1972 సంవత్సరంలో
విడుదలైన వీనస్ మహీజా సంస్థ నిర్మించిన బాల భారతం చిత్రం
నుండి ఘంటసాల పాడిన “నారాయణ నీలీల నవరసభరితం” అనే
ఈ ఏకగళగీతం రచన ఆరుద్ర, స్వరపరచినది ఎస్.
రాజేశ్వరరావు. ఈ చిత్రంలో తారాగణం
ఎస్.వి. రంగారావు, అంజలీదేవి,
బేబి శ్రీదేవి, కాంతారావు, ఎస్. వరలక్ష్మి, హరనాధ్
ఈ చిత్రానికి నిర్మాత సి.హెచ్.ప్రకాశరావు
మరియు దర్శకుడు కె.కామేశ్వరరావు.
#0000 | ఏకగళం | పాట: | నారాయణ నీ లీల నవరసభరితం |
---|---|---|---|
పతాకం: | వీనస్ మహీజా వారి | ||
చిత్రం: | బాలభారతము (1972) | ||
సంగీతం: | ఎస్. రాజేశ్వరరావు | ||
గీతరచయిత: | ఆరుద్ర | ||
నేపథ్య గానం: | ఘంటసాల | ||
దర్శకత్వం: | కమలాకర కామేశ్వరరావు | ||
పల్లవి : | నారాయణ నీ లీల నవరసభరితం | ||
నీ ప్రేరణచే జనియించే బాలభారతం.. బాలభారతం | |||
నీ ప్రేరణచే జనియించే బాలభారతం.. బాలభారతం | |||
చరణం 1 : | ముని శాపముచే వగచే సతీపతులకూ | ||
తనయుల నొందే మార్గము తాపసి తెలిపే | |||
మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేతా.. ఆ.. ఆ | |||
మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేతా.. | |||
తన వంశము నిలపమని జనపతి కోరే | |||
నారాయణ నీ లీల నవరసభరితం.. | |||
నీ ప్రేరణచే జనియించే బాలభారతం.. బాలభారతం | |||
చరణం 2 : | కృష్ణాగ్రజుడై బలరాముడు గోకులమున జనియించే | ||
కుంతికి ధర్ముని అనుగ్రహంబున కులదీపకుడుదయించే | |||
ఆ శుభవార్తకు గాంధారీ సతి అసూయ చెందినదీ | |||
ఈసున గర్భ తాడన మింతి తానొనరించినదీ | |||
వ్రయ్యలైన గర్భమ్మును వ్యాసుడు సంరక్షించెనూ | |||
పిండమును నూటొక్క కుండల విభజించెనూ | |||
వరమునిచ్చెను వాయుదేవుడు.. అంత వనిత కుంతికి పుట్టె భీముడు | |||
మొదటి కడవ జొచ్చెను కలిపురుషుడు | |||
కలిగే గాంధారికి తొలి పుత్రుడూ.. కలిగే గాంధారికి తొలి పుత్రుడూ | |||
దుర్యోధన జననముచే దుశ్శకునమ్ములు దోచే | |||
దుర్భర రావమ్ములకు దుహ్ ఖించెను జగతీ | |||
దుష్టుల శిక్షించుటకై.. శిష్టుల రక్షించుటకై | |||
అష్టమి శుభలగ్నమున హరి సరుగున వెలసే .. హరి సరుగున వెలసే | |||
నారాయణ నీ లీల నవరసభరితం.. | |||
నీ ప్రేరణచే జనియించే బాలభారతం.. బాలభారతం | |||
చరణం 3 : | జనియించిన హరి జననీ జనకుల జ్ఞానుల గావించే | ||
తనయుని చేకొని వసుదేవుడు తా వ్రేపల్లెకు జేర్చే | |||
యశోద సుతయౌ యోగమాయ నా నిశీధమున తెచ్చే | |||
నశింపజేయగ దలచెడి కంసుడు అశెక్త దిగ్బ్రముడాయే | |||
అమరేంద్రుని అతినిష్టతొ అర్చించెను కుంతి | |||
అతని వరముచే నరుడే అర్జునుడై పుట్టె | |||
నరనారాయణ జననము ధరణికి ముదమాయే | |||
సురలు మురిసి సుధలు చిందు విరివానలు విరిసే | |||
శతపుత్రుల పిదప నొక్కసుతను గాంచె గాంధారీ | |||
శకుని కూడ సుతుని బడసి సంతోషము తానొందె | |||
నాతి మాద్రి అశ్వినులను ప్రీతితో భజించే | |||
నకులుడు సహదీవుడనే నందనులను గాంచే | |||
కౌరవులూ.. పాండవులూ.. కమనీయులు యాదవులూ | |||
కారణ జన్ములు సర్వులు ధారుణి ప్రవర్దమానులైరి | |||
దారుణ హింసా కాండల దానవ పతి కంసుడూ | |||
ధనుర్యాగమని బలరామకృష్ణుల తన వద్దకు రప్పించే |
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి