1947 సంవత్సరంలో విడుదలైన శారదా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన పల్నాటి యుద్ధం చిత్రం నుండి ఘంటసాల-బృందం పాడిన “మేతదావినిబడ్డ మేలంపుటావా” అనే ఈ బృందగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది గాలి పెంచెల. ఈ చిత్రంలో తారాగణం గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబ, అక్కినేని, ఎస్.వరలక్ష్మి. ఘంటసాల మాస్టారు ఈ చిత్రానికి నాలుగు పాటలు పాడారు. అలనాటి ప్రముఖ నటి, గాయని అయిన పసుపులేటి కన్నాంబ నాయకురాలు నాగమ్మ గాను, గోవిందరాజుల సుబ్బారావు బ్రహ్మనాయుడు గాను, ఎ.ఎన్.ఆర్. బాలచంద్రుడు గాను ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకులైన శ్రీ గాలి పెంచల నరసింహారావు గారికి ఘంటసాల మాస్టారు సహాయ సంగీత దర్శకునిగా పనిచేసారు. అక్కినేని గారు స్వయంగా పాడారు, మాష్టారితో కలిసి పాడారు.
#006 | బృందగీతం | పాటః | మేతదావినిబడ్డ మేలంపుటావా |
---|---|---|---|
నిర్మాణం: | శారదా ప్రొడక్షన్స్ | ||
చిత్రం: | పల్నాటి యుద్ధం (1966) | ||
సంగీతం: | గాలి పెంచల నరసింహారావు | ||
రచన: | సముద్రాల సీనియర్ | ||
గానం: | ఘంటసాల, అక్కినేని, కోరస్ | ||
ఘంటసాలః | గురజాల రైతులు: | ఓహో.. ఓ.. ఒయ్! | |
మేత దావినిబడ్డ మేలంపుటావా, | |||
నీటి కారాటపడు నీలంపుటావా | |||
మాచెర్ల అడవులూ మడుగులూ మనవే | |||
మలిదేవుడడ్డినా మరలిరాకండి..ఈ.., మరలిరాకండి | |||
మాచెర్ల రైతులు : | అడవి పచ్చికలోన అడుగు పెట్టేరు | ||
మడుగులో నీరాని మకిలజేసేరు | |||
గడి దాటితే పట్టి కట్టివేసేము | |||
మాచెర్ల అడవులూ మడుగులూ మావే | |||
గురజాల రైతులు : | తెగతెంపులిక చచ్చు తెగవేసి చెప్పవోయ్ | ||
నాగమో నాయుడో నస పనికి రాదింక, తెగవేసి చెప్పవోయ్ | |||
మాచెర్ల రైతులుః | మూడు లోకాలేకమై యెత్తి వచ్చినా | ||
ఆడదానికి జోహారనము, మే మనము | |||
మాచెర్ల ఆడపులే మాకు రేపల్లె | |||
నాయుడే మాపాలి నందగోపయ్య | |||
గురజాల రైతు భార్యః | అమ్మా నాన్నని చూడాలనిపిస్తున్నది మావా -2 | ||
ఒక్కసారి నన్నంపు, ఉన్నట్టే తిరిగొస్తా -2 | |||
యిక్కడ ఉన్నట్టే తిరిగొస్తా | |||
గురజాల రైతు : | ఏయ్! మగనిమీద మమతుంటే, కాపురం కావాలంటే | ||
మగనిమీద మమతుంటే, కాపురం కావాలంటే | |||
ఈ సీమలోని చిలక ఆ సీమ వాలరాదే | |||
ఈ సీమలోని చిలక ఆ సీమ వాలరాదే పోరాదేపిల్లా | |||
గురజాల రైతు (భార్య)ః | వాదా అమ్మకచెల్లా | ||
భర్తః | పోరాదేపిల్లా | ||
భార్యః | అపవాదా అమ్మకచెల్లా | ||
ఓహో... | |||
గురజాల యువకుడుః | వడిసేల రువ్వేటి వయ్యారిపడుచా -2 | ||
జడిసిపోయేవారి జడిపించబోకే -2 | |||
మాచెర్ల యువతులుః | బంగారుతల్లికీ పంట మాలచ్చిమికి -2 | ||
పాలపొంగలి మొక్కుబళ్ళు చెల్లిద్దాము -2 | |||
మాచెర్ల యువకులు : | రండోయి నవయువకులు రండోయి, త్వరగ రండోయి | ||
యువతులుః | ఆ.. ఆ.. | ||
మాచెర్ల యువకులు : | త్వరగ రండోయి దండులోన చేరండి రండోయి | ||
దండులోన చేరండి రండోయి, త్వరగ రండోయి | |||
గరిడి సాములో చేరీ గండు మగలు కండి-2 | |||
యువకులు : | రండోయి.. | ||
యువతులుః | రండోయి.. | ||
యువకులు : | రండోయి.. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి