నేడు ఎన్.టి.ఆర్. 93వ జయంతి |
వేములపల్లి శ్రీకృష్ణ |
చిత్రం: | పల్లెటూరు (1952) | ||
రచన: | వేములపల్లి శ్రీకృష్ణ | ||
సంగీతం: | ఘంటసాల | ||
గానం: | ఘంటసాల, బృందం | ||
పల్లవి: | ఘంటసాల: | చేయెత్తి జైకొట్టు తెలుగోడా! | |
గతమెంతో ఘనకీర్తి గలవోడా! | |||
చరణం: | ఘంటసాల: | వీర రక్తపుధార, వారవోసిన సీమ -2 | |
పలనాడు నీదెరా, వెలనాడు నీదెరా ఆ.. -2 | |||
బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ | |||
తాండ్ర పాపయ గూడ నీవోడోయ్ | |||
చరణం: | నాయకి నాగమ్మ, మల్లమాంబా, మొల్ల -2 | ||
మగువ మాంచాల నీతోడ బుట్టినవోళ్ళే -2 | |||
వీరవనితలగన్న తల్లేరా! | |||
ధీరమాతల జన్మభూమేరా! | |||
చరణం: | ఘంటసాల: | కల్లోల గౌతమీ | |
బృందం: | ఆ..ఆ.. | ||
ఘంటసాల: | వెల్లువల కృష్ణమ్మ | ||
బృందం: | ఆ..ఆ.. | ||
కల్లోల గౌతమీ, వెల్లువల కృష్ణమ్మ | |||
తుంగభద్రా తల్లి, పొంగి బారిన చాలు -2 | |||
ధాన్యరాశులె పండు దేశానా! | |||
కూడు గుడ్డకు కొదువ లేదోయీ | |||
చరణం: | ముక్కోటి బలగమోయ్, ఒక్కటై మనముంటే..ఏ.. | ||
ఇరుగు పొరుగులోన, వూరు పేరుంటాది -2 | |||
తల్లి ఒక్కతే నీకు తెలుగోడా! | |||
సవతి బిడ్డల పోరు మనకేలా! | |||
చరణం: | ఘంటసాల: | పెనుగాలి వీచింది | |
బృందం: | ఆ..ఆ.. | ||
ఘంటసాల: | అణగారి పోయింది | ||
బృందం: | ఆ..ఆ.. | ||
ఘంటసాల: | పెనుగాలి వీచింది – అణగారి పోయింది | ||
నట్టనడి సంద్రాన – నావ నిలుచుండాది -2 | |||
చుక్కాని పట్టరా తెలుగోడా!..ఆ.. | |||
నావ దరిజేర్చరా – మొనగాడా! | |||
బృందం: | చేయెత్తి జైకొట్టు తెలుగోడా! | ||
గతమెంతో ఘనకీర్తి గలవోడా! | |||
గతమెంతో ఘనకీర్తి గలవోడా!..ఆ. | |||
Very rich information and very good song
రిప్లయితొలగించండిదివ్య రత్నాన్ని తెలుగుజాతి కోసం ఇలా జాగ్రత్త చేసిన మీకు శతనమస్సులు.
రిప్లయితొలగించండి