1961 సంవత్సరంలో విడుదలైన అన్నపూర్ణా సంస్థ నిర్మించిన ఇద్దరు మిత్రులు చిత్రం నుండి ఘంటసాల-పి.సుశీల పాడిన ‘ఖుషీ ఖషీగా నవ్వుతూ’ అనే ఈ యుగళగీతం రచన దాశరధి, స్వరపరచినది సాలూరు రాజేశ్వరరావు. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, రాజసులోచన, ఇ.వి. సరోజ, గుమ్మడి, పద్మనాభం, శారద.
#0917 | యుగళగీతంః | ఖుషీ ఖుషీగా నవ్వుతూ | |
---|---|---|---|
నిర్మాణం: | అన్నపూర్ణా వారి | ||
చిత్రం: | ఇద్దరు మిత్రులు (1961) | ||
రచన: | దాశరథి రంగాచార్య | ||
సంగీతం: | సాలూరు రాజేశ్వర రావు | ||
గానం: | ఘంటసాల, పి.సుశీల | ||
పల్లవి: | ఘంటసాల: | ఖుషీ ఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ | |
హుషారుగొలిపే వెందుకే నిషా కనులదానా! | |||
సుశీల: | ఓ..ఓ..ఓ.. మేనాలోన ప్రియునిచేర వెళ్ళింది నాచెలి మీనా | ||
నింగిదాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోన | |||
ఖుషీ ఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ | |||
హుషారుగొలిపే నిందుకే నిషా కనులవాడా! | |||
చరణం: | ఘంటసాల: | ఓ..ఓ..ఓ.. ఓహో చెలియా! నీవుకూడ ఓ పెళ్ళి పల్లకీ చూసుకో | |
ఓహో చెలియా! నీవుకూడ ఓ పెళ్ళి పల్లకీ చూసుకో | |||
హాయిగొలుపు సన్నాయి పాటలో వలపుబాటలే వేసుకో | |||
సుశీల: | నే వెళితే మరి నీవు, మజ్నూవౌతావూ..ఊ... | ||
ఘంటసాల: | మజ్నూ నేనేనైతే ఒ లైలా లోకమే చీకటై పోవునే.. | ||
సుశీల: | ఖుషీ ఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ | ||
హుషారుగా వుందాములే నిషా కనులవాడా! | |||
చరణం: | ఘంటసాల: | ఓ..ఓ..ఓ.. ఆకాశంలో ఇంద్రధనసుపై ఆడుకుందమా నేడే | |
సుశీల: | నీలినీలి మేఘాల రథముపై తేలిపోదమీనాడే | ||
ఘంటసాల: | చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసిపోదమ హాయిగా | ||
సుశీల: | నేను వీణనై నీవు నాదమై ఏకమౌదమా తీయగా | ||
ఇద్దరు: | ఖుషీ ఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ | ||
హుషారుగా వుందాములే హమేషా మజాగా |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి