భక్తి-శివుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భక్తి-శివుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, ఫిబ్రవరి 2012, సోమవారం

గరళకంఠుని పై శ్రీ ఆది శంకరాచార్యకృత శ్లోకాలు - మాస్టారి గళంలో

జగద్గురువు శ్రీ ఆది శంకరాచార్యుల వారిని సాక్షాత్ పరమ శివుని అవతారంగా అభివర్ణిస్తారు. శ్రీ శంకర భగవత్పాదుల వారు మనకెన్నో అమూల్యమైన స్తోత్రాలు, అష్టకాలు అందించారు. అంతేకాదు సర్వ మానవ కల్యాణం కోసం శ్రీ చక్ర స్థాపన చేసారు. వారు వ్రాసిన శివస్తుతిలోని విశ్వనాథ అష్టకం   మరియు శివ పంచాక్షరి లోని చెరొక శ్లోకాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను.  "వీరాంజనేయ" చిత్రం కోసం  విశ్వనాథ అష్టకం లోని కాశీ విశ్వేశ్వరుని స్తుతించే శ్లోకం "గంగా తరంగ కమనీయ జటా కలాపం" మరియు "స్వర్ణమంజరి" చిత్రం కోసం శివ పంచాక్షరి లోని "మ"కార శ్లోకాన్ని, మాస్టారు భక్తి పారవశ్యంతో గానం చేసారు. ఈ శ్లోకాలకు తెలుగు వారికి గర్వకారణమైన చిత్రకారులు శ్రీ వడ్డాది పాపయ్య ("వపా") గారు చందమామ , యువ మొదలయిన మాస పత్రికలకు వేసిన తైలవర్ణ చిత్రాలను శ్రీ సోము శ్రీనివాసమూర్తి గారు, శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారు శ్లోకంలో భావానికి అనుగుణమైన బొమ్మలను ఎన్నుకుని సృజనాత్మకంగా తయారు చేసిన వీడియో ద్వారా కన్నుల విందుగా ప్రదర్శించారు. వారికి కృతజ్ఞతలు. ఆ చిత్రాలను, నేపథ్యంలో మాస్టారి గానాన్ని విని ఆనందించండి.





శ్లో:
చిత్రం:     వీరాంజనేయ (1968)
గానం:     ఘంటసాల 

గంగాతరంగ కమనీయ జటాకలాపం
గౌరీ నిరంతర విభూషిత వామభాగం
నారాయణ ప్రియం అనంగ మదాపహారం
వారాణసీ పురపతిం భజ విశ్వనాథం
ఆ.. ఆ.. ఆ.. భజ విశ్వనాథం


శ్లో:
చిత్రం:     స్వర్ణ మంజరి (1962)
గానం:     ఘంటసాల 

మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమధనాథ మహేశ్వరాయ
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై "మ"కారాయ నమః శివాయ
ఆ.. ఆ.. ఆ.. ఆ..

20, ఫిబ్రవరి 2012, సోమవారం

శివరాత్రి శుభాకాంక్షలతో "దేవ దేవ ధవళాచల మందిర"

ఘంటసాల మాస్టారు ఎన్.టి.ఆర్. కు ఎ.ఎన్.ఆర్.కు పాడేటప్పుడు గొంతులో చక్కని వైవిధ్యం చూపించేవారు. అయితే ఇద్దరికీ ఒకే పాటలో నేపథ్య గానం చేసిన పాటలు తక్కువ. అందులో చెప్పుకోదగినది "భూకైలాస్" చిత్రంలోని "దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో నమో". స్థల పురాణం ప్రకారం ప్రకారం శివుని వరంతో ఆత్మలింగాన్నిసంపాదించి లంకలో స్థాపించవలెనని బయలుదేరిన రావణాసురుని వినాయకుడు యుక్తితో మార్గ మధ్యంలో బాలుని రూపంలో అడ్డుకుని  గోకర్ణ క్షేత్రం వద్ద ఆ లింగాన్ని నేలపై మోపించి లంకాదీశ్వరునికి దక్కకుండా చేసే కథాంశం తో నిర్మింప బడిన చిత్రమిది. ఈ చిత్రంలో పరమశివుని కి అత్యంత ప్రియ భక్తుడైన రావణుడు (ఎన్.టి.ఆర్.) పాడగా చివరలో నారదుడు (ఎ.ఎన్.ఆర్.) అందుకుంటాడు. మాస్టారు ఇద్దరు నటులకూ ఒకే పాటలో పాడినా, ఆయన ఎవరికి పాడుతున్నారో కళ్ళు మూసుకుని విని చెప్పొచ్చు.  ఈ రోజు శివరాత్రి.  ఈ సంవత్సరం శివునికి ప్రీతి కలిగించే రోజైన సోమవారంనాడు ఈ పర్వదినం రావడం మన అదృష్టం. అయితే సోమ లేదా సోముడు అంటే చంద్రుడు కదా!, ఆ పేరున వచ్చేది సోమవారం (moon-Monday), మరి శివునికి సోమకు ఏమిటి సంబంధం?  ఈ ప్రశ్నకు ఒకసారి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు చక్కని భాష్యం చెప్పారు. "సోమ" = "స + ఉమ", అంటే ఉమతో కూడియున్నవాడు అని. ఈ పాటను శివరాత్రి కానుకగా మాస్టారి అభిమానులకు దృశ్య, సాహిత్యాలతో ఇక్కడ పొందుపరుస్తున్నాను. 
వీడియో మూలం: ఘంటసాల గానామృతం


చిత్రం:         భూకైలాస్ (1958)
సంగీతం:      ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం
గానం:         ఘంటసాల

ప.             దేవదేవ ధవళాచలమందిర గంగాధరాహర నమో! నమో!
                దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమో! నమో!         | దేవదేవ |

అ.ప.      పాలితకింకర భవనాశంకర శంకర పురహర నమో! నమో!               | పాలిత కింకర |
                హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో! నమో!            | హాలాహలధర |
                దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో! నమో!
                దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమో! నమో!

చ.             దురిత విమోచనా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
                దురిత విమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో! నమో
                కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో! నమో               | కరిచర్మాంబర |
                దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమో! నమో!
                దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమో! నమో!
                నమో! నమో!, నమో! నమో!, నమో! నమో!, నమో! నమో!
                నమో! నమో!, నమో! నమో!, నమో! నమో!, నమో! నమో!

                నారాయణ హరి నమో! నమో!
                నారాయణ హరి నమో! నమో!
                నారాయణ హరి నమో! నమో!
                నారాయణ హరి నమో! నమో!
                నారద హృదయవిహారీ నమో! నమో!              | నారద |
                నారాయణ హరి నమో! నమో!                     | నారాయణ |
                నారాయణ హరి నమో! నమో!
                పంకజ నయనా పన్నగ శయనా .. ఆ.. ఆ
                పంకజ నయనా పన్నగ శయనా
                పంకజ నయనా పన్నగ శయనా
                శంకర వినుత నమో! నమో!                         | శంకరవినుతా |
                నారాయణ హరి నమో! నమో!
                నారాయణ హరి నారాయణ హరి
                నారాయణ హరి నమో! నమో!

21, నవంబర్ 2011, సోమవారం

శివుని దృష్టిలో అంతా సమానులన్న శ్రీశ్రీ గీతాన్ని భావోద్వేగంతో గానం చేసిన ఘంటసాల -జయభేరి నుండి

చిత్రం:జయభేరి          రచన: శ్రీశ్రీ              సంగీతం: పెండ్యాల        గానం: ఘంటసాల

ఒక భక్తి గీతంలో కూడా తన సంతకపు మార్కును, కలం పవరును చూపించిన ఘనత మహాకవి శీశ్రీది అనడానికి నిదర్శనం 1959 లో విడుదల అయిన "జయభేరి" చిత్రం లోని ఈ పాట. సమ సమాజ స్థాపన ధ్యేయంగా శ్రీశ్రీ ఎన్నో చక్కని రచనలు చేసారు.  జయభేరి లోని  పాటలో, "శివ భక్తులలో అధికులు, అధములు అనే వ్యత్యాసం లేదు. ఈ భేదాలు మనిషి దృష్టిలో తప్ప భగవంతుని చరాచర సృష్టిలో లేవు" అని ప్రబోధించిన పరమ శివ భక్తుడు "భక్త నందనార్" హృదయ నివేదన ఈ పాట. ఈ సాహిత్యానికి పెండ్యాల గారు కట్టిన బాణీ పది కాలాలు గుర్తుంటుంది అందరికీ. అయితే అన్నిటికీ మించి ఒక భక్తుడు పొందే ఆవేదనను, ఇచ్చే సందేశాన్ని తన గాత్రంలో పై స్థాయిలో కూడా పట్టు జారకుండా  అద్భుతంగా చిరస్థాయిగా ఉండేట్లు పాడారు మన ఘంటసాల మాస్టారు. ఆయన గొంతులో తారా స్థాయిలో "పరంజ్యోతిగా వెలయించే" అన్నప్పుడు మనకు నిజంగా పరమ శివుడు ప్రత్యక్షమై ఆ భక్తుని కోరిక తీర్చాడా అన్నంత అనుభూతి, ఉద్వేగం కలుగుతాయి. తెలుగువారు చేసుకున్న పూర్వ జన్మ సుకృతం ఘంటసాల గారిని వరం గా పొందటం. ఈ పాట వీడియో, ఆడియో మరియు సాహిత్యం ఇక్కడ పొందు పరుస్తున్నాను. 



వీడియో పొందుపరచిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

                       సాకీ:  అధికులనీ అధములనీ
                            నరుని దృష్టిలోనే భేదాలు
                            శివుని దృష్టిలో అంతా సమానులే
                            ఏ.. ఏ.. ఏ.. ఏ..

                    ప.     నందుని చరితము వినుమా..
                            పరమానందము గనుమా ఆ.ఆ.ఆ
                            పరమానందము గనుమా
                            నందుని చరితము వినుమా..
                            పరమానందము గనుమా ఆ.ఆ.ఆ
                            పరమానందము గనుమా

                    చ.     ఆదనూరులో మాలవాడలో         |ఆదనూరులో|
                            పేదవాడుగా జనియించీ..
                            చిదంబరేశుని పదాంబుజములే
                            మదిలో నిలిపీ కొలిచేను
                            నందుని చరితము వినుమా..
                            పరమానందము గనుమా ఆ.ఆ.
                            పరమానందము గనుమా

                    చ.     తన యజమానుని ఆనతి వేడెను  
                            శివుని చూడగా మనసుపడీ..               |తన యజమానుని|
                            పొలాల సేద్యం ముగించి రమ్మని           |పొలాల సేద్యం|
                            గడువే విధించె యజమా..ని
                            యజమాని ఆనతిచ్చిన గడువులో
                            యే రీతి పొలము పండించుటో
                            ఎరుగక అలమటించు తన భక్తుని కార్యము
                            ఆ శివుడే నెరవేర్చే...ఏ...ఏ..
                            పరుగున పోయెను చిదంబరానికి
                            భక్తుడు నందుడు ఆత్రమున..                       |పరుగున|
                            చిదంబరంలో శివుని దర్శనం
                            చేయగరాదనె పూజారి
                            ఆశాభంగము పొందిన నందుడు
                            ఆ గుడి ముందే మూర్ఛిల్లే..
                            అంతట శివుడే అతనిని బ్రోచి
                            పరంజ్యోతిగా వెలయించే..

14, నవంబర్ 2011, సోమవారం

మధురము శివ మంత్రం మహిలో మరువక - కాళహస్తి మహత్మ్యం చిత్రం నుండి

శ్రీ కాళహస్తీశ్వరుడు 
కాళహస్తి మహాత్మ్యం చిత్రంలోని ప్రతి ఒక్క పాట, ప్రతి ఒక్క పద్యం, ఒక రస గుళిక. ఎంతో అద్భుతంగా గానం చేసి పది కాలాలు నిలిచిపోయేలా చేసారు ఘంటసాల మాస్టారు. ఈ చిత్రం లోని ఇంకొక చక్కని పాట, తోలేటి వెంకట రెడ్డి గారు రచించిన "మధురము శివ మంత్రం". ఇందులో ఘంటసాల గారు ఎన్ని గమకాలు వాడారో చెప్పనక్కరలేదు. ముఖ్యంగా ఈ పాట పల్లవిలో "ఇహ పర సాధనమే" అన్న పంక్తిని అయిదు విధాలుగా ఒక్కోసారి ఒక్కోలా ఆలపిస్తారు.  ఈ చిత్రం తెలుగులో తీసిన చిత్రం కాదు. కన్నడ మూలమైన "బేదర కన్నప్ప" ను తెలుగులోకి డబ్ చేశారు. అయినా మాస్టారి పాటలతో ఇది ఎంతో మనోరంజకంగా భాసించింది. విజయవంతమైంది.





చిత్రం:     కాళహస్తి మహాత్మ్యం (1954)
రచన:     తోలేటి వెంకట రెడ్డి 
సంగీతం: ఆర్. సుదర్శనం, ఆర్.గోవర్ధనం
గానం:     ఘంటసాల

ప.     మధురము శివమంత్రం మహిలో మరువక ఓ! మనసా!      |మధురము|
        ఇహపర సాధనమే....ఏ......ఏ.....
        ఇహపర సాధనమే..
        ఇహపర సాధనమే..
        ఇహపర సాధనమే..
        ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే                 |ఇహపర|

        ఆగమ సంచారా
        ఆగమ సంచారా, నా స్వాగతమిదె గొనుమా..                      |ఆగమ|
        భావజ సంహారా...
        భావజ సంహారా.....
        భావజ సంహారా... నా నన్ను కావగ రావయ్యా                   |భావజ|

        పాలను ముంచెదవో.. ఓ.. ఓ.. ఓ..
        పాలను ముంచెదవో, మున్నీటను ముంచెదవో..                  |పాలను|
        భారము నీదయ్యా                                                   |భారము|
        పాదము విడనయ్యా, నీ పాదము విడనయ్యా..
        జయహే సర్వేశా!
        జయహే సర్వేశా! సతి శాంభవి ప్రాణేశా!..ఆ..                      |జయహే!|
        కారుణ్య గుణసాగరా!..
        కారుణ్య గుణసాగరా!
        శ్రీకాళహస్తీశ్వరా నన్ను కాపాడవా శంకరా!
        కారుణ్య గుణసాగరా!
        శ్రీకాళహస్తీశ్వరా నన్ను కాపాడవా శంకరా!
        మధురము శివమంత్రం మహిలో మరువక ఓ! మనసా!
        ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే

13, నవంబర్ 2011, ఆదివారం

రవిశశి నయనా నమో నమో - కాళహస్తి మహాత్మ్యం నుండి

చిత్రం:     కాళహస్తి మహాత్మ్యం (1954)
రచన:     తోలేటి
సంగీతం: ఆర్. సుదర్శనం, ఆర్. గోవర్ధనం
గానం:     బృందం



                                            రవి శశి నయనా నమో! నమో!  
                                            భవభయ హరణా నమో! నమో!
                                            గౌరీ రమణా నమో! నమో! 
                                            కరుణాభరణా నమో! నమో!

                                            రవి శశి నయనా నమో! నమో! 
                                            భవభయ హరణా నమో! నమో!
                                            రవి శశి నయనా నమో! నమో! 
                                            భవభయ హరణా నమో! నమో! 


కృతజ్ఞతలు: యూ ట్యూబ్ వీడియో శ్రీ బోల్లాప్రగడ సోమేశ్వర రావు గారు.

4, నవంబర్ 2011, శుక్రవారం

పాహీ శంకరా! - కాళహస్తి మహాత్మ్యం - (పద్యాలు)

చిత్రం:      కాళహస్తి మహాత్మ్యం (1954)
రచన:      తోలేటి 
గానం:      ఘంటసాల
సంగీతం:  ఆర్.సుదర్శనం, ఆర్. గోవర్ధనం 

                                         
                         

                            పాహీ శంకరా! మాం పాహీ శంకరా!
                            దీనాళి రక్షించు దేవ దేవా!                          |దీనాళి|
                            నా గతి నీవయ్య దేవ దేవా!                         |నా గతి|
                            పాహీ శంకరా! మాం పాహీ శంకరా!

                            దేవా! దివ్య కృపాకరా భవహరా! దీనావనా శంకరా!
                            నీ వాల్లభ్య బృహంచలామృత ఝరుల్ నీ పుత్రుపై జల్లగా
                            భావాతీత మనోజ్ఞ నేత్రములు విస్ఫారించినావా ప్రభో!
                            సేవా భాగ్యము కల్గజేయుమా దయన్ శ్రీకాళహస్తీశ్వరా!
                            శ్రీకాళహస్తీశ్వరా! 

2, నవంబర్ 2011, బుధవారం

కాళహస్తి మహత్మ్యం - చేకొనవయ్య మాంసమిదె (పద్యం)


చిత్రం:         కాళహస్తి మహత్మ్యం (1954)
రచన:         తోలేటి
గానం:         ఘంటసాల
సంగీతం:      ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం 

ఆడియో మూలం: పాజక్టు ఘంటసాల
                                  చేకొనవయ్య మాంసమిదె చెల్వుగదెచ్చితి బాస జొప్పునన్
                                  ఆకొనియుంటివేమొ కడుపార బిరాన భుజించవయ్య యీ
                                  లోకులు చూడరయ్య భువిలోని క్షుదార్తుల బాధలెన్నడున్
                                  శ్రీకర కాళహస్తి శశిశేఖర దివ్య కృపాకరా హరా! హరా!
                                  ఆ..ఆ..ఆ..ఆ

31, అక్టోబర్ 2011, సోమవారం

కాళహస్తి మహాత్మ్యం - దండకం సాహిత్యంతో

గానం: ఘంటసాల
రచన: తోలేటి వెంకట రెడ్డి
సంగీతం: ఆర్.సుదర్శనం - ఆర్. గోవర్ధనం   
కార్తీక మాసం శివునికి ప్రీతికరమైన మాసం. ఘంటసాల మాస్టారు పరమ శివునిపై చాల పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడారు. ప్రతి వొక్క పాట, పద్యం రుద్రునికి సమర్పించే మాలలో రుద్రాక్షల వంటివి. కన్నడ రాజ్ కుమార్ కన్నప్ప (తిన్నడు) గా నటించిన "బేదర కన్నప్ప" ఆయన నటజీవితాన్ని మలుపు తిప్పింది. అదే చిత్రాన్ని తెలుగులో  కాళహస్తి మహత్యం (1954) గా డబ్ చేసారు. ఇందులో మాస్టారు పాడినవన్నీ ఆణిముత్యాలే. ముందుగా ఈ దండకం "జయ జయ మహాదేవ శంభో" యొక్క సాహిత్యం యిక్కడ పొందు పరుస్తున్నాను.  ముందు ముందు మరికొన్ని. ఇందులో చాల మట్టుకు పద్యాలు. అయితే ఈ పద్య రూప నిర్మాణంలో సూచనలుంటే తెలుపగలరు. 
 


ఆడియో మూలం: ప్రాజక్టు ఘంటసాల

జయ జయ మహాదేవ శంభో హరా శంకరా, 
సత్యశివసుందరా, నిత్యగంగాధరా
బ్రహ్మ విష్ణుల్, సురల్, తాపసుల్ 
నిన్ను వర్ణించలేరన్న నేనెంతవాడన్ దయాసాగరా
భీకరారణ్య మధ్యంబునన్ బోయనైపుట్టి పశుపక్షి సంతానముల్
కూల్చి భక్షించు పాపాత్ముడన్
దివ్య జపహోమ తపమంత్ర కృషిలేని జ్ఞానాంధుడన్
దేవుడేలేడు లేడంచు దూషించు దుష్టాత్ముడన్
విశ్వరూపా, మహామేరుచాపా, 
జగత్ సృష్టి, సంరక్ష, సంహార కార్యత్కలాపా
మహిన్ పంచభూతాత్మవీవే కదా దేవదేవా శివా
పృథ్వి జల వాయురాకాశ తేజో విలాసా మహేశా.. ప్రభో.....

రంగు బంగారు గంగాతరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వరా
కాశీపురాధీశ విశ్వేశ్వరా
నీలిమేఘాల కేళీ వినోదాలలో తేలు శ్రీశైలమల్లేశ్వరా..శ్రీశైలమల్లేశ్వరా..
కోటినదులందు సుస్నానముల్ చేయు ఫలమిచ్చు క్షేత్రాన వసియించు శ్రీరామలింగేశ్వరా..శ్రీరామలింగేశ్వరా
నిత్యగోదావరీ నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వరా..భీమేశ్వరా...
దివ్యఫలపుష్ప సందోహ బృందార్చితానంద భూలోకకైలాస శైలాన వసియించు శ్రీకాళహస్తీశ్వరా... శ్రీకాళహస్తీశ్వరా..
దేవదేవా...ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.
నమస్తే... నమస్తే...నమస్తే..నమః 


-----------------------------------------------------------------------
 ఈ చిత్రం యొక్క వివరాలకు క్రింది లింకులలో చూడండి.
http://ghantasalagalamrutamu.blogspot.com/2009/05/1954.html 
http://www.sakhiyaa.com/kalahasti-mahatyam-1954-%e0%b0%95%e0%b0%be%e0%b0%b3%e0%b0%b9%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/ 

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన "క" నుంచి "జ" చిత్రాలు

చి-కథానాయిక మొల్ల-1970 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్నతల్లి-1953 (2) చి-కన్నతల్లి-1972 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొండవీటి దొంగ(డ)-1958 (1) చి-కొడుకు కోడలు-1972 (1) చి-కోటీశ్వరుడు (డ)-1970 (1) చి-గంగా గౌరీ సంవాదము(డ)-1958 (1) చి-గాంధారి గర్వభంగం(డ)-1959 (2) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (4) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1)

మాస్టారు పాడిన "ట" నుంచి "న" చిత్రాలు

చి-టింగ్ రంగా-1952 (5) చి-టైగర్ రాముడు-1962 (1) చి-టౌన్‌ బస్ (డ)-1957 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తలవంచని వీరుడు(డ)-1957 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (2) చి-దశావతారములు(డ)-1962 (1) చి-దసరా బుల్లోడు-1971 (1) చి-దసరాబుల్లోడు-1971 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (6) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొంగ రాముడు-1955 (2) చి-దొంగనోట్లు (డ)-1964 (2) చి-దొరబాబు-1974 (3) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (2) చి-నిర్దోషి-1967 (1)

మాస్టారు పాడిన "ప" చిత్రాలు

చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (3) చి-పరోపకారం-1953 (3) చి-పల్నాటి యుద్ధం-1947 (4) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (3) చి-పల్లెటూరు-1952 (11) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (6) చి-పిచ్చి పుల్లయ్య-1953 (2) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెంపుడు కొడుకు-1953 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (11) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రాయశ్చిత్తం(డ)-1962 (3) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (3) చి-ప్రేమలు పెళ్ళిళ్ళు-1974 (1)

"బ, భ, మ" - చిత్రాలు

చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడిపంతులు-1972 (3) చి-బభ్రువాహన-1964 (3) చి-బలిపీఠం-1975 (1) చి-బలే బావ-1957 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (3) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (3) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (4) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భలేపాప-1971 (1) చి-భాగ్యదేవత-1959 (3) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భాగ్యవంతులు (డ)-1962 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మదన మంజరి(డ)-1961 (1) చి-మనదేశం-1949 (17) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (4) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (7) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1)

మాస్టారు పాడిన "య, ర, ల, వ" చిత్రాలు

చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (2) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (3) చి-రణభేరి-1968 (2) చి-రత్నగిరి రహస్యం (డ)-1957 (2) చి-రత్నమాల-1948 (1) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (5) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-లైలా మజ్ను-1949 (5) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాలి సుగ్రీవ-1950 (2) చి-వాల్మీకి-1963 (2) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విప్లవ స్త్రీ (డ)-1961 (1) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరఖడ్గము(డ)-1958 (1) చి-వీరాంజనేయ-1968 (2) చి-వీరాభిమన్యు-1965 (9) చి-వెలుగు నీడలు-1961 (4)

మాస్టారు పాడిన "శ,ష" చిత్రాలు

చి-శకుంతల-1966 (10) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శభాష్ సత్యం-1969 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (2) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వల్లీ కల్యాణం (డ)-1962 (1) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (3) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణతులాభారం-1966 (5) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జునయుద్ధం-1963 (1) చి-శ్రీదేవి-1970 (1) చి-శ్రీమతి-1966 (3) చి-శ్రీరామభక్త హనుమాన్ (డ)-1958 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-శ్రీశైల మహత్యం(డ)-1962 (1) చి-శ్రీసత్యనారాయణమహాత్మ్యం-1964 (6) చి-శ్రీసింహాచలక్షేత్రమహిమ-1965 (2) చి-షావుకారు-1950 (2)

సహగాయనీ గాయకులు

గా-L.R.ఈశ్వరి తో (1) గా-M.S.రామారావు-పి.సుశీల తో (1) గా-ఎ.పి.కోమల తో (4) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (7) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (142) గా-ఘంటసాల-బృందం (4) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (10) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (15) గా-పి.లీల తో (25) గా-పి.లీల-బృందం తో (1) గా-పి.సుశీల తో (77) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పి.సుశీల-వసంత తో (1) గా-పిఠాపురం తో (2) గా-బహుగళం తో (2) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (45) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (4) గా-సి.కృష్ణవేణి-బృందం తో (1) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

సం -టి.వి.రాజు (1) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1) సం-S.L.మర్చెంట్-M.Sశ్రీరామ్ (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (7) సం-ఆదినారాయణరావు (7) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (3) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎ.ఎం.రాజా (2) సం-ఎం.ఎస్.విశ్వనాథన్ (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (14) సం-ఎస్.రాజేశ్వరరావు (1) సం-ఓగిరాల (4) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (3) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (3) సం-గాలి పెంచల (7) సం-ఘంటసాల (144) సం-చక్రవర్తి (1) సం-జి.కె.వెంకటేష్ (1) సం-జె.వి.రాఘవులు (4) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (4) సం-టి.వి.రాజు (34) సం-టి.వి.రాజు-దినకరరావు (5) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-నిత్యానంద్ (3) సం-పామర్తి (6) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.ఆదినారాయణరావు (3) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (48) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (15) సం-ముగ్గురు దర్శకులు (1) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయభాస్కర్ (1) సం-విజయా కృష్ణమూర్తి (4) సం-విజయాకృష్ణమూర్తి (1) సం-విశ్వనాథన్-రామ్మూర్తి-జి.కె.వెంకటేష్ (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (4) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్-పామర్తి (1) సం-సాలూరు (49) సం-సాలూరు-గోపాలం (2) సం-సి.ఆర్.సుబ్బురామన్ (17) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (20) సం-హనుమంతరావు (2)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (16) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (28) ర-ఆరుద్ర (48) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొనకళ్ళ (1) ర-కొసరాజు (20) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (4) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-డా. సినారె (1) ర-డా.సినారె (7) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (15) ర-తిక్కన (3) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (12) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (5) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (45) ర-బమ్మెఱ పోతన (3) ర-బలిజేపల్లి (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (6) ర-బైరాగి (1) ర-భక్త నరసింహ మెహతా (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (9) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (3) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (5) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (34) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సదాశివబ్రహ్మం (4) ర-సముద్రాల జూ. (25) ర-సముద్రాల సీ. (79) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (8) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (1) రచన-బలిజేపల్లి (1)