1961 లో ఎన్.టి.
రామారావు,దేవిక,కన్నాంబ, రేలంగి,
గిరిజ, సి. ఎస్.
ఆర్. ఆంజనేయులు నటించిన, డి.బి.
ఎన్. సంస్థ నిర్మించిన చిత్రం “పెండ్లి పిలుపు” నుండి ఘంటసాల మాస్టారు
పాడిన పాట “నాలోని అనురాగమంతా”. సంగీతం: కె. ప్రసాదరావు,
రచన - ఆరుద్ర , దర్శకత్వం: ఆమంచర్ల
శేషగిరిరావు.
| పల్లవి: | నాలోని అనురాగమంతా లోలోన అణగారునేమో | |||
| ప్రియురాలి వలపు త్యాగాల పిలుపు | ||||
| మదిలోన పోరాడసాగే..ఏ. | ||||
| నాలోని అనురాగమంతా | ||||
| చరణం: | సందేహ మేఘాలు మూసే..ఏ. | |||
| కల్లోల పవనాలు వీచే..ఏ.. | | సందేహ | | |||
| ప్రేమించు హృదయాలలోనా..ఆ.. - 2 | ||||
| చెలరేగాలి కాబోలు వానా..ఆ.. | | నాలోని | | |||
| చరణం: | తొలిప్రేమ విరితేనె చిందే | |||
| హృదయాన కన్నీరు నిండే | | తొలి | | |||
| మనసిచ్చి నా చేతులారా..ఆ..-2 | ||||
| మీ మది గాయమొనరించలేనే | | నాలోని | | |||
| నాలోని అనురాగమంతా |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి