సనకసనందనాదుల శాపవశాన వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులు విష్ణుద్వేషులుగా మూడు జన్మలెత్తుతారు. అందులో మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను రాక్షస సోదరులుగా పుడతారు. లోకకంటకులైన వీరిలో హిరణ్యాక్షుని మహావిష్ణువు తన మూడవ అవతారమైన వరాహరూపం దాల్చి వధిస్తాడు. పిదప అతని సోదరుడైన హిరణ్యకశిపుని నాలుగవ అవతారంలో ఉగ్రరూపియైన నరసింహావతారుడై హరి సంహరిస్తాడు. అనంతరం విష్ణుపత్ని వినతితో తన ఉగ్రత్వం ఉపసంహరించుకుని ఆ నరమృగశరీరుడు లక్ష్మీనరసింహుడౌతాడు. ఆపై హిరణ్యకశిపుని పుత్రుడు మరియు విష్ణుభక్తుడైన ప్రహ్లాదుని ప్రశంశాస్తోత్రాలతో శాంతించిన శౌరి వరాహ, నారసింహ ద్వైతరూపుడై లక్ష్మీ సమేతంగా శ్రీలక్ష్మీవరాహనరసింహుడై సింహాద్రి కొండపై వెలిసాడు. ఈ సింహాచలము మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది.
ఈ క్షేత్రం విశాఖపట్టణానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ స్వామిని సింహాద్రి అప్పన్న అనే పేరుతో పిలుస్తారు. స్వామి విగ్రహం ఎల్లప్పుడు చందనంతో కప్పబడి వుంటుంది. అయితే సంవత్సరంలో ఒక్క రోజు, అదే వైశాఖ శుద్ధ తదియనాడు చందనం ఒలవడం వలన స్వామి నిజరూపదర్శనం కలుగుతుంది. అది కేవలం 12 గంటలు మాత్రమే వుంటుంది. ఈ కార్యక్రమాన్ని 'చందనోత్సవం' అంటారు.
ఆడియో మూలం: ఘంటసాల గాన చరిత
చిత్రం: | శ్రీ సింహాచలక్షేత్ర మహిమ (1965) | |
సంగీతం: | టి. వి. రాజు | |
రచన: | రాజశ్రీ | |
గానం: | ఘంటసాల, బృందం |
పల్లవి: | ఘంటసాల: | సింహాచలము మహాపుణ్యక్షేత్రము | ||
బృందం | సింహాచలము మహాపుణ్యక్షేత్రము | |||
శ్రీ వరాహనరసింహుని దివ్యధామము | ||||
బృందం | సింహాచలము మహాపుణ్యక్షేత్రము | |||
చరణం: | ఘంటసాల: | ప్రహ్లాదుడు వేడగా, శ్రీహరి కరుణించగా - 2 | ||
ద్వయరూపాలొకటిగా…ఆ..ఆ.. | ||||
ద్వయరూపాలొకటిగా, యుగయుగాల గుఱుతుగా | ||||
ఆశ్రితులను కావగా, వెలసిన హరినిలయము | ||||
బృందం | సింహాచలము మహాపుణ్యక్షేత్రము | |||
చరణం: | ఘంటసాల: | ఏనోటను విన్నా హరినామస్మరణమే..ఏ..ఏ.. | ||
హరిహరిన్నారాయణా ఆ.. ఆదినారాయణా.ఆ.. | ||||
కరుణించి మమ్మేలు కమలలోచనుడా | ||||
బృందం | హరిహరి నారాయణా ఆదినారాయణా | |||
కరుణించి మమ్మేలు కమలలోచనుడా | | హరిహరి | | |||
ఘంటసాల: | ఏ చోటను కాన్నా భక్తుల సందోహమే | |||
ఏ నోటను విన్నా హరినామస్మరణమే | ||||
పాపాలను హరియించే దైవ సన్నిధానము | ||||
బృందం | సింహాచలము మహాపుణ్యక్షేత్రము | |||
చరణం: | ఘంటసాల: | మ్రొక్కులను, ముడుపులను చెల్లించేవారికి | ||
నీవే దిక్కని నమ్మీ కొలిచేటి వారికి | ||||
ఇహపరములు సమకూర్చే భగవానుని నిలయమూ | ||||
బృందం | సింహాచలము మహాపుణ్యక్షేత్రము | |||
శ్రీ వరాహనరసింహుని దివ్యధామము | ||||
సింహాచలము మహాపుణ్యక్షేత్రము | ||||
మహాపుణ్యక్షేత్రము, మహాపుణ్యక్షేత్రము |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి