గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
21, మే 2022, శనివారం
రాముడు-భీముడు నుండి ఘంటసాల మాస్టారి పద్యాలు
30, జనవరి 2022, ఆదివారం
నారాయణ నీ లీల నవ రస భరితం - బాల భారతం నుండి ఘంటసాల పాట
1972 సంవత్సరంలో
విడుదలైన వీనస్ మహీజా సంస్థ నిర్మించిన బాల భారతం చిత్రం
నుండి ఘంటసాల పాడిన “నారాయణ నీలీల నవరసభరితం” అనే
ఈ ఏకగళగీతం రచన ఆరుద్ర, స్వరపరచినది ఎస్.
రాజేశ్వరరావు. ఈ చిత్రంలో తారాగణం
ఎస్.వి. రంగారావు, అంజలీదేవి,
బేబి శ్రీదేవి, కాంతారావు, ఎస్. వరలక్ష్మి, హరనాధ్
ఈ చిత్రానికి నిర్మాత సి.హెచ్.ప్రకాశరావు
మరియు దర్శకుడు కె.కామేశ్వరరావు.
| #0000 | ఏకగళం | పాట: | నారాయణ నీ లీల నవరసభరితం |
|---|---|---|---|
| పతాకం: | వీనస్ మహీజా వారి | ||
| చిత్రం: | బాలభారతము (1972) | ||
| సంగీతం: | ఎస్. రాజేశ్వరరావు | ||
| గీతరచయిత: | ఆరుద్ర | ||
| నేపథ్య గానం: | ఘంటసాల | ||
| దర్శకత్వం: | కమలాకర కామేశ్వరరావు | ||
| పల్లవి : | నారాయణ నీ లీల నవరసభరితం | ||
| నీ ప్రేరణచే జనియించే బాలభారతం.. బాలభారతం | |||
| నీ ప్రేరణచే జనియించే బాలభారతం.. బాలభారతం | |||
| చరణం 1 : | ముని శాపముచే వగచే సతీపతులకూ | ||
| తనయుల నొందే మార్గము తాపసి తెలిపే | |||
| మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేతా.. ఆ.. ఆ | |||
| మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేతా.. | |||
| తన వంశము నిలపమని జనపతి కోరే | |||
| నారాయణ నీ లీల నవరసభరితం.. | |||
| నీ ప్రేరణచే జనియించే బాలభారతం.. బాలభారతం | |||
| చరణం 2 : | కృష్ణాగ్రజుడై బలరాముడు గోకులమున జనియించే | ||
| కుంతికి ధర్ముని అనుగ్రహంబున కులదీపకుడుదయించే | |||
| ఆ శుభవార్తకు గాంధారీ సతి అసూయ చెందినదీ | |||
| ఈసున గర్భ తాడన మింతి తానొనరించినదీ | |||
| వ్రయ్యలైన గర్భమ్మును వ్యాసుడు సంరక్షించెనూ | |||
| పిండమును నూటొక్క కుండల విభజించెనూ | |||
| వరమునిచ్చెను వాయుదేవుడు.. అంత వనిత కుంతికి పుట్టె భీముడు | |||
| మొదటి కడవ జొచ్చెను కలిపురుషుడు | |||
| కలిగే గాంధారికి తొలి పుత్రుడూ.. కలిగే గాంధారికి తొలి పుత్రుడూ | |||
| దుర్యోధన జననముచే దుశ్శకునమ్ములు దోచే | |||
| దుర్భర రావమ్ములకు దుహ్ ఖించెను జగతీ | |||
| దుష్టుల శిక్షించుటకై.. శిష్టుల రక్షించుటకై | |||
| అష్టమి శుభలగ్నమున హరి సరుగున వెలసే .. హరి సరుగున వెలసే | |||
| నారాయణ నీ లీల నవరసభరితం.. | |||
| నీ ప్రేరణచే జనియించే బాలభారతం.. బాలభారతం | |||
| చరణం 3 : | జనియించిన హరి జననీ జనకుల జ్ఞానుల గావించే | ||
| తనయుని చేకొని వసుదేవుడు తా వ్రేపల్లెకు జేర్చే | |||
| యశోద సుతయౌ యోగమాయ నా నిశీధమున తెచ్చే | |||
| నశింపజేయగ దలచెడి కంసుడు అశెక్త దిగ్బ్రముడాయే | |||
| అమరేంద్రుని అతినిష్టతొ అర్చించెను కుంతి | |||
| అతని వరముచే నరుడే అర్జునుడై పుట్టె | |||
| నరనారాయణ జననము ధరణికి ముదమాయే | |||
| సురలు మురిసి సుధలు చిందు విరివానలు విరిసే | |||
| శతపుత్రుల పిదప నొక్కసుతను గాంచె గాంధారీ | |||
| శకుని కూడ సుతుని బడసి సంతోషము తానొందె | |||
| నాతి మాద్రి అశ్వినులను ప్రీతితో భజించే | |||
| నకులుడు సహదీవుడనే నందనులను గాంచే | |||
| కౌరవులూ.. పాండవులూ.. కమనీయులు యాదవులూ | |||
| కారణ జన్ములు సర్వులు ధారుణి ప్రవర్దమానులైరి | |||
| దారుణ హింసా కాండల దానవ పతి కంసుడూ | |||
| ధనుర్యాగమని బలరామకృష్ణుల తన వద్దకు రప్పించే |
17, జనవరి 2022, సోమవారం
వెళ్ళిపోదామా మావా వెళ్ళిపోదామా – అంతా మనవాళ్ళే చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట
1954
సంవత్సరంలో విడుదలైన సారథీ సంస్థ నిర్మించిన “అంతా మనవాళ్ళే” చిత్రం నుండి ఘంటసాల పాడిన
“వెళ్ళిపోదామా మావా వెళ్ళిపోదామా” అనే ఈ ఏకగళగీతం రచన కొనకళ్ళ వెంకటరత్నం, స్వరపరచినది మాస్టర్ వేణు. ఈ చిత్రంలో తారాగణం వల్లం నరసింహారావు,
కృష్ణకుమారి, ఎస్.వి. రంగారావు,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు. ఈ చిత్రానికి నిర్మాత సి.వి.ఆర్.ప్రసాద్
మరియు దర్శకుడు తాపీ చాణక్య.16, జనవరి 2022, ఆదివారం
అమ్మాయీ ఓ! అమ్మాయీ గమ్మత్తుగా - హంతకులొస్తున్నారు జాగ్రత్త! నుండి ఘంటసాల
15, జనవరి 2022, శనివారం
ఎవరికి వారౌ స్వార్థంలో - గుడిగంటలు నుంచి
1964 సంవత్సరంలో విడుదలైన
రాజలక్ష్మి ప్రొడక్షన్సు సంస్థ నిర్మించిన “గుడిగంటలు” చిత్రం నుండి ఘంటసాల పాడిన “ఎవరికి
వారౌ స్వార్ధంలో” అనే ఈ ఏకగళగీతం రచన ఆత్రేయ,
స్వరపరచినది ఘంటసాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, జగ్గయ్య, కృష్ణకుమారి, మిక్కిలినేని,
నాగయ్య, వాసంతి. ఈ చిత్రానికి నిర్మాత సుందర్ లాల్ నహతా డూండీ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
మానవా నీకిదే - ఘంటసాల-బృందం పాట శ్రీశైల మహత్మ్యం నుండి
1962 సంవత్సరంలో విడుదలైన అలంకార్ ఫిలింస్ సంస్థ నిర్మించిన “శ్రీశైల మహత్యం” అనువాద చిత్రం నుండి ఘంటసాల-బృందం పాడిన “మానవా నీకిదే అమృతమౌర” అనే ఈ బృందగీతం రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి, స్వరపరచినది పామర్తి. ఈ చిత్రంలో తారాగణం రాజకుమార్,సంధ్య,కృష్ణకుమారి,మాధవరావు. ఈ చిత్రానికి నిర్మాత బి.యన్.స్వామి మరియు దర్శకుడు అరూర్ పట్టాభి.
నయనాభిరామా నాతండ్రి రామ సుగుణధామ రామ - వీరాంజనేయ నుండి ఘంటసాల
12, జనవరి 2022, బుధవారం
నీ సరి మనోహరి - బభ్రువాహన నుండి ఘంటసాల, ఎస్. వరలక్ష్మి
| #0000 | యుగళం | పాట: | నీ సరి మనోహరి జగాన |
|---|---|---|---|
| పతాకం: | నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ | ||
| చిత్రం: | బభ్రువాహన (1966) | ||
| సంగీతం: | పామర్తి వెంకటేశ్వరరావు | ||
| రచన: | సముద్రాల సీనియర్ | ||
| గానం: | ఘంటసాల, ఎస్. వరలక్ష్మి | ||
| సాకీ | అతడు: | ఆ.. ఆ....ఉహు హుహు | |
| పల్లవి: | నీ సరి మనోహరి జగాన కానరాదుగా | ||
| నీ సరి మనోహరి జగాన కానరాదుగా | |||
| అలుపు లేని చెలికీ వేళ ఏల మౌనమో... | |||
| ఆమె: | వలపు లేలు తామీదోల తలుపు ధ్యానమే..... | ||
| నీ సరి విలాసులు జగాన లేనె లేరుగా | |||
| చరణం: | అతడు: | కనుల సైగ విజయూగొనిన జాణ వీవేలే..... | |
| ఆమె : | మరులు రేపి మగువా గొనగ మీరు విజయులే..... | ||
| నీ సరి విలాసులు జగాన లేనె లేరుగా | |||
| చరణం: | అతడు: | చేసుకున్న తపసీ లీల | |
| ఆమె: | చేరదీసెలే... | ||
| అతడు: | జంటగొన్న మనసూ మమత | ||
| ఆమె: | సఫలమాయెలే..... | ||
| ఇద్దరు : | మా సరి వయారులు, జగాన లేనె లేరుగా | ||
| మా సరి వయారులు, జగాన లేనె లేరుగా | |||
| ఆ... ఆ.... ఆ.... ఆ... |
నిన్నే నిన్నే చెలి నిలునిలుమా - బభ్రువాహన నుండి ఘంటసాల, సుశీల
1964 సంవత్సరంలో విడుదలైన నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన బభ్రువాహన చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీలతో పాడిన నిన్నే నిన్నే చెలి నిలునిలుమా అనే ఈ యుగళగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది పామర్తి. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, ఎస్.వరలక్ష్మి, చలం, ఎల్. విజయలక్ష్మి.
| #0000 | యుగళం | పాట: | నిన్నే నిన్నే చెలి నిలునిలుమా |
|---|---|---|---|
| పతాకం: | నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ | ||
| చిత్రం: | బభ్రువాహన (1964) | ||
| సంగీతం: | పామర్తి వెంకటేశ్వర రావు | ||
| రచన: | సముద్రాల సీనియర్ | ||
| గానం: | ఘంటసాల, సుశీల | ||
| పల్లవి: | అతడు | నిన్నే.. నిన్నే.. చెలి నిలు నిలుమా.. | |
| నినువిడి నిలువగ లేను సుమా... | |||
| నిన్నే.. నిన్నే.. చెలి నిలు నిలుమా.. | |||
| ఆమె | నను విడుమా... ఇక నను విడుమా | ||
| నను విడుమా... ఇక నను విడుమా | |||
| నమస్తే జటాధారి... నా దారిని | |||
| విడు విడుమా.. చెలి నిలు నిలుమా... | |||
| చరణం 1: | ఆమె | మగువలు కొలువగ దరిజేరగా...మతిమాయుట యతులకు న్యాయమా.. | |
| మగువలు కోలువగ దరిజేరగా...మతిమాయుట యతులకు న్యాయమా.. | |||
| అతడు | నీ కనుసన్నలా నను కరుణించినా...ఈ సన్యాసి మారేను సంసారిగా | ||
| విడు విడుమా ..చెలి నిలు నిలుమా... | |||
| చరణం 2: | ఆమె | ఆపకుమా నే పాపినయ.. ఈ రూపము నిలువగ రానిదయా... | |
| ఆపకుమా నే పాపినయ. ఈ రూపము నిలువగ రానిదయా... | |||
| అతడు | నీ రూపానికే నే ఈ రూపున... ఇట చేరి జపించి తపించేనులే.... | ||
| విడు విడుమా .. చెలి నిలు నిలుమా... | |||
| చరణం 3: | ఆమె | విజయునికే తనువంకితం...నీ చెలువుని మోసం చెయుదువా? | |
| విజయునికే తనువంకితం...నీ చెలువుని మోసం చెయుదువా? | |||
| అతడు | నేనే విజయుండను ...నేనే చెలి కాదను...ఈ గోశాయి వేసాలు నీకోసమే ... | ||
| ఆమె | హా... | ||
| అతడు | ఆ... | ||
| అతడు | నిలు నిలుమా..ఆమెః నను విడు విడుమా | ||
| అతడు | నిలు నిలుమా..ఆమెః నను విడు విడుమా |
11, జనవరి 2022, మంగళవారం
తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము - అంతస్తులు చిత్రం నుండి ఘంటసాల, సుశీల
1965 సంవత్సరంలో విడుదలైన జగపతి పిక్చర్స్ సంస్థ నిర్మించిన అంతస్తులు చిత్రం నుండి ఘంటసాల-పి.సుశీల పాడిన “తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము” అనే ఈ యుగళగీతం రచన ఆత్రేయ, స్వరపరచినది కె.వి. మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, కృష్ణకుమారి, జగ్గయ్య, గుమ్మడి, పి.భానుమతి, రేలంగి, రమణారెడ్డి. ఈ చిత్రానికి నిర్మాత వి.రాజేంద్రప్రసాద్ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
| #1349 | యుగళం | పాట: | తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము | |
|---|---|---|---|---|
| పతాకం: | జగపతి ఆర్ట్స్ | |||
| చిత్రం: | అంతస్తులు - 1965 | |||
| సంగీతం: | కె.వి.మహదేవన్ | |||
| రచన: | ఆచార్య ఆత్రేయ | |||
| గానం: | ఘంటసాల, సుశీల | |||
| సాకీ | అతడు: | తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము | ||
| మల్లెపూలు పెట్టుకున్నది ఎవరి కోసము..ఊ | ||||
| పల్లవి: | తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము | |||
| మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసము | । తెల్లచీర కట్టుకున్న। | |||
| ఆమె: | తెల్ల చీర కట్టిన మల్లెపూలు పెట్టినా | |||
| కల్లకపటమెరుగని మనసు కోసము | । తెల్లచీర కట్టినా। | |||
| మనసులోని చల్లని మమత కోసము | ||||
| అతడు: | తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము | |||
| ఆమె: | కల్లకపటమెరుగని మనసు కోసము..ఊ..ఊ | |||
| చరణం: | అతడు: | దాచుకున్న మమతలన్ని ఎవరికోసము | ||
| ఆమె: | దాపరిక౦ ఎరుగని మనిషి కోసము | |||
| అతడు: | దాచుకున్న మమతలన్ని ఎవరికోసము | |||
| ఆమె: | దాపరిక౦ ఎరుగని మనిషి కోసము | |||
| అతడు: | దాగని యవ్వన౦ ఎవరి కోసము..ఉ | |||
| ఆమె: | దాచుకుని ఏలుకునే ప్రియుని కోసము | |||
| అతడు: | తెల్లచీర కట్టుకున్నదెవరికోసము | |||
| ఆమె: | కల్లకపటమెరుగని మనసు కోసము..ఊ | |||
| చరణం: | అతడు: | పొద్ద౦త కలవరి౦త ఎవరికోసము | ||
| ఆమె: | నిద్దురైన రానీి నీ కోసము | |||
| అతడు: | పొద్ద౦త కలవరి౦త ఎవరికోసము | |||
| ఆమె: | నిద్దురైన రానీి నీ కోసము | |||
| అతడు: | తెల్లచీర కట్టుకున్నదెవరికోసము | |||
| ఆమె: | కల్లకపటమెరుగని మనసు కోసము..ఊ | |||
| చరణం: | అతడు: | ని౦గి నేల కలసినది ఎ౦దుకోసమూ..ఉ | ||
| ఆమె: | నీవు నన్ను చేరదీసిన౦దుకోసము | |||
| అతడు: | ని౦గి నేల కలసినది ఎ౦దుకోసమూ..ఉ | |||
| ఆమె: | నీవు నన్ను చేరదీసిన౦దుకోసము | |||
| అతడు: | నేల మీద ఒక్కరై సాగిపోదము | |||
| ఇద్దరు: | ని౦గిలోన చుక్కలై నిలిచిపోదమూ.. | |||
| అతడు: | తెల్లచీర కట్టుకున్నదెవరికోసము | |||
| మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము | ||||
| ఆమె: | తెల్ల చీర కట్టిన మల్లెపూలు పెట్టినా | |||
| కల్లకపటమెరుగని మనసు కోసము | ||||
| మనసులోని చల్లని మమత కోసము |
7, జనవరి 2022, శుక్రవారం
ఘంటసాల, అక్కినేని, బృందం పాడిన 'మేతదావినిబడ్డ మేలంపుటావా" పల్నాటియుద్ధం (1947) నుండి
1947 సంవత్సరంలో విడుదలైన శారదా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన పల్నాటి యుద్ధం చిత్రం నుండి ఘంటసాల-బృందం పాడిన “మేతదావినిబడ్డ మేలంపుటావా” అనే ఈ బృందగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది గాలి పెంచెల. ఈ చిత్రంలో తారాగణం గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబ, అక్కినేని, ఎస్.వరలక్ష్మి. ఘంటసాల మాస్టారు ఈ చిత్రానికి నాలుగు పాటలు పాడారు. అలనాటి ప్రముఖ నటి, గాయని అయిన పసుపులేటి కన్నాంబ నాయకురాలు నాగమ్మ గాను, గోవిందరాజుల సుబ్బారావు బ్రహ్మనాయుడు గాను, ఎ.ఎన్.ఆర్. బాలచంద్రుడు గాను ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకులైన శ్రీ గాలి పెంచల నరసింహారావు గారికి ఘంటసాల మాస్టారు సహాయ సంగీత దర్శకునిగా పనిచేసారు. అక్కినేని గారు స్వయంగా పాడారు, మాష్టారితో కలిసి పాడారు.
| #006 | బృందగీతం | పాటః | మేతదావినిబడ్డ మేలంపుటావా |
|---|---|---|---|
| నిర్మాణం: | శారదా ప్రొడక్షన్స్ | ||
| చిత్రం: | పల్నాటి యుద్ధం (1966) | ||
| సంగీతం: | గాలి పెంచల నరసింహారావు | ||
| రచన: | సముద్రాల సీనియర్ | ||
| గానం: | ఘంటసాల, అక్కినేని, కోరస్ | ||
| ఘంటసాలః | గురజాల రైతులు: | ఓహో.. ఓ.. ఒయ్! | |
| మేత దావినిబడ్డ మేలంపుటావా, | |||
| నీటి కారాటపడు నీలంపుటావా | |||
| మాచెర్ల అడవులూ మడుగులూ మనవే | |||
| మలిదేవుడడ్డినా మరలిరాకండి..ఈ.., మరలిరాకండి | |||
| మాచెర్ల రైతులు : | అడవి పచ్చికలోన అడుగు పెట్టేరు | ||
| మడుగులో నీరాని మకిలజేసేరు | |||
| గడి దాటితే పట్టి కట్టివేసేము | |||
| మాచెర్ల అడవులూ మడుగులూ మావే | |||
| గురజాల రైతులు : | తెగతెంపులిక చచ్చు తెగవేసి చెప్పవోయ్ | ||
| నాగమో నాయుడో నస పనికి రాదింక, తెగవేసి చెప్పవోయ్ | |||
| మాచెర్ల రైతులుః | మూడు లోకాలేకమై యెత్తి వచ్చినా | ||
| ఆడదానికి జోహారనము, మే మనము | |||
| మాచెర్ల ఆడపులే మాకు రేపల్లె | |||
| నాయుడే మాపాలి నందగోపయ్య | |||
| గురజాల రైతు భార్యః | అమ్మా నాన్నని చూడాలనిపిస్తున్నది మావా -2 | ||
| ఒక్కసారి నన్నంపు, ఉన్నట్టే తిరిగొస్తా -2 | |||
| యిక్కడ ఉన్నట్టే తిరిగొస్తా | |||
| గురజాల రైతు : | ఏయ్! మగనిమీద మమతుంటే, కాపురం కావాలంటే | ||
| మగనిమీద మమతుంటే, కాపురం కావాలంటే | |||
| ఈ సీమలోని చిలక ఆ సీమ వాలరాదే | |||
| ఈ సీమలోని చిలక ఆ సీమ వాలరాదే పోరాదేపిల్లా | |||
| గురజాల రైతు (భార్య)ః | వాదా అమ్మకచెల్లా | ||
| భర్తః | పోరాదేపిల్లా | ||
| భార్యః | అపవాదా అమ్మకచెల్లా | ||
| ఓహో... | |||
| గురజాల యువకుడుః | వడిసేల రువ్వేటి వయ్యారిపడుచా -2 | ||
| జడిసిపోయేవారి జడిపించబోకే -2 | |||
| మాచెర్ల యువతులుః | బంగారుతల్లికీ పంట మాలచ్చిమికి -2 | ||
| పాలపొంగలి మొక్కుబళ్ళు చెల్లిద్దాము -2 | |||
| మాచెర్ల యువకులు : | రండోయి నవయువకులు రండోయి, త్వరగ రండోయి | ||
| యువతులుః | ఆ.. ఆ.. | ||
| మాచెర్ల యువకులు : | త్వరగ రండోయి దండులోన చేరండి రండోయి | ||
| దండులోన చేరండి రండోయి, త్వరగ రండోయి | |||
| గరిడి సాములో చేరీ గండు మగలు కండి-2 | |||
| యువకులు : | రండోయి.. | ||
| యువతులుః | రండోయి.. | ||
| యువకులు : | రండోయి.. |
4, జనవరి 2022, మంగళవారం
ఖుషీ ఖుషీగా నవ్వుతూ - ఇద్దరు మిత్రులు నుండి ఘంటసాల, సుశీల యుగళగీతం
1961 సంవత్సరంలో విడుదలైన అన్నపూర్ణా సంస్థ నిర్మించిన ఇద్దరు మిత్రులు చిత్రం నుండి ఘంటసాల-పి.సుశీల పాడిన ‘ఖుషీ ఖషీగా నవ్వుతూ’ అనే ఈ యుగళగీతం రచన దాశరధి, స్వరపరచినది సాలూరు రాజేశ్వరరావు. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, రాజసులోచన, ఇ.వి. సరోజ, గుమ్మడి, పద్మనాభం, శారద.
| #0917 | యుగళగీతంః | ఖుషీ ఖుషీగా నవ్వుతూ | |
|---|---|---|---|
| నిర్మాణం: | అన్నపూర్ణా వారి | ||
| చిత్రం: | ఇద్దరు మిత్రులు (1961) | ||
| రచన: | దాశరథి రంగాచార్య | ||
| సంగీతం: | సాలూరు రాజేశ్వర రావు | ||
| గానం: | ఘంటసాల, పి.సుశీల | ||
| పల్లవి: | ఘంటసాల: | ఖుషీ ఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ | |
| హుషారుగొలిపే వెందుకే నిషా కనులదానా! | |||
| సుశీల: | ఓ..ఓ..ఓ.. మేనాలోన ప్రియునిచేర వెళ్ళింది నాచెలి మీనా | ||
| నింగిదాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోన | |||
| ఖుషీ ఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ | |||
| హుషారుగొలిపే నిందుకే నిషా కనులవాడా! | |||
| చరణం: | ఘంటసాల: | ఓ..ఓ..ఓ.. ఓహో చెలియా! నీవుకూడ ఓ పెళ్ళి పల్లకీ చూసుకో | |
| ఓహో చెలియా! నీవుకూడ ఓ పెళ్ళి పల్లకీ చూసుకో | |||
| హాయిగొలుపు సన్నాయి పాటలో వలపుబాటలే వేసుకో | |||
| సుశీల: | నే వెళితే మరి నీవు, మజ్నూవౌతావూ..ఊ... | ||
| ఘంటసాల: | మజ్నూ నేనేనైతే ఒ లైలా లోకమే చీకటై పోవునే.. | ||
| సుశీల: | ఖుషీ ఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ | ||
| హుషారుగా వుందాములే నిషా కనులవాడా! | |||
| చరణం: | ఘంటసాల: | ఓ..ఓ..ఓ.. ఆకాశంలో ఇంద్రధనసుపై ఆడుకుందమా నేడే | |
| సుశీల: | నీలినీలి మేఘాల రథముపై తేలిపోదమీనాడే | ||
| ఘంటసాల: | చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసిపోదమ హాయిగా | ||
| సుశీల: | నేను వీణనై నీవు నాదమై ఏకమౌదమా తీయగా | ||
| ఇద్దరు: | ఖుషీ ఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ | ||
| హుషారుగా వుందాములే హమేషా మజాగా |
2, జనవరి 2022, ఆదివారం
నువ్వూ నేనూ ఏకమైనాము - కొడుకు కోడలు చిత్రం నుండి ఘంటసాల-పి.సుశీల పాడిన యుగళగీతం
1972 సంవత్సరంలో విడుదలైన పద్మశ్రీ పిక్చర్స్ సంస్థ నిర్మించిన కొడుకు కోడలు చిత్రం నుండి ఘంటసాల-పి.సుశీల పాడిన నువ్వూ నేనూ ఏకమైనాము అనే ఈ యుగళగీతం రచన ఆత్రేయ, స్వరపరచినది కె.వి. మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, వాణీశ్రీ, ఎస్.వి. రంగారావు, శాంతకుమారి, లక్ష్మి. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు మూడు యుగళ గీతాలు, రెండు ఏకగళ గీతాలు పాడారు.
| #2314 | పాట | యుగళగీతం: | నువ్వు, నేను ఏకమైనాము |
|---|---|---|---|
| పతాకం: | పద్మశ్రీ పిక్చర్స్ | ||
| చిత్రం: | కొడుకు - కోడలు (1972) | ||
| సంగీతం: | కె.వి. మహదేవన్ | ||
| రచన: | ఆత్రేయ | ||
| గానం: | ఘంటసాల, సుశీల | ||
| పల్లవి: | ఘంటసాల: | నువ్వూ నేనూ ఏకమైనాము | |
| నువ్వూ నేనూ ఏకమైనాము | |||
| ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనామూ | |||
| సుశీల: | లోకమంతా ఏకమైనా వేరు కాలేము వేరు కాలేము | ||
| ఇద్దరు: | నువ్వూ నేనూ ఏకమైనాము | ||
| చరణం: | ఘంటసాల: | కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడదామూ | |
| సుశీల: | అందులో మన చల్ల చల్లని వలపు దీపం నిలుపుకుందాము | ||
| ఘంటసాల: | కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడదామూ | ||
| సుశీల: | అందులో మన చల్ల చల్లని వలపు దీపం నిలుపుకుందాము | ||
| ఘంటసాల: | పసిడి మనసులు పట్టెమంచం వేసుకుందాము ఊ ఉ | ||
| సుశీల: | అందులో మన పడుచు కోర్కెల మల్లెపూలు పరుచుకుందాము ఊ ఉ | ||
| ఇద్దరు: | నువ్వూ నేనూ ఏకమైనాము | ||
| చరణం: | ఘంటసాల: | చెలిమితో ఒక చలువపందిరి వేసుకుందాము | |
| సుశీల: | కలల తీగల అల్లిబిల్లిగా అల్లుకుందాము ఊ | ||
| ఘంటసాల: | ఆ అల్లికను మన జీవితాలకు పోల్చుకుందాము | ||
| సుశీల: | ఏ పొద్దు కానీ వాడిపోనీ పువ్వులవుదామూ ఊ ఊ | ||
| ఇద్దరు: | నువ్వూ నేనూ ఏకమైనాము | ||
| చరణం: | ఘంటసాల: | లేత వెన్నెల చల్లదనము నువ్వు తెస్తావూ ఊ | |
| సుశీల: | అందులో నీరెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు | ||
| ఘంటసాల: | లేత వెన్నెల చల్లదనము నువ్వు తెస్తావూ ఊ | ||
| సుశీల: | అందులో నీరెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు | ||
| ఘంటసాల: | సూర్యచంద్రులు లేని జగతిని సృష్టి చేద్దాము ఊ ఊ | ||
| సుశీల: | అందులో ఈ సృష్టికెన్నడు లేని సొగసు మనము తెద్దాము | ||
| ఘంటసాల: | నువ్వూ నేనూ ఏకమైనాము | ||
| ఇద్దరు: | ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనామూ | ||
| లోకమంతా ఏకమైనా వేరు కాలేము వేరు కాలేము | |||
| నువ్వూ నేనూ ఏకమైనాము ఆహ హా ఆహ ఆహ హా |
1, జనవరి 2022, శనివారం
కర్షకుడా! కర్షకుడా! - విడుదల కాని చిత్రం "మనసు-మమత" నుండి ఘంటసాల మాస్టారి పాట
| 2429 | నిర్మాణం: | ఎస్.ఎస్.వి.ఎస్.ప్రొడక్షన్‌స్ వారి | |
| చిత్రం: | మనసు మమత (విడుదల కాలేదు) | ||
| రచన: | కె.వసంతరావు | ||
| సంగీతం: | ఎస్.డి.బాబూ రావు | ||
| గానం: | ఘంటసాల, బృందం | ||
| పల్లవి: | ఘంటసాల: | కర్షకుడా! కర్షకుడా! కర్షకుడా! | |
| దేశానికి వెన్నెముకవు లెమ్ము లెమ్మురా! | |||
| భూమాతకు రైతుబిడ్డ రమ్ము రమ్మురా! | |||
| అభ్యుదయం సాధించి ఖ్యాతి నిల్పరా! | |||
| ఘంటసాల: | కర్షకుడా! బృందం: కర్షకుడా! - 3 | ||
| ఘంటసాల: | దేశానికి వెన్నెముకవు లెమ్ము లెమ్మురా! | ||
| బృందం: | లెమ్ము లెమ్మురా! | ||
| ఘంటసాల: | భూమాతకు రైతు బిడ్డ రమ్ము రమ్మురా! | ||
| బృందం: | రమ్ము రమ్మురా! | ||
| ఘంటసాల: | అభ్యుదయం సాధించి ఖ్యాతి నిల్పరా! | ||
| బృందం: | అభ్యుదయం సాధించి ఖ్యాతి నిల్పరా! | ||
| చరణం: | ఘంటసాల: | ఎండ వానలను నీవు లెక్కచేయవు | |
| కండలన్ని పిండిచేసి ధాన్యం పండింతువు | | ఎండ | | ||
| నీవులేని చోటెప్పుడు రాళ్ళ గుట్టరా - 2 | |||
| సృష్టిని పోషించువాడ నీవె దిక్కురా | |||
| కర్షకుడా! కర్షకుడా! కర్షకుడా! | | దేశానికి | | ||
| ఘంటసాల: | కర్షకుడా! బృందం: కర్షకుడా! | ||
| ఘంటసాల: | కర్షకుడా! దేశానికి వెన్నెముకవు లెమ్ము లెమ్మురా! | ||
| బృందం: | లెమ్ము లెమ్మురా! | ||
| ఘంటసాల: | భూమాతకు రైతు బిడ్డ రమ్ము రమ్మురా! | ||
| బృందం: | రమ్ము రమ్మురా! | ||
| బృందం: | అభ్యుదయం సాధించి ఖ్యాతి నిల్పరా! | ||
| ఘంటసాల: | కర్షకుడా! బృందం: కర్షకుడా! - 3 | ||
| ఘంటసాల: | దేశానికి వెన్నెముకవు లెమ్ము లెమ్మురా! | ||
| బృందం: | లెమ్ము లెమ్మురా! | ||
| ఘంటసాల: | భూమాతకు రైతు బిడ్డ రమ్ము రమ్మురా! | ||
| బృందం: | రమ్ము రమ్మురా! | ||
| ఘంటసాల: | అభ్యుదయం సాధించి ఖ్యాతి నిల్పరా! | ||
| బృందం: | అభ్యుదయం సాధించి ఖ్యాతి నిల్పరా! | ||
| చరణం: | ఘంటసాల: | దౌర్జన్యం దగాచేయు దుండగీళ్ళను | |
| ధైర్యంతో ఎదిరించి ధర్మం నెలకొల్పరా! | | దౌర్జన్యం| | ||
| ఏ రోజుకైన స్వార్థం నశించితీరురా -2 | |||
| ఏనాటికైన సత్యం జయించి తీరురా | |||
| ఘంటసాల: కర్షకుడా! బృందం: కర్షకుడా! | |||
| ఘంటసాల: | కర్షకుడా! దేశానికి వెన్నెముకవు లెమ్ము లెమ్మురా! | ||
| బృందం: | లెమ్ము లెమ్మురా! | ||
| ఘంటసాల: | భూమాతకు రైతు బిడ్డ రమ్ము రమ్మురా! | ||
| బృందం: | రమ్ము రమ్మురా! | ||
| బృందం: | అభ్యుదయం సాధించి ఖ్యాతి నిల్పరా! | ||
| చరణం: | ఘంటసాల: | పాడీ పంటలకెన్నడు లోటులేని దేశము | |
| బృందం: | లోటులేని దేశము | ||
| ఘంటసాల: | లాభాలకు సాగిన లోభులకే దక్కెరా | ||
| బృందం: | లోభులకే దక్కెరా | | పాడీ | | |
| ఘంటసాల: | కనరాని దోపిడీ, ప్రజ బ్రతుకున రాపిడీ | ||
| బృందం: | కనరాని దోపిడీ, ప్రజ బ్రతుకున రాపిడీ | ||
| ఘంటసాల: | చల్లారిన నాడే; బృందం: చల్లారిన నాడే | ||
| ఘంటసాల: | దేశానికి శాంతిరా; బృందం: దేశానికి శాంతిరా | ||
| ఘంటసాల: | కర్షకుడా! కార్మికుడా! | ||
| నీ కష్టం నీ రక్తం వృధా కాదురా |
కృతజ్ఞతలుః చిత్రము యొక్క సమాచారాన్ని అందించిన ఘంటసాల గళామృతము నిర్వాహకులు శ్రీ కొల్లూరి భాస్కరరావు గారికి, శ్రవణ ఖండికను అందించిన శ్రీ నూకల ప్రభాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ ఉదయం నా హృదయం - కన్నె మనసులు నుండి ఘంటసాల మాస్టారు పాడిన మధుర గీతం
బాబూ మూవీస్ సంస్థ పతాకంపై నిర్మాత సి. సుందరం, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, రామ్మోహన్, కృష్ణ, సంధ్య, సుకన్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా 1966 ల్నో నిర్మించిన తెలుగు చలనచిత్రం కన్నెమనసులు. ఈ చిత్రం ఈ నలుగురు నటులకు మొదటి చిత్రం. ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ స్వరపరచిన నాలుగు గీతాలను ఆత్రేయ వ్రాయగా, అందులో మూడు ఏకగళగీతాలు ఘంటసాల మాస్టారు, ఒక ఏకగళ గీతాన్ని సుశీలమ్మ పాడారు. ఇక్కడ రామ్మోహన్ పై చిత్రించిన ఈ ఉదయం నా హృదయం అనే మధురగీతాన్ని పొందుపరుస్తున్నాను.
