1972 సంవత్సరంలో విడుదలైన త్రివేణి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన బడిపంతులు చిత్రం నుండి ఘంటసాల పాడిన "ఎడబాటెరుగని పుణ్యదంపతుల" అనే ఈ ఏకగళగీతం రచన దాశరథి, స్వరపరచినది కె.వి. మహదేవన్. ఈ చిత్రం లో తారాగణం ఎన్.టి. రామారావు, అంజలీదేవి,నాగయ్య, రాజబాబు, కృష్ణంరాజు. ఈ చిత్రానికి నిర్మాత పి.పేర్రాజు మరియు దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డి. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు.
| M#611 | S#01 | ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల |
|---|---|---|
| చిత్రం: | బడి పంతులు (1972) | |
| రచన: | దాశరథి | |
| సంగీతం: | కె.వి.మహదేవన్ | |
| గానం: | ఘంటసాల | |
| సాకీ: | ఘం: | చిన్నబోయింది కైలాసం - శివపార్వతుల నివాసం |
| ప: | ఘం: | ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు |
| ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు | ||
| తోడు నీడగా వుండే వయసున గూడు విడిచి వేరైనారు | ||
| గూడు విడిచి వేరైనారు | ||
| ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు | ||
| చ: | ఘం: | జంటను వీడిన ఒంటరి బ్రతుకై జాలిగ కుమిలేరు |
| జంటను వీడిన ఒంటరి బ్రతుకై జాలిగ కుమిలేరు | ||
| ఎదలోదాగిన మూగ వేదన ఎవరికి చెప్పేరు | ||
| ఎలా భరించేరు | ||
| ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు | ||
| చః | ఘం: | ఒకే తనువుగ ఒకే మనువుగా ఆ దంపతులు జీవించారు |
| ఒకే తనువుగ ఒకే మనువుగ ఆ దంపతులు జీవించారు | ||
| ఆస్తిపాస్తివలె అన్నదమ్ములు ఆ తలిదండ్రుల పంచారు | ||
| ఆ తలిదండ్రుల పంచారు | ||
| ఎడబాటు ఎరుగని పుణ్య దంపతుల విడదీసింది విధి నేడు | ||
| తోడు నీడగా వుండే వయసున గూడు విడిచి వేరైనారు | ||
| గూడు విడిచి వేరైనారు |
కృతజ్ఞతలు : చిత్రంలోని పాటల వివరాలను "ఘంటసాల గళామృతము" బ్లాగ్ ద్వారా అందించిన శ్రీ కొల్లూరు భాస్కరరావు గారికి, సాహిత్యాన్ని"శతాబ్దిగాయకుడు ఘంటసాల" పుస్తకము ద్వారా అందించిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి హృదయపూర్వక నమస్కారములు.
ఘంటసాల గానపదసూచిక (HOME)
ఘంటసాల బ్లాగు (HOME)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి