1965 సంవత్సరంలో విడుదలైన జగపతి పిక్చర్స్ సంస్థ నిర్మించిన అంతస్తులు చిత్రం నుండి ఘంటసాల-పి.సుశీల పాడిన “తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము” అనే ఈ యుగళగీతం రచన ఆత్రేయ, స్వరపరచినది కె.వి. మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, కృష్ణకుమారి, జగ్గయ్య, గుమ్మడి, పి.భానుమతి, రేలంగి, రమణారెడ్డి. ఈ చిత్రానికి నిర్మాత వి.రాజేంద్రప్రసాద్ మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
| #1349 | యుగళం | పాట: | తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము | |
|---|---|---|---|---|
| పతాకం: | జగపతి ఆర్ట్స్ | |||
| చిత్రం: | అంతస్తులు - 1965 | |||
| సంగీతం: | కె.వి.మహదేవన్ | |||
| రచన: | ఆచార్య ఆత్రేయ | |||
| గానం: | ఘంటసాల, సుశీల | |||
| సాకీ | అతడు: | తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము | ||
| మల్లెపూలు పెట్టుకున్నది ఎవరి కోసము..ఊ | ||||
| పల్లవి: | తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము | |||
| మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసము | । తెల్లచీర కట్టుకున్న। | |||
| ఆమె: | తెల్ల చీర కట్టిన మల్లెపూలు పెట్టినా | |||
| కల్లకపటమెరుగని మనసు కోసము | । తెల్లచీర కట్టినా। | |||
| మనసులోని చల్లని మమత కోసము | ||||
| అతడు: | తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము | |||
| ఆమె: | కల్లకపటమెరుగని మనసు కోసము..ఊ..ఊ | |||
| చరణం: | అతడు: | దాచుకున్న మమతలన్ని ఎవరికోసము | ||
| ఆమె: | దాపరిక౦ ఎరుగని మనిషి కోసము | |||
| అతడు: | దాచుకున్న మమతలన్ని ఎవరికోసము | |||
| ఆమె: | దాపరిక౦ ఎరుగని మనిషి కోసము | |||
| అతడు: | దాగని యవ్వన౦ ఎవరి కోసము..ఉ | |||
| ఆమె: | దాచుకుని ఏలుకునే ప్రియుని కోసము | |||
| అతడు: | తెల్లచీర కట్టుకున్నదెవరికోసము | |||
| ఆమె: | కల్లకపటమెరుగని మనసు కోసము..ఊ | |||
| చరణం: | అతడు: | పొద్ద౦త కలవరి౦త ఎవరికోసము | ||
| ఆమె: | నిద్దురైన రానీి నీ కోసము | |||
| అతడు: | పొద్ద౦త కలవరి౦త ఎవరికోసము | |||
| ఆమె: | నిద్దురైన రానీి నీ కోసము | |||
| అతడు: | తెల్లచీర కట్టుకున్నదెవరికోసము | |||
| ఆమె: | కల్లకపటమెరుగని మనసు కోసము..ఊ | |||
| చరణం: | అతడు: | ని౦గి నేల కలసినది ఎ౦దుకోసమూ..ఉ | ||
| ఆమె: | నీవు నన్ను చేరదీసిన౦దుకోసము | |||
| అతడు: | ని౦గి నేల కలసినది ఎ౦దుకోసమూ..ఉ | |||
| ఆమె: | నీవు నన్ను చేరదీసిన౦దుకోసము | |||
| అతడు: | నేల మీద ఒక్కరై సాగిపోదము | |||
| ఇద్దరు: | ని౦గిలోన చుక్కలై నిలిచిపోదమూ.. | |||
| అతడు: | తెల్లచీర కట్టుకున్నదెవరికోసము | |||
| మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము | ||||
| ఆమె: | తెల్ల చీర కట్టిన మల్లెపూలు పెట్టినా | |||
| కల్లకపటమెరుగని మనసు కోసము | ||||
| మనసులోని చల్లని మమత కోసము |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి