1972 సంవత్సరంలో విడుదలైన సౌభాగ్య కళా చిత్ర సంస్థ నిర్మించిన శభాష్ పాపన్న చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీల తో పాడిన అనురాగరాశీ ఊర్వశీ అనే ఈ యుగళగీతం రచన ఆరుద్ర, స్వరపరచినది ఎస్.పి.కోదండపాణి. ఈ చిత్రంలో తారాగణం జగ్గయ్య, సావిత్రి, విజయనిర్మల, నాగయ్య, రాజబాబు, విజయభాను. ఈ చిత్రానికి నిర్మాత డి.రామారావు మరియు దర్శకుడు షహీద్ లాల్.
| యుగళగీతం | అనురాగ రాశి.. ఊర్వశి | |
|---|---|---|
| చిత్రం: | శభాష్ పాపన్న (1972) | |
| సంగీతం: | కోదండపాణి | |
| గీతరచయిత: | ఆరుద్ర | |
| నేపధ్య గానం: | ఘంటసాల, పి.సుశీల | |
| పల్లవి : | ఘ: | అనురాగ రాశి.. ఊర్వశి |
| నా ఆనంద సరసి.. ప్రేయసి | ||
| నా ఆనంద సరసి.. ప్రేయసి | ||
| సు: | మనసార వలచే మన్మధ.. | |
| నా కనులందు వెలిగే దేవతా | ||
| నా కనులందు వెలిగే దేవతా | ||
| చరణం: | ఘ: | మనసే పూచిన మధువనమైతే.. మమతే కమ్మని తావి సుమా.. |
| ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ | ||
| సు: | ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ | |
| ఘ: | మనసే పూచిన మధువనమైతే.. మమతే కమ్మని తావి సుమా | |
| తనువే పొంగి తరంగమైతే.. | ||
| తనువే పొంగి తరంగమైతే.. తలపే నురగల జిలుగు సుమా.. | ||
| సు: | మనసార వలచే మన్మధ.. నా కనులందు వెలిగే దేవతా | |
| చరణం: | సు: | వయసే మంజుల వేణువు అయితే.. హొయలే మోహన గీతి సుమా |
| ఘ: | ఆ..... ఆ..... ఆ..... ఆ...... ఆ..... ఆ...... ఆ.. | |
| సు: | ఆ..... ఆ..... ఆ..... ఆ...... ఆ..... ఆ...... ఆ.. | |
| వయసే మంజుల వేణువు అయితే.. హొయలే మోహన గీతి సుమా | ||
| సొగసులు కర్పూర శిలలే అయితే | ||
| సొగసులు కర్పూర శిలలే అయితే... వగలే అరని జ్యోతి సుమా.. | ||
| ఘ: | అనురాగ రాశి.. ఊర్వశి ... నా ఆనంద సరసి.. ప్రేయసి | |
| చరణం: | సు: | మేఘము నీవై.. మెరుపును నేనై.. మృదుమాధుర్యం కురవాలి |
| ఘ: | రాగము నేనై.. రాగిణి నీవై... రసవాహినిగా సాగాలి | |
| సు: | మనసార వలచే మన్మధ.. నా కనులందు వెలిగే దేవతా | |
| నా కనులందు వెలిగే దేవతా | ||
| ఇద్దరు: | ఆహహాహా హాహా హ హా | |
| ఊ హు హూ హు హూ హూ హు హూ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి