1947 సంవత్సరంలో విడుదలైన శారదా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన పల్నాటి యుద్ధం చిత్రం నుండి ఘంటసాల పాడిన "తీరిపోయెనా మాతా" అనే ఈ ఏకగళగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది గాలిపెంచెల. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, ఎస్.వరలక్ష్మి, గోవిందరాజుల సుబ్బారావు, కన్నాంబ, వంగర, సురభి బాలసరస్వతి, ముదిగొండ లింగమూర్తి. ఈ చిత్రానికి నిర్మాత కోగంటి వెంకట సుబ్బారావు మరియు దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం, ఎల్.వి.ప్రసాద్. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు. ఈ చిత్రం 24.09.1947 న విడుదలైంది.
| # | చిత్రం# | పాట# | పాట | తీరు |
|---|---|---|---|---|
| 5 | 3 | తీరిపోయెనా మాతా | ఏకగళం | |
| ప: | తీరిపోయెనా మాతా | |||
| నేటికి నీతో ఋణానుబంధము | ॥ తీరి ॥ | |||
| చ: | నీ కౌగిటిలో పెరిగీ | |||
| నీ కరుణారస పానము జేసి | ||||
| చౌకళించు మా వీర సింహముల | ||||
| చౌకజేసి సిరి క్షణభంగురమై | ॥ తీరి ॥ | |||
| చ: | పసిడి పొలాలు, పచ్ఛల బీళ్ళు | |||
| కేశవ పూజలు ఎడబాసీ | ||||
| మాట కోసమై పర పంచలకూ | ||||
| పోవలెనా పలనాటి మాతా | ॥ తీరి ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి