూడూ ఒకటవ శ్రుతిలోనే ఊంటాయి (C) . కాని, ఈ పాటకు అయన అందుకొన్నది మూడవ శ్రుతి (F).
పాటకు చిత్రకథాసందర్భం, శివవరప్రసాదియైన కథానాయకుని ప్రవేశఘట్టం. కాబోయే ప్రియురాలైన పసిపాప పవళించుటకు పాడే ఒక పాట. దాని ప్రక్కనే కథానాయకుడు పెరిగి పెద్దవాడైనాడని సూచిస్తూ ఒక సాకీ. వెంటనే గజారోహియైన నాయకుడి ప్రవేశము. అప్పుడు ఖంగుమని వినిపిస్తుంది ఘంటసాల గళం.
లోకము గులాబి తోట
నీకై పరచెను ప్రాయపు బాట
లోకము గులాబి తోట
నీకై పరచెను ప్రాయపు బాట
లోకము గులాబి తోట
కొమ్మ కొమ్మ కో కో యని అంటె
గుండె గుండె ఆహాయని వింటె
చెంతచెంత ఒక చెలియే వుంటె
చెవిలో గుసగుసమంటె
నీకై పరచెను ప్రాయపు బాట
లోకము గులాబి తోట
నీకై పరచెను ప్రాయపు బాట
లోకము గులాబి తోట
కొమ్మ కొమ్మ కో కో యని అంటె
గుండె గుండె ఆహాయని వింటె
చెంతచెంత ఒక చెలియే వుంటె
చెవిలో గుసగుసమంటె
(ఘంటసాల గళంలో నాగగాంధారి - లోకము గులాబి తోట)
చిన్న పాటైననూ దేవులపల్లి అందించిన అందమైన సాహిత్యం మననీయమై, ప్రాయం పరచిన బాటలో లోకెమే గులాబి తోటలా అనిపించి, కొమ్మలు కో కో యని పిలుచునుగదా! చెంతనొక చెలి, చెవిలో గుసగుసమంటె, గుండే ఆహా అనకతప్పదు! పాటను వింటే మన గుండెలోనూ ఆహాలు ఆహ్లాదంగా వినిపించకపోవు. బాణీకట్టిన అశ్వత్థామ,పాటకుముందు వినబడే నేపథ్యవాద్యాల స్వరవిశేష గమకవిన్యాసంలోనే నాగగాంధారి రాగస్వరూపాన్నిమీగడగట్టి తన ప్రతిభను నిరూపించుకొన్నారు. పంచమమునుండి అవరోహణ-ఆరోహణ, దాటు వరసల చతుస్వర గమకాలు ఎదుగుతూ పై షడ్జముజేరి, రాబోవు పాటకు ఆధార శ్రుతిని నిర్ణయించినట్టున్నది ఆ కూర్పు. సూక్ష్మంగా గమనిస్తే, ఈ విన్యాసం ఒక పిల్లవాడు ఎలా క్రమంగా పెరిగి, ఏనుగు మీద కూర్చొన్నంత ఎత్తుకు ఎదిగిపోయాడో అనే సంగతిని చిత్రకథలో ధ్వనింపజేస్తున్నది.
సదపమ పదనిస రినిదప దనిసరి గసనిద నిసరిగ మరిసని సదపమ పాదాసా (వాద్యసంగీతోపక్రమము)
లో కము గు
లా.....బి తో.ట ..ఆ..
సా.రిమ పాసనిసాని దపాపా..
నఠభైరవి జన్యమైన నాగగాంధారి మూర్ఛన : సరిమగమపదనిస - సనిదపమగరిస. "సంపూర్ణా నాగ గాంధారీ ఆరొహేచ గ వర్జితా’ అని వేంకటమఖి రాగలక్షణమును నిర్వచించినా. ’సరిగమప’ వాడక, సరిమగరి, సరిమప, సరిగరిమప లాంటి వరసలు వస్తాయి. ఈ రాగంలో ప్రఖ్యాతిగాంచిన ఏకమాత్ర కృతి, ముత్తుస్వామి దీక్షితుల ’సరసిజనాభ సోదరి’ కీర్తన. ’సరిమపమగ (సరసిజ) పాప (నాభ) అంటూ నాగగాంధారి స్వరాలపై సాగుతుంది ఆ కీర్తన. ఈ పాట, లోకము గులాబి తోట.. సారిమ పసాని దపపా ...పమగరిసా అంటూ అవే స్వరాల నూతనమైన కూర్పుతో ఘంటసాల పాట మొదలౌతుంది. గులాబి, తోట, బాట అన్న పదములు పలికినప్పుడు మంచి సంగతులూ మనకి వినిపిస్తాయి.
పల్లవి కొనసాగిస్తూ,
నీ .. కై
పరచెను ప్రాయపు బా... టా... ఆ........................................ || లో||
పదాపమ గమపస పనిసరి గరిరిస
సరిసని సా నిరి సరి నిస దని పా
(ప్రాయపు) బా....టా అన్నచోట వాడిన స్వరాలు, గమకమధురిమల గుత్తులు. ఈ పాటకు పల్లవియొక్క ఉత్తరభాగమే అనుపల్లవి అనుకోవాలి. ఇక చరణానికొస్తే, నాగగాంధారి రాగములోని ఏకీర్తనలోనూ లేని అపురూపమూ క్లిష్టమూ ఐన సంగతులను గమకించారు మాస్టారు.
కొమ్మ కొమ్మ కో కో యని అంటె
పాద సాస సరి సరి
రిస రిమాగ
కీర్తనలలో చరణము అనబడే పంక్తులు పంచమంతో మొదలై మధ్యస్థాయిలోనే ఉంటాయి. కాని, కోమ్మ కోమ్మ (పాద సాస) కోకోయని అంటె...ఇక్కడ మంద్ర స్థాయి స్వరములు లేనేలేక, మధ్యమ స్థాయిస్వరమైన పంచమాన్ని అండగా తాకి, తారస్థాయిలో గాంధార మధ్యమాలలో విహరిస్తుంది ఘంటసాల గళం. బారెడు వీణలోని త్రిస్థాయిస్వరాలన్నీ ఆయన అంగుళాల కంఠలో ఎలా చేరుకొన్నవో! ఇక్కడి చరణాల నాల్గుపంక్తులకు అశ్వత్థామ కట్టిన బాణి బహునూత్నమైన విన్యాసాల కూర్పు. నాలుగు పంక్తులూ నాలుగు వరుసలుగా, ప-ద-స-రి-మా-గా (కొమ్మ కొమ్మ), ని-ద-ని-స-ద-పా (గుండె గుండె), ని-ద-ని-ద-ప-స (చెంతచెంత), ప-మ-గ-గ-రి-స (చెవిలో) విన్యాసంజేసి కట్టినబాణికి జీవంపోసి, ఘంటసాల అప్పటి తన మధుర పటిష్టమైన గళంతో గమకాలతో ఈ పంక్తులను అలంకరించారు. "గుండె గుండె ఆహాయని వింటె" అన్నపుడు "ఆహా" అన్న పదానికి ఆయన గళం పలికిన ’దనిసరిగమగరిసనిదప..’ మొదలైన స్వరాలలో ’అపూర్వమైన అనుభూతి కలిగినది’ అనే భావాన్ని సూచించడానికి అన్యస్వరమైన చతుశ్రుతి దైవతము (ద2) తొంగిచూస్తుంది. ఈ పాటకు ప్రాథమిక స్వరాలను మాత్రెమే సూచిస్తున్నాను తప్ప ఆయన వాడిన గమకాలను స్వరములతో ఇక్కడ వ్రాయలేను. (ఎర్రటి అక్షరాలు స్వరముయొక్క తారస్థాయిని సూచిస్తున్నదని గమనింతురుగాక)
గుండె గుండె ఆహాయని వింటె
నీద2 నీనీ ద2నిసరిసని ద2నిద1ప
చెంతచెంత ఒక చెలియే వుంటె
నీద నినినిని దని దనిసరిస నిదపా సా
చెవిలో గుసగుస
మంటె
పపదాసాద పపమగ మపామా మగగరిరిస
నాగగాంధారి, షాడవ సంపూర్ణ ఉత్తరాంగ ప్రధానమైన రాగము. అనగా రాగ విస్తరణ మరియు సంచారములన్ని ’పదనిస’ స్వరాలపైనే. ధైవత గాంధారాలు వాది సంవాది స్వరాలు. నాగగాంధారి రాగానికి దగ్గరగానున్న రాగాలు, జోన్పురి మరియు జింగ్లా. అన్నమయ్య కీర్తనలు ఈ రాగంలో పదిహేనుకు పైగా ఉన్నట్టు కనిపిస్తాయిగాని, నేనింకా వినలేదు. ఈ రాగంలో త్యాగరాజ దివ్యనామ సంకీర్తన, "ఓ రామ", ముత్తయ్య భాగవతార్‍కృతి "భజామ్యహం అవ్యయం పార్వతీశం", ఇలాంటివున్ననూ, దీక్షితుల రెండు కృతులే (సరసిజనాభ సోదరి, నాగగాంధారి రాగనుతే) ఈ రాగంలో ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి.
సంగీత గ్రంథాలలో నాగగాంధారి మూర్ఛనలో తేడాలున్నాయి. ఈ రాగానికి మూలం 20వ మేళమైన నఠభైరవియైతె, ఇదే రాగాన్ని (ఇందున్న చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం కైశికినిషాదం స్వరాలను మార్చకుండా), 22వ మేళమైన ఖరహహప్రియ మరియు 23వ మేళమైన గౌరీమనోహరి రాగలలో నిష్పన్నమైనదనియూ తార్కికంగా సాధించవచ్చు. నాగగాంధారి రాగానికి ఎన్నో రకములైన మూర్చనలను గ్రంథాలు చూపుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవాటిని క్రింద గమనించగలరు.
nAgagAndhAri-22-N S R G M P D N/N D P M G R S Nసంగీత గ్రంథాలలో నాగగాంధారి మూర్ఛనలో తేడాలున్నాయి. ఈ రాగానికి మూలం 20వ మేళమైన నఠభైరవియైతె, ఇదే రాగాన్ని (ఇందున్న చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం కైశికినిషాదం స్వరాలను మార్చకుండా), 22వ మేళమైన ఖరహహప్రియ మరియు 23వ మేళమైన గౌరీమనోహరి రాగలలో నిష్పన్నమైనదనియూ తార్కికంగా సాధించవచ్చు. నాగగాంధారి రాగానికి ఎన్నో రకములైన మూర్చనలను గ్రంథాలు చూపుతున్నాయి. వాటిలో ముఖ్యమైనవాటిని క్రింద గమనించగలరు.
nAgagAndhAri-20-S R G M P DD N/D P M G R S N
nAgagAndhAri-20-S R G M P D N/D P M G S
nAgagAndhAri-22-S R G M P D N/D P M G R S
nAgagAndhAri-20-S R M G M P D N S/S N D P M G R S
nAgagAndhAri-22-S R G M P D N/N D P M G R S
nAgagAndhAri-20-S R G M P D N/N D P M G R S N
nAgagAndhAri-23-S R M P D N S/S N D P M G R S
nAgagAndhAri-23-S R G R M P D N S/S N D P M G R G S
ముఖ్యముగా రెండు ప్రముఖ గ్రంథాలలో నిర్ణయించిన మూర్చనను గమనిస్తే, మొదటిది త్యాగరాజ సంప్రదాయానికి చెందినది (సరిగమపదని నిదపమగరిసని - సంగీత స్వరప్రస్థార సాగరము - నాథముని పండితులు ప్రచురణ 1909). దీనిని నిషాదాంత్యరాగమనీ కొన్నిచోట్ల పేర్కొన్నారు. అంతిమంగా ఇక్కడ నిర్ణయించుకొన్న మూర్చన, సరిమగమపదనిస సనిదపమగరిస (సంగీత సంప్రదాయ ప్రదర్శిని - ముత్తుస్వామిదీక్షితర్ ప్రచురణ 1910). వేంకటమఖి లక్షణించి ముత్తుస్వామి దీక్షితులు నియుక్తించిన మూర్చనే నేటికీ నాగగాంధారిగా ప్రాచుర్యంలో ఉన్నది. సలక్షణంగా ఆ రాగాన్ని సంగీతకళానిధి మహారాజపురం సంతానం గళంలో ఇక్కడ వినగలరు.
(నాగ గాంధారిరాగనుతే - దీక్షితర్ - మహారాజపురం సంతానం)
అందరికీ
వినాయక చతుర్థి శుభాకాంక్షలు
Great article sir.what a flowery language sir.
రిప్లయితొలగించండి“అమర గాయక” ఘంటసాల వారి పై శ్రీ కాళ్ళూరి రామరాయ కవి (విశ్రాంత మండల విద్యాశాఖాధికారి) సీస మాలిక
రిప్లయితొలగించండిసీ. ఎవని గాత్రము చెవికేగ తెలుగు వారు
సానంద పారవశ్యమ్ము నొంద్రు ?
ఎవని గాత్రము నందు కృష్ణుడే యొదిగి గీ
తను మరల భువికందగను జేసె ?
ఎవని గాత్ర మహిమన్ యెల్లెడల జయంతి
వర్ధంతులకు నుత్సవాలు జరుగు ?
ఎవని గాత్రపు కల్మి ఎన్టియారేయ్నారు
లిల చిత్ర సీమను యేలినారు ?
ఎవని గాత్ర స్ఫూర్తి యేకలవ్యపు శిష్య
కోటుల కీర్తికి బాట వేసె?
ఎవని గాత్రము నందు నేస్థాయి నందైన
పురుష స్వర మధురమ్మొక్క వోదు ?
ఎవని గాత్రమ్మున నవరసాలత్యంత
సొగసుగా నర్తించి శోభనొందె ?
ఎవని గాత్రపు హేల దివిజేరునన్విని
తుంబురు నారదుల్ తొట్రు పడరె ?
ఎవని గాత్రమ్ముతో నెల్ల దైవంబులు
పాడించుకొని ప్రీతి పరవశించె ?
ఎవని గాత్ర రవమ్ము యెందరో కవుల
రచనలకే యిల ప్రాణమూదె ?
తే.గీ. వివిధ రాగాల వంటల విందు జేసి
ధర జనాళికి రుచులెన్నొ ధారవోసి
దివి జనావళి నలరింప దీప్తిజనిన
ఆతడే! ఘంటసాల ! స్వరాలవాల !
వీరు శ్రీ కాళ్ళూరి రామారావు (రామరాయకవి) ఘంటసాల మాష్టారికి ఏకలవ్య శిష్యులు. వారికోసం ఏదైనా చేస్తారు. అనేక వందల ఘంసాల పాటల ప్రథమ బహుమతులు పొందారు. వయస్సు 68. మాష్టారుకు చెందిన అనేక అమూల్యమైన విషయాలు సేకరించారు.
రిప్లయితొలగించండికొత్త పాట (నాకు) మంచి రాగం లోది పరిచయం చేశారు. బ్రహ్మాండం గా పాడారు ఘంటసాల గారు.
రిప్లయితొలగించండిసవరణ. ఆఖరి యూట్యూబ్ లో పాడింది మహారాజపురం సంతానం గారు కాదు, వారి సంతానం, మహారాజపురం శ్రీనివాసన్ గారు :-)
శ్రీనివాస్