1953 సంవత్సరంలో విడుదలైన శోభా సంస్థ నిర్మించిన “పరోపకారం” చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పాడిన "జోడెడ్ల నడమ జోరైన రగడ" అనే ఈ ఏకగళం రచన ఆరుద్ర, స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ముక్కామల,సావిత్రి, జి. వరలక్ష్మి,రామశర్మ,సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, రేలంగి. ఈ చిత్రానికి నిర్మాత బి.చలపతిరావు మరియు దర్శకుడు కమల్ ఘోష్. ఆరుద్ర ఈ పాటలో ఎడ్లబండికి సంబంధించిన చక్కని పల్లెపదాలను వాడారు. తెలుగులోని ప్రకృతి - వికృతులలో వికృతి పదాలు ఇందులో చూడవచ్చు. ఉదాహరణకు 'రోసాలు' (రోషాలు), పసరాలు (పశువులు). రోజాలు అంటే బండి చక్రానికి వుండే ఆకులు. పసరము అనే పదము గోమహిషజాతి అయిన ఎద్దును సూచిస్తుంది.
Lyrics match to audio file
| #0000 | పాట: | జోడెడ్ల నడుమ జోరైన రగడ | |
|---|---|---|---|
| నిర్మాణం: | శోభా వారి | ||
| చిత్రం: | పరోపకారం (1953) | ||
| సంగీతం: | ఘంటసాల | ||
| రచన: | ఆరుద్ర | ||
| గానం: | ఘంటసాల | ||
| అభినయం: | ఆర్.నాగేశ్వరరావు | ||
| ప: | జోడెడ్ల నడుమ జోరైన రగడ రేతిరి రేగిందోయ్ -2 | ||
| నడి రేతిరి రేగిందోయ్ | |||
| చ: | రోసాలు పెరిగితె రోజాలు యిరుగు కలేజాలు కరుగు -2 | ||
| పసరాల కిటుకులు అసలోడి కెరుక, ముసిలోడి కెరుక | |||
| అసలా కిటుకులు ఏ...టో.... | |||
| జోడెడ్ల నడుమ జోరైన రగడ రేతిరి రేగిందోయ్ | |||
| నడి రేతిరి రేగిందోయ్ | |||
| ఆహా ఆహా ఆహా హయ్ (ఎడ్ల అదలింపులు) | |||
| జోడెడ్ల నడుమ జోరైన రగడ రేతిరి రేగిందోయ్ | |||
| నడి రేతిరి రేగిందోయ్ | |||
| చ: | ముకుతాడులాగితె ముగిసేనుజోరు, నిలిచేనుపోరు -2 | ||
| పొగరైన కోడెల తగులాట తీరు, పగ తెలవారు | |||
| వెతలైన కతలే మా.....రు | |||
| జోరైన బండి జోడెడ్లబండి | |||
| నెర నెర నెరబండి హయ్ నెరనెర నెరబండి | |||
| హయ్ నెర నెర నెరబండి హయ్! |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి