1958 సంవత్సరంలో విడుదలైన పొన్నలూరి బ్రదర్స్ సంస్థ నిర్మించిన శోభ చిత్రం నుండి ఘంటసాల పాడిన "ఘనుడా భూసురుడేగెనో" అనే ఈ పద్యాలు రచన బమ్మెఱ పోతన, స్వరపరచినది ఎ.ఎం.రాజా. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి.రామారావు, అంజలీదేవి, రాజసులోచన, ముక్కామల, రమణారెడ్డి, రేలంగి. ఈ చిత్రానికి నిర్మాత తెలియదు మరియు దర్శకుడు కె.కామేశ్వర రావు. దీనిని రేలంగి పై చిత్రీకరించారు. ఈ చిత్రం 01.05.1958 న విడుదలైంది.
ఈ పద్యం బమ్మెఱ పోతన విరచిత భాగవతంలోని రుక్మిణీ కల్యాణం ఘట్టం నుండి తీసుకోబడిన పద్యం ఇది. దీనికి చక్కని వివరణ "ఈమాట" వెబ్ జైన్ లో శ్రీ చీమలమర్రి బృందావనరావు గారు వ్రాసిన వివరణ ఏమంటే - "ఒక యువకుని ప్రేమించి, తన ప్రేమ సాఫల్యం పొందగల అవకాశాలుగాని, తన వారినుంచి తగిన సానుకూలతగానీ లేకపోవడంతో స్వయంగా తన ప్రయత్నాలు ప్రారంభించి, ఆ యత్నాలు ఫలిస్తాయో లేదో అనే సందేహమూ, ఆతురతా, ఏమవుతుందో అనే భయమూ - వీటితో డోలాయమానమౌతున్న కన్నెమనసు ఈ పద్యంలో ఎంతో సహజంగా కనిపిస్తుంది".
ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో
విని కృష్ణుండది తప్పుగా తలచెనో విచ్చేసెనో ఈశ్వరుం
డనుకూలింప తలంచునో తలపడో ఆర్యామహాదేవియున్
నను రక్షింప ఎరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి