1949 సంవత్సరంలో విడుదలైన ఆర్.పద్మనాభన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన రక్షరేఖ చిత్రం నుండి ఘంటసాల మాస్టారు బృందం తో కలసి పాడిన "రామనామ సంకీర్తనమే" అనే ఈ బృందగీతం రచన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి, స్వరపరచినది ఓగిరాల రామచంద్రరావు. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, పి.భానుమతి, అంజలీదేవి, కస్తూరి శివరావు, జూనియర్ లక్ష్మీరాజ్యం. ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు ఆర్.పద్మనాభన్. ఈ గీతాన్ని అక్కినేని, తదితరులు పై చిత్రీకరించారు. ఈ చిత్రం 30.04.1949 న విడుదలైంది.
| M#10 | S#1 | రామనామ జపమే.. (బృందగీతం) |
|---|---|---|
| చిత్రం: | రక్షరేఖ (1949) | |
| రచన: | బలిజేపల్లి లక్ష్మీకాంత కవి | |
| పాడినవారు: | ఘంటసాల, బృందం | |
| సంగీతం: | ఓగిరాల రామచంద్రరావు | |
| అభినయం: | ఎ.యన్. ఆర్., తదితరులు | |
| పల్లవి: | ఘంటసాల: | రామనామ జపమే ఏ. ఏ.! రామనామ జపమే |
| సుమనోరంజనంబురా..ఆ.ఆ.ఆ.ఆ. | ||
| బృందం: | రామనామ జపమే! | |
| సుమనోరంజనంబురా..ఆ.ఆ.ఆ.ఆ. | ||
| అందరు: | రామనామ సంకీర్తనమే! రక్తి భుక్తి జీవన్ముక్తి | |
| $$$$$ | ||
| సాకీ: | ఘంటసాల: | నామ కుసుమ పూజచేసీ.ఈ.ఈ. |
| $$$$$ | ||
| శ్రీమహేశ్వరి తరించే.ఏ.ఏ. | ||
| ప్రేమసుధా సారము చిలికీ.ఈ.ఈ | ||
| $$$$$ | ||
| కామితార్ధముల నొసగే..ఏ.ఏ.ఏ, ఏ.ఏ.ఏ., ఏ.ఏ.ఏ, ఏ.ఏ.ఏ. | ||
| చరణం: | ఘంటసాల: | తపో యజ్ఞ దానాదులచే తరముగాని బ్రహ్మపదవి |
| తపో యజ్ఞ దానాదులచే తరముగాని బ్రహ్మపదవి | ||
| మనసునిలిపి రామా యనిచూ, మనన జేసినంతనే దొరకే | ||
| అందరు: | రామనామ సంకీర్తనమే! రక్తి భుక్తి జీవన్ముక్తి | |
| $$$$$ | ||
| సాకీ: | ఘంటసాల: | శబరి యే తపంబుచేసే.ఏ.ఏ. |
| $$$$$ | ||
| గుహుడు యేమి జపము జేసే.ఏ.ఏ. | ||
| $$$$$ | ||
| శరణమన్న మాత్రమె కాదే.. | ||
| $$$$$ | ||
| విభీషణుడు తా తరియించే ఏ.ఏ.ఏ, ఏ.ఏ.ఏ., ఏ.ఏ.ఏ, ఏ.ఏ.ఏ.. | ||
| ఘంటసాల: | రామనామ జపమే.ఏ.ఏ. ! రామనామ జపమే | |
| సుమనో రంజనంబురా..ఆ.ఆ.ఆ.ఆ. | ||
| అందరు: | రామనామ సంకీర్తనమే, రక్తి భుక్తి జీవన్ముక్తి | |
| రామనామ సంకీర్తనమే, రక్తి భుక్తి జీవన్ముక్తి | ||
| ఘంటసాల: | రామరామ శ్రీరఘురామా | |
| బృందం: | రామరామ శ్రీరఘురామా | |
| ఘంటసాల: | రామరామ సీతా.రామా! | |
| బృందం: | రామరామ రఘురామా | |
| ఘంటసాల: | రామరామ సీతా.రామా! | |
| బృందం: | రామరామ రఘురామా | |
| ఘంటసాల: | రామరామ రఘురామా | |
| బృందం: | రామరామ రఘురామా | |
| ఘంటసాల: | రామరామ సీతా.రామా! | |
| బృందం: | రామరామ రఘురామా | |
| ఘంటసాల: | రామరామ సీతా.రామా! | |
| బృందం: | రామరామ రఘురామా | |
| అందరు: | జై రామరామ రఘురామా | |
| జై రామరామ రఘురామా | ||
| జై రామరామ రఘురామా | ||
| జై రామరామ రఘురామా | ||
| జై రామరామ రఘురామా |
కృతజ్ఞతలు - ఆడియోను అందించిన ఘంటసాల గానసభ, హైదరాబాద్ వ్యవస్థాపకులు డా. కె.వి. రావు గారికి, పాట సాహిత్యాన్ని తన "శతాబ్దిగాయకుడు ఘంటసాల" పుస్తకంలో ప్రచురించి, లభింపజేసిన శ్రీ చల్లా సుబ్బారాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి