1973 సంవత్సరంలో విడుదలైన అంజలీ పిక్చర్స్ కంబైన్స్ సంస్థ నిర్మించిన భక్త తుకారాం చిత్రం నుండి ఘంటసాల మాస్టారు పాడిన "బలే బలే అందాలు " అనే ఈ ఏకగళం రచన వీటూరి, స్వరపరచినది పి.ఆదినారాయణరావు. ఈ చిత్రంలో తారాగణం అక్కినేని, అంజలీదేవి, కాంచన, నాగభూషణం, శివాజీ గణేశన్. ఈ చిత్రానికి నిర్మాత పి.ఆదినారాయణరావు మరియు దర్శకుడు వి.మధుసూదనరావు.
Video is a courtesy of Sri Ravi Shankar Mitta garu.
#000 | పాట: | బలే బలే అందాలు సృష్టించావు |
---|---|---|
చిత్రం: | భక్త తుకారాం (1973) | |
రచన: | వీటూరి | |
సంగీతం: | పి.ఆదినారాయణ రావు | |
గానం: | ఘంటసాల | |
సాకీ: | ఆ... నందన వనముగ ఈ లోకమునే సృష్టించిన ఓ... వనమాలి | |
మరచితివో మానవజాతిని దయమాలి.. | ||
ప: | బలే బలే అందాలు సృష్టించావు... ఇలా మురిపించావు | |
అదే ఆనందం అదే అనుబంధం... ప్రభో మాకేల ఈయవు | ||
బలే బలే అందాలు సృష్టించావు... | ||
చ: | మాటలు రాని మృగాలు సైతం.. మంచిగ కలసి జీవించేను | |
మాటలు నేర్చిన మా నరజాతి.. మారణహోమం సాగించేను | ||
మనిషే పెరిగి మనసే తరిగి.. -2 | ||
మమతే మరచాడు మానవుడు, నీవేల మార్చవు? | ||
బలే బలే అందాలు సృష్టించావు... ఇలా మురిపించావు | ||
అదే ఆనందం అదే అనుబంధం... ప్రభో మాకేల ఈయవు | ||
బలే బలే అందాలు సృష్టించావు.. | ||
చ: | ఆ...ఆ... ఆ... ఆ...ఆ..ఆ...ఆ... ఆ... ఆ...ఆ.. | |
చల్లగ సాగే సెలయేటి ఓలే.. మనసే నిర్మలమై వికసించాలి | ||
గుంపుగ ఎగిరే గువ్వల ఓలే.. అందరు ఒక్కటై నివసించాలి | ||
స్వార్ధం మానుకొని సమతే పెంచుకొని -2 | ||
మంచిగ మానవుడే మాధవుడై, మహిలోన నిలవాలి | ||
బలే బలే అందాలు సృష్టించావు.. ఇలా మురిపించావు | ||
అదే ఆనందం అదే అనుబంధం.. ప్రభో మాకేల ఈయవు | ||
బలే బలే అందాలు సృష్టించావు.. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి