గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
25, అక్టోబర్ 2025, శనివారం
అహొ ఒహొ ఎంత ఆనందంబాయె - కీలుగుర్రం నుండి వక్కలంక సరళ
22, జులై 2025, మంగళవారం
ఘంటసాల మాస్టారు పాపాయి పద్యాల recording
Photo Courtesy: Sri Dr. K.V. Rao, Hyderabad.
సర్వశ్రీ సంగీతరావు గారు, కృష్ణమాచారి గారు, Y. N. శర్మగారు ( మణిశర్మ father ), ఘంటసాలగారు,సుభాన్ గారు, పద్మభూషణ్ జాషువా గారు, recording మేనేజర్ మంగపతి గారు, దాసరి రామారావు గారు, అమంచర్ల గోపాలరావు గారు ( ఆకాశవాణి), J. V. రాఘవులు గారు.
11, జులై 2025, శుక్రవారం
ఏమి వర్ణింతువోయి నీవు - అమ్మ(డా) చిత్రం నుండి ఘంటసాల
30, జూన్ 2025, సోమవారం
చెఱసాల పాలైనావా - దొంగ రాముడు చిత్రం నుండి ఘంటసాల
1955 సంవత్సరంలో విడుదలైన అన్నపూర్ణా పిక్చర్స్ సంస్థ నిర్మించిన దొంగ రాముడు చిత్రం నుండి ఘంటసాల పాడిన "చెరసాల పాలైనావా " అనే ఈ ఏకగళగీతం రచన సముద్రాల సీ., స్వరపరచినది పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, సావిత్రి, జమున, ఆర్.నాగేశ్వరరావు, రేలంగి, జగ్గయ్య, సూర్యకాంతం,అల్లు రామలింగయ్య. ఈ చిత్రానికి నిర్మాత డి.మధుసూదనరావు మరియు దర్శకుడు కె.వి.రెడ్డి. దీనిని నేపథ్యగానం గా చిత్రీకరించారు. ఈ చిత్రం 01.10.1955 న విడుదలైంది.
ఈ ఏకగళగీతానికి సాహిత్యం శ్రీ చల్లా సుబ్బారాయుడు గారు సంకలనం చేసిన "శతాబ్ది గాయకుడు ఘంటసాల" గ్రంథము నుండి సేకరించబడింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
చిగురాకులలో చిలకమ్మా - దొంగ రాముడు చిత్రం నుండి ఘంటసాల, జిక్కీ
3, మే 2025, శనివారం
‘ఆ కుమారి అమాయక’ పద్యం - శ్రీగౌరీమహాత్మ్యం చిత్రం నుండి ఘంటసాల
1956 సంవత్సరంలో విడుదలైన మహీ సంస్థ నిర్మించిన శ్రీగౌరీమహాత్మ్యం చిత్రం నుండి ఘంటసాల పాడిన "ఆ కుమారి అమాయక " అనే ఈ పద్యాలు రచన మల్లాది, స్వరపరచినది ఓగిరాల, టి.వి.రాజు. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, శ్రీరంజని, కాంతారావు, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు . ఈ చిత్రానికి నిర్మాత పి.శేషాచలం మరియు దర్శకుడు డి.యోగానంద్.
ఆ కుమారి, అమాయిక అమల హృదయ చలి పిడుగు వంటి దాబాసవతి
2, మే 2025, శుక్రవారం
చేతిలో చెయ్యేసి చెప్పుబావా - దసరా బుల్లోడు చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల
1971 సంవత్సరంలో విడుదలైన జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన దసరా బుల్లోడు చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "చేతిలో చెయ్యేసి చెప్పుబావా" అనే ఈ యుగళం రచన ఆత్రేయ, స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, వాణిశ్రీ, చంద్రకళ, ఎస్.వి. రంగారావు,సూర్యకాంతం,గుమ్మడి. ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్.
చంద్రగిరి చంద్రమ్మా - దొరబాబు చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల, బృందం
1974 సంవత్సరంలో విడుదలైన ఫణిమాధవి కంబైంస్ సంస్థ నిర్మించిన దొరబాబు చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "చంద్రగిరి చంద్రమ్మా " అనే ఈ యుగళం రచన ఆత్రేయ, స్వరపరచినది జె.వి.రాఘవులు. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, మంజుల, చంద్రకళ, సత్యనారాయణ, జయంతి . ఈ చిత్రానికి నిర్మాతలు జె.సుబ్బారావు, జి.రాజేంద్రప్రసాద్ మరియు దర్శకుడు తాతినేని రామారావు.
రారా మా ఇంటికి - దొరబాబు చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల
1974 సంవత్సరంలో
విడుదలైన ఫణిమాధవి కంబైంస్ సంస్థ నిర్మించిన దొరబాబు చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "రారా
మా ఇంటికి " అనే ఈ యుగళం రచన
డా.సినారె, స్వరపరచినది జె.వి.రాఘవులు. ఈ
చిత్రంలో తారాగణం అక్కినేని, మంజుల, చంద్రకళ, సత్యనారాయణ, జయంతి . ఈ చిత్రానికి నిర్మాతలు
జె.సుబ్బారావు, జి.రాజేంద్రప్రసాద్ మరియు
దర్శకుడు తాతినేని రామారావు.
దేవుడెలా ఉంటాడని - దొరబాబు చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల
1974 సంవత్సరంలో విడుదలైన ఫణిమాధవి కంబైంస్ సంస్థ నిర్మించిన దొరబాబు చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల తో పాడిన "దేవుడెలా ఉంటాడని" అనే ఈ యుగళం రచన దాశరథి, స్వరపరచినది జె.వి.రాఘవులు. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, మంజుల, చంద్రకళ, సత్యనారాయణ, జయంతి . ఈ చిత్రానికి నిర్మాతలు జె.సుబ్బారావు, జి.రాజేంద్రప్రసాద్ మరియు దర్శకుడు తాతినేని రామారావు.
31, జనవరి 2025, శుక్రవారం
వినరా బుల్లెమ్మ వీరగాధలు - దసరా బుల్లోడు చిత్రం నుండి ఘంటసాల, పిఠాపురం
1971 సంవత్సరంలో విడుదలైన జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన దసరా బుల్లోడు చిత్రం నుండి ఘంటసాల, పిఠాపురం తో పాడిన "వినరా బుల్లెమ్మ వీరగాధలు" అనే ఈ యుగళం రచన ఆత్రేయ, స్వరపరచినది కె.వి.మహదేవన్. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, వాణిశ్రీ, చంద్రకళ, ఎస్.వి. రంగారావు, సూర్యకాంతం, గుమ్మడి. ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు వి.బి. రాజేంద్రప్రసాద్.
28, జనవరి 2025, మంగళవారం
చిత్రమె పాడునటే - శభాష్ పిల్ల - అనువాద చిత్రం నుండి ఘంటసాల
1959 సంవత్సరంలో విడుదలైన పద్మిని పిక్చర్స్ సంస్థ నిర్మించిన సెబాష్ పిల్లా(డ) చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పాడిన "చిత్రము పాడునటే " అనే ఈ ఏకగళం రచన శ్రీశ్రీ, స్వరపరచినది టి.జి.లింగప్ప. ఈ చిత్రంలో తారాగణం శివాజీగణేశన్, చంద్రబాబు, ఎస్.వి. రంగారావు,బి. సరోజాదేవి, కుసుమకుమారి. ఈ చిత్రానికి నిర్మాత బి.ఆర్.పంతులు మరియు దర్శకుడు బి.ఆర్.పంతులు. ఈ పాట ఎం.జి.ఆర్ పై చిత్రీకరించబడింది.
| #000 | పాట: | చిత్రమె పాడునదె | |
|---|---|---|---|
| చిత్రం: | సెబాష్ పిల్లా (డబ్బింగ్) (1959) | ||
| రచన: | శ్రీశ్రీ | ||
| గానం: | ఘంటసాల | ||
| సంగీతం: | టి,జి.లింగప్ప | ||
| ప: | చిత్రమె పాడునటే | ||
| ఓహో చిత్రమె పాడునటే | |||
| నా చిత్తమె ఆడునటే..ఏ. | ॥ చిత్రమె॥ | ||
| ముచ్చటగా యిపుడూ..ఊ..ఊ | |||
| ముచ్చటగా యిపుడూ | |||
| మోహనమూర్తియై మించునటే..ఏ.. | |||
| ముచ్చటగా యిపుడూ | |||
| మోహనమూర్తియై మించునటే..ఏ.. | ॥ చిత్రమె॥ | ||
| చ: | నా హృదయం మీదా..ఆ..ఆ.. | ||
| నా హృదయం మీదా ఒక నక్షత్రము పోలే -2 | |||
| పాదము పెట్టినదే చేరి నావలె చూచునటే -2 | ॥ చిత్రమె॥ | ||
| చ: | నా మనం నీదైతే, సుఖరాజ్యము నాదె సుమా -2 | ||
| ఎంత మనోబలమో మౌనం ఏల సఖీమణికి -2 | ॥ చిత్రమె॥ |
మంచి పెంచవయ్యా - శభాష్ సత్యం చిత్రం నుండి ఘంటసాల
| #000 | పాట: | మంచి పెంచవయ్య మా మనసు పెంచవయ్య | |
|---|---|---|---|
| నిర్మాణం: | ప్రాత్నా పిక్చర్స్ | ||
| చిత్రం: | శభాష్ సత్యం (1969) | ||
| రచన: | ఆత్రేయ | ||
| పాడినవారు: | ఘంటసాల | ||
| సంగీతం : | విజయా కృష్ణమూర్తి | ||
| అభినయం : | వంగర వెంకటసుబ్బయ్య | ||
| సాకీ: | ఎక్కడికో, ఎందుకో ఈ పరుగు | ||
| ఎవరికి వారై పోతున్నాము, ఓ దేవా! | |||
| ప: | మంచి పెంచవయ్య మా మనసు పెంచవయ్య | ||
| స్వార్థాలు చివికిపోగా స్వర్గాలు భువికి రాగా | ॥మంచి|| | ||
| చ: | మా మేలు కోరి మాకు మతి నిచ్చినావయా | ||
| అది మరచి నిన్ను మరచి గతి తప్పినామయా | |||
| మన్నించు కరుణ నీవే నడిపించు వెలుగువే | ॥మంచి|| | ||
| చ: | హృదయాన్ని మూతబెట్టి, గుడి తెరచినామయా -2 | ||
| కనులుండి మూసుకొనియే, నిను వెదకినామయా-2 | |||
| దేవా నీవే తెరిపించవలెను రెండు | ॥మంచి|| |
26, జనవరి 2025, ఆదివారం
నీ కథ ఇంతేనమ్మా - ‘ఆడజన్మ’ చిత్రం నుండి ఘంటసాల
1970 సంవత్సరంలో విడుదలైన విజయలక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మించిన ఆడజన్మ చిత్రం నుండి ఘంటసాల పాడిన "నీ కధ ఇంతేనమ్మా " అనే ఈ ఏకగళం రచన ఆత్రేయ, స్వరపరచినది మాస్టర్ వేణు. ఈ చిత్రంలో తారాగణం జమున, హరనాధ్, నాగభూషణం,చంద్రమోహన్, గీతాంజలి, మాలతి. ఈ చిత్రానికి నిర్మాత జి.వి.ఎస్.రాజు మరియు దర్శకుడు ఐ.ఎస్.మూర్తి. చిత్రంలో ఈ పాట నేపథ్యగానంలో వినిపిస్తుంది.
| #000 | పాట: | నీ కథ యింతేనమ్మా! | |
|---|---|---|---|
| నిర్మాణం: | విజయలక్ష్నీ మూవీస్ | ||
| చిత్రం: | ఆడజన్మ (1970) | ||
| రచన: | ఆత్రేయ | ||
| సంగీతం : | మాస్టర్ వేణు | ||
| అభినయం : | నేపథ్యగానం | ||
| పాడినవారు : | ఘంటసాల | ||
| ప: | నీ కథ యింతేనమ్మా నీ కథ యింతేనమ్మా | ||
| దీనికి అంతే లేదమ్మా | |||
| కాలం మార్చని కన్నీటి గాథమ్మా | |||
| యీ ఆడజన్మ | ॥నీ కథ॥ | ||
| చ: | పుట్టడమే పుట్టింటికి పుట్టెడు ఖర్చుగా పుడతావు -2 | ||
| ఎదిగిన కొలది కన్నవారికి మోయరాని బరువౌతావు | |||
| కన్నీరే నీ సారెగా, మెట్టినింటికీ వెళతావు -2 | |||
| వారి కలిమిలేములకు నువు కారణమని | |||
| మెప్పులో నిందలో పడతావు | ॥నీ కథ॥ | ||
| చ: | భర్తను కాదని పసిడి లేడికై ఆశపడినది జానకి | ||
| తండ్రి యింట తనకన్నీ కలవని | |||
| తరలిపోయినది దాక్షాయణీ | |||
| అవమానాలే మిగిలినవి, అనుమానాలే రగిలినవి | |||
| నరకమైనా స్వర్గమైనా, మెట్టినిల్లే యిల్లాలికమ్మా | |||
| ఆశలైనా నిరాశలైనా, మగని నీడనె మగనాలికమ్మా | |||
| మగని నీడనె మగనాలికమ్మా | |||
| నీ కథ యింతేనమ్మా నీ కథ యింతేనమ్మా | |||
| దీనికి అంతే లేదమ్మా | |||
| కాలం మార్చని కన్నీటి గాథమ్మా | |||
| ఆడజన్మ, ఆడజన్మ, ఆడజన్మ, ఆడజన్మ |
25, జనవరి 2025, శనివారం
మెట్టిన దినమని సత్యయు (పద్యం) - శ్రీకృష్ణతులాభారం చిత్రం నుండి ఘంటసాల
1966 సంవత్సరంలో విడుదలైన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన శ్రీకృష్ణతులాభారం చిత్రం నుండి ఘంటసాల పాడిన "మెట్టిన దినమని సత్యయు పుట్టిన " అనే ఈ పద్యాలు రచన ముత్తరాజుసుబ్బారావు, స్వరపరచినది పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,జమున,కాంతారావు,అంజలీదేవి, పద్మనాభం. ఈ చిత్రానికి నిర్మాత డి. రామానాయుడు మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు.
| #000 | పద్యం: | మెట్టిన దినమని సత్యయు |
|---|---|---|
| చిత్రం: | శ్రీకృష్ణ తులాభారం (1969) | |
| రచన: | ముత్తరాజు సుబ్బారావు | |
| సంగీతం: | పెండ్యాల | |
| గానం: | ఘంటసాల | |
| ఘం: | మెట్టిన దినమని సత్యయు | |
| పుట్టిన దినమని భీష్మపుత్రియు, నన్ని | ||
| ప్పట్టున బిలుతుతు విందునకు | ||
| యిట్టి యెడల ఎచటికేగ హితవో చెప్పుమా! |
24, జనవరి 2025, శుక్రవారం
ఎన్నడు వేడరాని వనజేక్షణ (పద్యం) - శ్రీకృష్ణతులాభారం చిత్రం నుండి ఘంటసాల
1966 సంవత్సరంలో విడుదలైన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన శ్రీకృష్ణతులాభారం చిత్రం నుండి ఘంటసాల పాడిన "ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి " అనే ఈ పద్యాలు రచన ముత్తరాజు సుబ్బారావు, స్వరపరచినది పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,జమున,కాంతారావు,అంజలీదేవి, పద్మనాభం. ఈ చిత్రానికి నిర్మాత డి. రామానాయుడు మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు.
| #000 | పద్యం: | ఎన్నడు వేడరాని వనజేక్షణ |
|---|---|---|
| చిత్రం: | శ్రీకృష్ణ తులాభారం (1969) | |
| రచన: | ముత్తరాజు సుబ్బారావు | |
| సంగీతం: | పెండ్యాల | |
| గానం: | ఘంటసాల | |
| ఘం: | ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి వచ్చి నిన్నునున్ | |
| నన్నును నేడు పుట్టినదినంబని యెంతయు ప్రేమతోడా మృ | ||
| ష్టాన్నములారగింప స్వగృహంబునకున్ దయసేయ వేడుచో | ||
| కన్నడ సేయబూనెదవు కంజదళాక్షి యిదేటి న్యాయమే! |
ఓహో మోహనరూపా - శ్రీకృష్ణతులాభారం చిత్రం నుండి ఘంటసాల,పి.సుశీల,బి.వసంత
1966 సంవత్సరంలో విడుదలైన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన శ్రీకృష్ణతులాభారం చిత్రం నుండి ఘంటసాలపి.సుశీల,బి.వసంత పాడిన "ఓహో మోహనరూపా" అనే ఈ బహుగళం రచన శ్రీశ్రీ, స్వరపరచినది పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు,జమున,కాంతారావు,అంజలీదేవి, పద్మనాభం. ఈ చిత్రానికి నిర్మాత డి. రామానాయుడు మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు.
| #000 | పాట: | ఓహో మోహనరూపా |
|---|---|---|
| చిత్రం: | శ్రీకృష్ణ తులాభారం (1969) | |
| రచన: | శ్రీశ్రీ | |
| సంగీతం: | పెండ్యాల | |
| గానం: | ఘంటసాల, పి.సుశీల, బి.వసంత | |
| ఘ: | ఓహో.... మోహనరూపా, | |
| కేళీ... కలాపా కృష్ణా...ఆ..ఆ. | ||
| ఓహో మోహనరూపా కేళీ కలాపా | ||
| కృష్ణా నిను గని మురిసెను నా మనసే | ||
| ఓహో మోహనరూపా కేళీ కలాపా | ||
| కృష్ణా నిను గని మురిసెను నా మనసే | ||
| సు: | ఓఓఓ.ఓఓఓ..ఆఆఅ.... | |
| మధువులు చిందే మందహాసం | ||
| మరులూరించే వేణుగానం | ||
| మధువులు చిందే మందహాసం | ||
| మరులూరించే వేణుగానం | ||
| వినివిని పరవశనైతినిలే - 2 | ||
| బిగిబిగి కౌగిట కరగితిలే | ||
| ఓహో మోహనరూపా కేళీ కలాపా | ||
| కృష్ణా... నిను గని మురిసెను నా మనసే | ||
| ఘ: | ప్రణయారాధన వేళ బాలా | |
| పతిపూజలు నీకేల బేలా | ||
| ప్రణయారాధన వేళ బాలా | ||
| పతిపూజలు నీకేల బేలా | ||
| ఆ...వలపు చిలుకు నీ చూపులు నాపై | ||
| నిలుపవే శుభాంగీ..ఈ.., నిలుపవే లతాంగీ | ||
| వ: | ఓ...ఓహో మోహనరూపా కేళీ కలాపా కృష్ణా... | |
| నిను గని మురిసెను నా మనసే | ||
| సు: | ఓఓఓ....ఆఆఆ.... | |
| మధుర సుధా రాగమే, మదిలో కదిలే తీయగా | ||
| ఘ: | ఓఓఓఓఓ.... | |
| మధుర సుధా రాగమే, మదిలో కదిలే తీయగా | ||
| శిఖిపింఛమౌళీ నన్నేలగా | ||
| తనువే ఊగే హాయిగా | ||
| ఇ: | ఆఆఅ...ఓఓఓ..మ్మ్మ్... | |
| ఘ: | అహో లీలామానుషవేషధారీ మురారీ | |
| తనివార నినుగాంచి ధన్యతనొందితి శౌరీ | ||
| ఓహో మోహనరూపా కేళీ కలాపా | ||
| మోహనరూపా..మోహనరూపా.. |











