సామాజిక స్పృహ గల మాలపిల్ల (1939), రోజులు మారాయి (1000) వంటి మేటి చిత్రాలను నిర్మించిన, పేరెన్నిక గన్న సినీ బ్యానరు అయిన సారథీ స్టూడియోస్ వారు తాపీ చాణక్య దర్సకత్వంలో నిర్మించిన మరొక సామాజిక విలువలు తెలిపే చిత్రం కుంకుమ రేఖ (1960). ఈ చిత్రానికి సంగీతం మాస్టర్ వేణు (మద్దూరి వేణుగోపాల్). 'కళావాచస్పతి' కొంగర జగ్గయ్య, 'మహానటి' సావిత్రి, బాలయ్య ముఖ్య తారాగణం. ఈ చిత్రంలో ఘంటసాల మాస్టారు జిక్కీ (పి.జి.కృష్ణవేణి) తో కలసి మూడు యుగళ గీతాలు, రెండు ఏకగళ గీతాలు పాడారు. అందులో ఎక్కువ పాపులర్ అయినవి తీరెను కోరిక తీయ తీయగా, ఈ నాటి రేయి జాబిల్లి హాయి. ఈ చిత్రానికి కథ వ్రాసినది ప్రముఖ బాలీవుడ్ స్క్రీన్ ప్లే రచయిత అయిన పండిత్ ముఖ్ రాం శర్మ. ఈయన పలు సామాజిక సమస్యల ఇతివృత్తాలను కథలుగా వ్రాసి హిందీ తెరకెక్కించారు. ఈ చిత్రానికి మూలం 'ఏక్ హీ రాస్తా' అనే హిందీ చిత్రం.
చిత్రం: | కుంకుమ రేఖ (1960) | |
గీతం: | ఆరుద్ర | |
సంగీతం: | మాస్టర్ వేణు | |
గానం: | ఘంటసాల, జిక్కీ | |
పల్లవి: | ఇద్దరు: | తీరెను కోరిక తీయతీయగా హాయిగా మనసులు తేలిపోవగా |
కలసిప్రయాణం కలుగు వినోదం కలలు ఫలించె కమ్మకమ్మగా | ||
తీరెను కోరిక తీయతీయగా హాయిగా మనసులు తేలిపోవగా | ||
కలసిప్రయాణం కలుగు వినోదం కలలు ఫలించె కమ్మకమ్మగా | ||
చరణం: | జిక్కీ: | ఊహాలలోనికి ప్రయాణము ఉందామచటే నివాసము -2 |
ఘంటసాల: | తేనెలు కురిశాయి మన జీవితాన -2 | |
చూచెడువారలు యీసుచెందగ | ||
ఇద్దరు: | తీరెను కోరిక తీయతీయగా హాయిగా మనసులు తేలిపోవగా | |
కలసిప్రయాణం కలుగు వినోదం కలలు ఫలించె కమ్మకమ్మగా | ||
చరణం: | జిక్కీ: | ఇలలో స్వర్గం ఇదే ఇదే పాడేను నామది పదే పదే -2 |
ఘంటసాల: | పాటకు నా మనసు పరవశమొంది -2 | |
తన్మయమాయను తనివితీరగా | ||
ఇద్దరు: | తీరెను కోరిక తీయతీయగా హాయిగా మనసులు తేలిపోవగా | |
కలసిప్రయాణం కలుగు వినోదం కలలు ఫలించె కమ్మకమ్మగా |
కృతజ్ఞతలు: సినిమా పోస్టరును పొందుపరచిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి మరియు సమాచారం అందించిన వికిపీడియాకు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి