1964 సంవత్సరంలో విడుదలైన నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన బభ్రువాహన చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పి.సుశీలతో పాడిన నిన్నే నిన్నే చెలి నిలునిలుమా అనే ఈ యుగళగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది పామర్తి. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, కాంతారావు, ఎస్.వరలక్ష్మి, చలం, ఎల్. విజయలక్ష్మి.
#0000 | యుగళం | పాట: | నిన్నే నిన్నే చెలి నిలునిలుమా |
---|---|---|---|
పతాకం: | నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ | ||
చిత్రం: | బభ్రువాహన (1964) | ||
సంగీతం: | పామర్తి వెంకటేశ్వర రావు | ||
రచన: | సముద్రాల సీనియర్ | ||
గానం: | ఘంటసాల, సుశీల | ||
పల్లవి: | అతడు | నిన్నే.. నిన్నే.. చెలి నిలు నిలుమా.. | |
నినువిడి నిలువగ లేను సుమా... | |||
నిన్నే.. నిన్నే.. చెలి నిలు నిలుమా.. | |||
ఆమె | నను విడుమా... ఇక నను విడుమా | ||
నను విడుమా... ఇక నను విడుమా | |||
నమస్తే జటాధారి... నా దారిని | |||
విడు విడుమా.. చెలి నిలు నిలుమా... | |||
చరణం 1: | ఆమె | మగువలు కొలువగ దరిజేరగా...మతిమాయుట యతులకు న్యాయమా.. | |
మగువలు కోలువగ దరిజేరగా...మతిమాయుట యతులకు న్యాయమా.. | |||
అతడు | నీ కనుసన్నలా నను కరుణించినా...ఈ సన్యాసి మారేను సంసారిగా | ||
విడు విడుమా ..చెలి నిలు నిలుమా... | |||
చరణం 2: | ఆమె | ఆపకుమా నే పాపినయ.. ఈ రూపము నిలువగ రానిదయా... | |
ఆపకుమా నే పాపినయ. ఈ రూపము నిలువగ రానిదయా... | |||
అతడు | నీ రూపానికే నే ఈ రూపున... ఇట చేరి జపించి తపించేనులే.... | ||
విడు విడుమా .. చెలి నిలు నిలుమా... | |||
చరణం 3: | ఆమె | విజయునికే తనువంకితం...నీ చెలువుని మోసం చెయుదువా? | |
విజయునికే తనువంకితం...నీ చెలువుని మోసం చెయుదువా? | |||
అతడు | నేనే విజయుండను ...నేనే చెలి కాదను...ఈ గోశాయి వేసాలు నీకోసమే ... | ||
ఆమె | హా... | ||
అతడు | ఆ... | ||
అతడు | నిలు నిలుమా..ఆమెః నను విడు విడుమా | ||
అతడు | నిలు నిలుమా..ఆమెః నను విడు విడుమా |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి