29, ఏప్రిల్ 2012, ఆదివారం

సంగీత కచేరీలో అదనపు చరణంతో సుశాస్త్రీయంగా మాస్టారు ఆలపించిన దినకరా శుభకరా

ఘంటసాల మాస్టారు అనేక సందర్భాలలో సంగీత కచేరీలు ఇచ్చారు. అయితే అందులో కొన్ని మాత్రమే లభ్యమవుతున్నాయి.  మాస్టారు ప్రతి కచేరిలోను తను  సంగీత దర్శకత్వం వహించిన  "వినాయక చవితి" చిత్రంలోని శ్లోకాలు, ముఖ్యంగా "దినకరా శుభకరా" పాటను విధిగా పాడేవారు. ఈ చిత్రానికి శ్రీ సముద్రాల రాఘవాచార్యులు గారు పాటలు, పద్యాలు వ్రాయడమే కాకుండా, దర్శకత్వం కూడ వహించారు. సాధారణంగా సినిమాలలో పాటలకు కొన్ని నిర్దిష్టతలు, పరిధులు వుంటాయి. చిత్రం నిడివిని బట్టి, పాటల సంఖ్యను బట్టి ఒక్కోసారి సంగీత దర్శకునికి తన ప్రతిభను పూర్తిగా ప్రదర్శించడానికి అవకాశం దొరకదు. అందువలన కొందరికి ఆయా సంగీత దర్శకులను కేవలం లలిత గీతాలను మాత్రమే పాడించగలరు, లేదా పాడగలరు అన్న అపోహ వుండే అవకాశముంది.  ఇక్కడ మాస్టారు కలకత్తాలో ఇచ్చిన సంగీత కచేరీలో స్వరసంగతులతో సుశాస్త్రీయంగా, ఇంతకుముందు సినిమాలో వినని అదనపు చరణంతో గానం చేసిన "దినకరా శుభకరా" పాటను పొందు పరుస్తున్నాము. అయితే ఈ క్రొత్త చరణం చిత్రం యొక్క ఒరిజినల్ సౌండ్ ట్రాక్ లో కూడా లేదు. బహుశ దీనిని ముందు కంపోజ్ చేసి,  పాట లేదా చిత్రం యొక్క నిడివిని  తగ్గించడానికి చిత్రంలో ఉపయోగించలేదేమో తెలియదు.  ఇది వింటే మాస్టారి సంగీతజ్ఞానం, సమర్ధతలు ఎంత లోతుగా వున్నాయో తెలుస్తుంది. మాస్టారు పాడిన తీరు, వాడిన గమకాలూ, వేసిన సంగతులు అపూర్వం. ఆ గానం వింటూంటే మనసు పరవశిస్తుంది, ఏదో తెలియని అమరలోకాలలో విహరిస్తున్నట్లు వుంటుంది. బహుశా ఇదేనేమో గంధర్వ గానం అంటే.

ప్రియమిత్రులు, సంగీతజ్ఞులు అయిన శ్రీ ఎం.ఆర్. చంద్రమౌళి గారు "ఘంటసాల-రాగశాల" అనే ఉప శీర్షికలో ఇక నుండి పాటల, పద్యాల రాగ లక్షణాలను వివరిస్తారు. శ్రీ మౌళి గారికి శత సహస్ర నమో వాకములు.

పంతువరాళి రాగం లో స్వరపరచిన ఈ పాట, ఘంటసాల గారి శాస్త్రీయ సంగీత నైపుణ్యతకు ఒక్క నిదర్శనమైతే, ఈ రాగంలో ఎన్నో వాగ్గేయకార్ల కృతులున్నప్పటికీ సముద్రాల రాఘవాచార్యులు వ్రాసిన ఈ గీతం అన్నిటికన్నా బహుళ ప్రజాదరణ పొంది, చిరస్మరణీయమై నిలిచిన అంశం మరొక ప్రత్యేకత.  పంతువరాళి, 51వ మేళకర్త రాగము. షడ్జమం (S), శుద్ధ రిషభం (R1), అంతర గాంధారం (G3), ప్రతిమధ్యమం (M2), పంచమం (P), శుద్ధ ధైవతం (D1), కాకలి నిషాదం (N3) అనే సప్త స్వరములు పలుకునది  సంపూర్ణ రాగము. సరళంగా చెప్పాలంటే, కర్ణాటక సంగీత శిక్షణకు నేర్పే మౌలికమైన 15వ మేళకర్త రాగమైన "మాయామాళవగౌళ" రాగంలో శుద్ధ మధ్యమం బదులు ప్రతి మధ్యమం ఉపయోగిస్తే అది పంతువరాళి అవుతుంది. పంతువరాళి రాగంలోని జీవస్వరాలు: గాంధార, ధైవత, మధ్యమ పంచమములు. చలనచిత్రంలోని ఈ పాటలో బ్రహ్మ,విష్ణు,పరమేశ్వరరూపా…అన్న చోట ఆలాపనలో, మాస్టారు, గాంధార-మధ్యమ స్వరాలకు జీవంపోసి భావవిస్తారం చేసిన విధానం, ఆయన శాస్త్రీయ గానవైదుష్యానికి తార్కాణం. ఘంటసాలగారు సంగీత దర్శకత్వం వహించిన, 1963 లో విడుదలైన చిత్రం "వాల్మీకి"లో, నారద పాత్రధారి కీ.శే. రఘురామయ్య (ఈలపాట) గారిచే ఈ రాగంలోనే పాడించిన “హరే నారాయణ” అన్న పాటలో “దినకరా” లోని కొన్ని ప్రత్యేక గమక ప్రయోగాల ఛాయలు కనిపిస్తాయి.
          పంతువరాళి రాగాన్నే కాశిరామక్రియ లేదా కామవర్ధిని అని కూడ పిలుస్తారు. కర్ణాటక సంగీతంలోని “నిన్నే నెర నమ్మినానురా”, “శివశివశివ యనరాదా”, “శంభోమహదేవ”, “అప్ప రామభక్తి యెంతో గొప్పరా”, “వాడేరా దైవము మనసా” మొదలగు కృతులు పంతువరాళి రాగంలోని ప్రసిద్ధమైన త్యాగరాజ స్వామి రచనలు. భక్తి పారవశ్యాన్ని ధ్వనించే ఈ రాగంలోని ఎన్నో కృతుల ప్రారంభిక స్వరం, పై షడ్జమం. "నిన్నే నెర నమ్మినానురా", "శివశివశివ యనరాదా", "శంభోమహదేవ" ఈ మూడు కృతుల ప్రారంభ స్వరము - నిషాద గమకంతో వినిపించే పై షఢ్జమం. మాస్టారు సైతం ఈ రాగ రహస్యాన్ని గమనించి, పల్లవిని పై స్థాయి షడ్జమంతో ఆరంభించి “నిదపా.. (దినకరా)” అంటూ స్వరపరచడం విశేషం. ఆ విధంగా నినిసా..(దినకరా..) అన్న ఆలాపనతో ప్రారంభమై, నిదపా..(దినకరా), మగమపా..(శుభకరా) గమగా..(దే..వా). రిగగమ..(దీ..నా)..గరిసా..( ధారా)..రిగగ మాపాద.. (తిమిర సంహార)..అని పాట సాగుతుంది. పైన ఉదహరించిన కీర్తనల పేర్లు మన నవతరం వినకున్నా, "దినకరా శుభకరా" గీత గానం అందరికీ కర్ణ రంజకమే.
          ఈ రాగం యుక్క ప్రయోగం ఘంటసాల పాటలలో కొన్నింటికే పరిమితమైనా, అనేకమైన పద్యాలు ఈ రాగవేషం ధరించి ఆయన కంఠశ్రీ భావనటనతో వెలువడ్డాయి. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కమనీయ కావ్యఖండిక అయిన  "పుష్ప విలాపం"లోని “గాలిని గౌరవింతుము సుగంధము పూసి” అంటూ ప్రారంభమయ్యే ఉత్పలమాల గాని, "మహాకవి కాళిదాసు" చిత్రంలోని శ్యామలా దండక భాగం “కామలీలా ధనుః సన్నిభ భ్రూలతా” గాని, "పల్నాటి యుద్ధము" లోని “పుట్టింపగలవు నిప్పుకల కుప్పల మంట” అను బ్రహ్మనాయకుని నిర్వేద భావసూచకమైన సీస పద్యం కాని పంతువరాళికి వరమైన దర్పణాలు. అంతేకాక ప్రత్యేకించి, భగవద్గీత ఆరంభ ధ్యాన శ్లోకం “పార్థాయ ప్రతిబోధితాం” అను శార్దూలవిక్రీడిత వృత్తానికి ప్రథమ స్ధానాన్నిచ్చి పంతువరాళి రాగంలో స్వరపరడం, ఈ రాగంపట్ల మాస్టారికి గల మక్కువను సూచిస్తుంది.

 దినకరా శుభకరా వీడియో:  మూలం - రమేష్ పంచకర్ల



కలకత్తా కచేరీలో మాస్టారి పాట: మూలం - ఘంటసాల గాన చరిత


సాకీ: దినకరా…  దినకరా… హే! శుభకరా…

పల్లవి: దినకరా.. శుభకరా.. | దినకరా |


దినకరా శుభకరా దేవా


దీనాధారా తిమిర సంహార 


దినకరా శుభకరా దేవా


దీనాధారా తిమిర సంహార 


దినకరా.. శుభకరా..

చరణం: సకల భువన శుభ కారణ కిరణా..ఆ..ఆ.. | సకల భువన |


మౌనిరాజ పరి పూజిత చరణా.. | సకల భువన |


నీరజాత ముఖ శోభన కారణ  | నీరజాత ముఖ |


దినకరా.. శుభకరా.. దేవా


దీనాధారా తిమిర సంహార 


దినకరా శుభకరా

చరణం: పతిత పావనా మంగళ దాతా


పాప సంతాప లోక హితా | పతిత పావనా |


పతిత పావనా మంగళ దాతా (2) పాప సంతాప లోకహితా


……(వాద్యం)


పతిత పావనా మంగళ దాతా (2) పాప సంతాప లోకహితా | పతిత పావనా |


……(వాద్యం)


పపా… మపదా మపా గామపా.. 


మమదా మమనీ దా నిదపామ పతిత పావనా..


……(వాద్యం)


పపదా మమపా గగమా రిరిగా సా.రీ.గామ పతిత పావనా..


ససాస నిరిస నిసదా.. మదనిరిసదా


మదనిసా నిరిసని సదపమ పగమరిగ సారిగమ పతిత పావనా..


……(వాద్యం)


పాదప మదపమ గరిసని సరిగమ.. పతిత పావనా..


……(వాద్యం)


సాస సాస సని సగరిరి సనిసరి 


సనిరిసనిద   దనిససనిదపనిదప


మదపమగరిసని ససాసారిగమ పతిత పావనా..


……(వాద్యం)


పావనా..మంగళ దాతా పాపసంతాప లోకహితా


బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర రూపా ఆ..ఆ..ఆ.. (4)


బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర రూపా వివిధ వేద విజ్ఞాన నిధానా (2)


వినతలోక పరిపాలక భాస్కర (2)


దినకరా శుభకరా దేవా! దీనాధారా తిమిర సంహార


దినకరా.. హే! దినకరా.. ప్రభూ దినకరా శుభకరా


* * *
కృతజ్ఞతలు:  ఆడియో ఫైల్సు సమకూర్చిన ఘంటసాల గాన చరిత వెబ్ సైటుకు, సాంకేతిక వివరాలు అందించిన ఘంటసాల గళామృతము పాటల పాలవెల్లి బ్లాగుకు,  ఘంటసాల - రాగశాల వివరాలు తెలిపిన శ్రీ ఎం.ఆర్.చంద్రమౌళి (బెంగుళూరు) గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

16 కామెంట్‌లు:

  1. ఏ సాధన చేయకుండా ఏ దేవునికీ ప్రార్ధన చేయకుండా అమృతం దొరకడమంటే ఇదేనేమో.
    ధన్యవాదాలు చెప్పడం తప్పించి ఇంకేం చెయ్యగలం.
    ప్రేమతో
    ఎం.ఆర్.సుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ సుబ్రహ్మణ్యం గారు, మీ స్పందనకు, నా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  2. Compliments to both Sri.Chandramowly gAru and Sri. Suryanarayana gAru for enrichment and value added information to understand and appreciate invaluable music knowledge of Sri Ghantasala mAstAru.

    రిప్లయితొలగించండి
  3. Sreenivasa garu, thanks for your kind words. I am blessed to have my dear friend Mowli garu from whom we can learn lot of things about music with particular reference to Mastaru's works.

    రిప్లయితొలగించండి
  4. అజ్ఞాతమే 02, 2012

    Dhanyosmi. Karana Janmulaina Sri Ghantasala gari gutinchi yevaru vivarinchina tanivi teeradu. Meeku hrudayapoorvaka namassumanjalulu. Alage pantuvarali raga goppatananni Ghantasalagaru Rakta sambandam chitramlo Ramaraogaru desatana ghattamlo humming chestu aa sandarbga bhaavanni tana gontulo ee ragamlo vinipanchi mana mansunu teliyani udveganiki guricheyincharu. daya chesi okasari pariseelinchagalaru.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాత గారు, క్షమించాలి. మీ పేరు తెలుపలేదు. నవరసాలు పలికించగల మేధావి ఘంటసాల మాస్టారు. సాహిత్యాన్ని క్షుణ్ణంగా అర్ధంచేసుకుని, ఎవరికి పాడుతున్నారో ఆ పాత్రను పూర్తిగా ఆవహింపజేసుకుని, అందుకు తగిన విధంగా భావాన్ని రాగంతో మేళవించి మన మనసులలో లోతుగా నాటుకునేలా ఆలపించగల గాన గంధర్వులు శ్రీ ఘంటసాల మాస్టారు. అటువంటి వ్యక్తి న భూతో న భవిష్యతి. మీ సూచనలను తప్పక పరిశీలించగలమండి. మీ స్పందనకు, ఈ బ్లాగు దర్శించినందులకు ధన్యవాదాలు.

      తొలగించండి
  5. రాగ స్వభావాన్ని విశ్లేసిస్తూ చేసిన వ్యఖానం, మాస్టారుగారు తన రాగ విన్యాస కౌశలాన్ని కలకత్తా కచేరిలో ప్రదర్శించిన తీరు బహు శ్లాఘనీయం, పరమానందభారితం. ఇంత చక్కటి అపురూపమైన మాస్టారి గాత్రంలో పాట వినిపించినందుకు శ్రీ సూర్యనారాయనగారికి మనః పూర్వక అభినందనలతో కూడిన అభివందనాలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ శ్రీనివాస మూర్తి గారు ధన్యవాదాలు. రాగ విశ్లేషణ చేసి వివరించి మిమ్మల్ని అలరించిన ఘనత మిత్రులు శ్రీ చంద్రమౌళి గారిది. నేను సమిధను మాత్రమే. మీ స్పందనకు సంతోషం.

      తొలగించండి
  6. శ్రీ వేలుమూరి సూర్యనారాయణ గారికి నమస్కారం.కీ.శే.ఘంటశాల వేంకటేశ్వర రావుగారి కలకత్తా కచేరిలో పాట దినకరా శుభకరా యనే పాటలో ఒక చరణం సినిమాపాటలో లేనిది ఇక్కడ యుందని చూసేను.పాట మెత్తం విన్నాను.నాకు సంగీతం రాదు కాని వారి ఆలాపనలో సూర్యోదయాన్ని చూసేను.నిత్యంచేసే గాయత్రి అనుభూతి,దినకరుని శుభ గభస్తి చయమ్ముల మృదు మధుర స్పర్శానుభూతిని వారి ఆలాపనలో అనుభవించేను.ఇదియొక మధురానుభవం.దీనిని పంచిన మీకు,శ్రీ చంద్రమౌళిగారికి,కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములు-గంటి లక్ష్మీనరసింహమూర్తి(బెంగుళూరు)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ లక్ష్మీనరసింహ మూర్తి గారికి తొలుదొలుత మా బ్లాగు దర్శించినందుకు నమో వాకములు. మాస్టారు తనకు గల అమితమైన సంగీత జ్ఞానం వలన ప్రతి మాటకు, పదానికి, భావానికి జీవం పోసి పాడారు. అందుకే అజరామరమైనది వారి గళం. అది జగనంగళం. మీకు కలిగిన స్పందనకు చాల సంతోషం. మిత్రులు మౌళి గారి స్వర పరిచయం నాకొక భాగ్యం. పంతువరాళి కాక మరికొన్ని రాగాలు - మలయ మారుతం, దేశ్, హిందోళం లో మాస్టారి గానం, గాన ప్రక్రియల గురించి ఘంటసాల-రాగశాల లో చూడగలరు. శలవు మరి.

      తొలగించండి
  7. ఈ పాట పంతువరాళి లో వుందని యిప్పుడే నాకు తెలిసింది.కలకత్తా కచేరీ లో పాడిన అదనపు చరణం కూడా వినే అదృష్టం దక్కింది.దీనికి ఈ బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ రామకృష్ణ మూర్తి గారికి, మా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదములు. బ్లాగుకు కుడి చేతి ప్రక్కన యిచ్చిన సూచికలో ఇంతవరకు వివిధ రాగాల లో మాస్టారు పాడిన / కట్టిన బాణీల వివరాలు ఉన్నాయి. చూడగలరు.

      తొలగించండి
  8. ఇటువంటి ఒక rare రత్నాన్ని మాకు ప్రసాదించి, రాగాలాపన స్వరాలతో మాస్టర్ గారు గానం చేసిన అమృతాన్ని మాకు పంచి ఇచ్చిన శ్రీ సూర్యనారాయణ గారికి, ప్రసస్త్యాన్ని విపులంగా విశదీకరించి వ్రాసిన శ్రీ చంద్రమౌళి గారికి మా కృతజ్ఞతలు.

    NS Prakasa Rao
    Play Back Singer

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీ ప్రకాశరావు గారికి, మా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదములు.

      తొలగించండి
  9. Ituvanti sandarbhalu chaala patalalo kanipistayi eavyevidhamgala patalu rentini daggara petti vinipiste easyga catch cheyyavachu-Ofcourse mindlo vuntundanukondi! Ventane instantaneous ga burralokiyvelutundi without any reference. Calcutta programme tape lonie undi record avaledanukuntanu-clarity tape lo kanipinchaledu Ramesh gari krushi ananya samanyam !

    రిప్లయితొలగించండి

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (2) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కథానాయిక మొల్ల-1970 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్నతల్లి-1972 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (3) చి-పరోపకారం-1953 (3) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-ప్రేమలు పెళ్ళిళ్ళు-1974 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (4) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (4) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (2) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (4) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (2) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కధ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీదేవి-1970 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964 (6) చి-శ్రీసింహాచలక్షేత్రమహిమ-1965 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (3) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (4) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (6) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (87) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (55) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (36) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.ఎస్.విశ్వనాథన్ (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (13) సం-ఓగిరాల (2) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (3) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (85) సం-జి.కె.వెంకటేష్ (1) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (33) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (6) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (40) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (1) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (4) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (4) సం-విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్ (3) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (15) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (20) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (41) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొనకళ్ళ (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-డా. సినారె (1) ర-డా.సినారె (2) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (4) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (27) ర-బమ్మెఱ పోతన (2) ర-బలిజేపల్లి (1) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భక్త నరసింహ మెహతా (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (3) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (5) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (29) ర-సదాశివ బ్రహ్మం (8) ర-సదాశివబ్రహ్మం (1) ర-సముద్రాల జూ. (25) ర-సముద్రాల సీ. (44) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1)