1972 సంవత్సరంలో విడుదలైన పద్మశ్రీ పిక్చర్స్ సంస్థ నిర్మించిన కొడుకు కోడలు చిత్రం నుండి ఘంటసాల-పి.సుశీల పాడిన నువ్వూ నేనూ ఏకమైనాము అనే ఈ యుగళగీతం రచన ఆత్రేయ, స్వరపరచినది కె.వి. మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, వాణీశ్రీ, ఎస్.వి. రంగారావు, శాంతకుమారి, లక్ష్మి. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు మూడు యుగళ గీతాలు, రెండు ఏకగళ గీతాలు పాడారు.
#2314 | పాట | యుగళగీతం: | నువ్వు, నేను ఏకమైనాము |
---|---|---|---|
పతాకం: | పద్మశ్రీ పిక్చర్స్ | ||
చిత్రం: | కొడుకు - కోడలు (1972) | ||
సంగీతం: | కె.వి. మహదేవన్ | ||
రచన: | ఆత్రేయ | ||
గానం: | ఘంటసాల, సుశీల | ||
పల్లవి: | ఘంటసాల: | నువ్వూ నేనూ ఏకమైనాము | |
నువ్వూ నేనూ ఏకమైనాము | |||
ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనామూ | |||
సుశీల: | లోకమంతా ఏకమైనా వేరు కాలేము వేరు కాలేము | ||
ఇద్దరు: | నువ్వూ నేనూ ఏకమైనాము | ||
చరణం: | ఘంటసాల: | కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడదామూ | |
సుశీల: | అందులో మన చల్ల చల్లని వలపు దీపం నిలుపుకుందాము | ||
ఘంటసాల: | కళ్ళు నాలుగు కలిపి మనమూ ఇల్లు కడదామూ | ||
సుశీల: | అందులో మన చల్ల చల్లని వలపు దీపం నిలుపుకుందాము | ||
ఘంటసాల: | పసిడి మనసులు పట్టెమంచం వేసుకుందాము ఊ ఉ | ||
సుశీల: | అందులో మన పడుచు కోర్కెల మల్లెపూలు పరుచుకుందాము ఊ ఉ | ||
ఇద్దరు: | నువ్వూ నేనూ ఏకమైనాము | ||
చరణం: | ఘంటసాల: | చెలిమితో ఒక చలువపందిరి వేసుకుందాము | |
సుశీల: | కలల తీగల అల్లిబిల్లిగా అల్లుకుందాము ఊ | ||
ఘంటసాల: | ఆ అల్లికను మన జీవితాలకు పోల్చుకుందాము | ||
సుశీల: | ఏ పొద్దు కానీ వాడిపోనీ పువ్వులవుదామూ ఊ ఊ | ||
ఇద్దరు: | నువ్వూ నేనూ ఏకమైనాము | ||
చరణం: | ఘంటసాల: | లేత వెన్నెల చల్లదనము నువ్వు తెస్తావూ ఊ | |
సుశీల: | అందులో నీరెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు | ||
ఘంటసాల: | లేత వెన్నెల చల్లదనము నువ్వు తెస్తావూ ఊ | ||
సుశీల: | అందులో నీరెండలోని వెచ్చదనము నువ్వు ఇస్తావు | ||
ఘంటసాల: | సూర్యచంద్రులు లేని జగతిని సృష్టి చేద్దాము ఊ ఊ | ||
సుశీల: | అందులో ఈ సృష్టికెన్నడు లేని సొగసు మనము తెద్దాము | ||
ఘంటసాల: | నువ్వూ నేనూ ఏకమైనాము | ||
ఇద్దరు: | ఇద్దరము మనమిద్దరము ఒక లోకమైనామూ | ||
లోకమంతా ఏకమైనా వేరు కాలేము వేరు కాలేము | |||
నువ్వూ నేనూ ఏకమైనాము ఆహ హా ఆహ ఆహ హా |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి