20, మార్చి 2015, శుక్రవారం

ఘంటసాల కంఠశ్రీ మంటపంలో నర్తించిన రాగేశ్రీ

రాగాల సరాగాలు మనసును పరవశింపచేస్తూ ఎదను ఆనంద డోలికలలో ఊపుతుంటే, ఊయలలూగీ ఆ హృదయం తీయని పాట పాడుతుంది. ఆ రాగశాలను ప్రతి యింట వినిపించే గాత్రం ఘంటసాల. పటువు గల బాణీలకు తన వాణిని జోడించి సుమధురంగా గాయనము చేసే ఆయన చలనచిత్ర నేపథ్యగానపు సంగీత నిఘంటువు. బడే గులాం ఆలీ ఖాన్‌ సాంగత్యంతో హిందుస్తానీ సంగీతపు పోకడలను, పకడ్ లను అవగాహన చేసుకుని ఆ రాగాలను పకడ్బందీగా తన సంగీతంలో నింపిన మహా మేధావి. ఇదివరలో మన రాగశాల లో హిందోళం, ఆరభి, సామ, శుద్ధ సావేరి, సింహేంద్ర మధ్యమం, నాటక ప్రియ, మలయ మారుతం, షణ్ముఖప్రియ, హంసానంది, ఫరజు, దేశ్, పటదీప్, బేహాగ్ వంటి రాగాల గురించి తెలుసుకున్నాము. ఈ రోజు హిందుస్తానీ రాగాలలో రాణియనదగ్గ రాగం రాగేశ్రీ (రాగేశ్వరి) గురించి మిత్రులు చంద్ర మౌళి గారి వ్యాసంలో తెలుసుకుందాం. ఇక ఆలస్యం దేనికి? అడుగిడదామా రాగశాల లోనికి.


మాటలలోని  శబ్దాలు  అర్థాన్ని సూచిస్తే, ఆ పదాలు పలుకబడే ధ్వనిస్థాయి, ఆ స్వనము, భావాన్ని, ఉద్దేశిత అర్థాన్ని వెల్లడిస్తుంది.  మాటల వెనుకటి భావనను తెలిపేది, ఆ మాటలను పలికే తీరు. అలాగే సినిమా సాహిత్యం అందించాలనుకొన్న భావానికి ప్రాణంపోసేది సంగీతం. అది జీవించేది అభినయంలో. పాటయొక్క పల్లవి "ఇది నా చెలి ఇది నా సఖి" అనే పదాలకు నేపథ్యగాయకుడు ప్రాణాన్నిపోస్తే నటుడు దాన్ని జీవించి చూపినప్పుడే ఆ పాటకు సార్థకత కలుగుతుంది. తుదకు ప్రేక్షకుల పెదవులపైన నిలిచేది ఆ పాటల పదాల నాదరూపమే. ఎలా ట్యూన్ చేస్తే, ఏ ధాటిలో పాడితే అది జనరంజకమై నాలుగు కాలాలపాటు నిలుస్తుంది అనేదే అప్పటి సంగీతదర్శకుల తపన. ప్రజారంజనమే ప్రముఖమై, వీనుల విందుగా, క్రొత్తగా ఉండుటకు రాగస్వరూపం వ్యాకోచింపబడి, అన్యస్వరాలను చేర్చటమూ, రాగాలను కలిపి ఏదో నవీనంగా ఒక పాట వరసను కూర్చడం ఇలాంటివి ఒక పాటకు  బాణీకట్టే ప్రక్రియలో జరుగేవి. అన్యస్వరాల మిశ్రణమునకు కర్ణాటక సంగీతంకన్నా హిందూస్థాని సంప్రదాయంలో అవకాశం ఎక్కువ. అందులోనూ లలిత సంగీతానికి ఉత్తరాది పద్ధతి సానుకూలమైనది. బహుశ ఘంటసాలకు 1948లో కలిగిన బడేగులాం ఆలీఖాన్ సాహచర్యం, ఎన్నో హిందూస్థానీ రాగాలను ఆకళింపు చేసుకుని కొత్త బాణీల సృష్టిక్రియకు తొడ్పడియుండవచ్చు. "రాగేశ్రీ" రాగాన్ని ఆయన ప్రత్యేకించి ఉపయోగించడం వెనుక  బడేగులాం ఆలీఖాన్ తో కలిగిన సాంగత్యం కారణమని అంటారు. బడేగులాం ఆలీఖాన్ మద్రాసుకి వచ్చి ఎన్నో సభలలో చేసిన కఛేరీలు వినిన ఘంటసాల, ఆయనకు వీరాభిమానియయ్యారు. తన ఇంట్లో బృందంతో బడేగులాం ఆలీఖాన్ కొన్నిరోజులు ఉండగా ఆ నివాసం ఒక సంగీత క్షేత్రంగా మారిన విశేషాలను ఘంటసాల భార్య శ్రీమతి సావిత్రమ్మగారు అక్షరబద్ధంచేశారు.

గాత్రసంగీతంలో ధ్వని ప్రధానమైనది. మాధుర్యము, శ్రావ్యత, పటుత్వం, స్థిరత్వం, త్రిస్థాయి సంచార శక్తి ఇవన్నీ ఒకే కంఠలో ఉంటే వినడానికి హాయి. ఆ స్వరాల సుస్పష్టత మీ కంఠంలో ఎలా వచ్చింది మాస్టారూ అని అడిగితే ఆయన "అది భగవంతుని కృప బాబు" అనేవారట. మధురమైన గాత్రము, బుద్ధి-హృదయాలను కలిపి ఒక అలౌకిక అనుభవాన్ని కలిగిస్తుంది. నాదబ్రహ్మమనగా ఆ అనుభవమే. ఘంటసాల సంగీతసాధన చేసేరోజుల్లో తన గురువు బోధించిన "సాంబసదాశివ - సాంబసదాశివ" మంత్రాన్ని నాదోపాసన చేసేవారని ఒక సందర్శనంలో ఆయనే వెల్లడించారు. ఆయన కంఠమాధుర్యానికి దైవానుగ్రహంతో పాటు సాధనకూడా చేరి అనితరసాధ్యమైన ఆ గాత్రసంస్కరణ ఏర్పడిందేమో!

అప్పటికే కర్ణాటక  శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించి అందులోని లోతులను అవగాహన చేసుకొన్న ఘంటసాలకు హిందూస్థాని సంగీతపు అంతర్గత మర్మాలను ఆ ప్రఖ్యాత విద్వాంసుని ద్వారా సన్నిహింతంగా తెలుసుకొనే అవకాశంతో సరికొత్త పద్ధతులూ రాగరహ్యసాలూ ఆయనకు తన నాదలోకంలో స్ఫురించియుండవచ్చు.  సంగీత దర్శకునిగా తను చేసే ప్రయోగాల తీరుని మార్చి, లాలిత్యానికి, మాధుర్యానికి కొత్త రాగాలతో బాణీలను కట్టడం సంభవమై, ఈనాడు ఆ పాటలకు చిరంజీవత్వం వాటిల్లింది.  యమన్, జయజవంతి, మార్వా, భీమ్ పలాస్, పహాడి, పీలు, భూప్, మాల్కోంస్, మారుబేహాగ్ లాంటి హిందూస్థాని రాగాలు సమకాలీనులైన రత్నత్రయంలొ (సాలూరి, పెండ్యాల మరియు ఘంటసాల) వాడుకలోనున్ననూ, రాగేశ్రీ రాగం సంగతి వేరు. రాగేశ్రీ రాగాన్ని పునరావిష్కరించి సరికొత్తరూపాలతో ప్రయోగించిన ఖ్యాతి ఘంటసాలకే చెల్లు. వాణిజ్య వ్యవహార ప్రధానమైన సినీక్షేత్రంలో సంగీతం పట్ల ఇంతటి అంకితభావం, స్వోపజ్ఞత, సతత నూతన నాద మాధుర్యాన్వేషణ, ఘంటసాలలాంటి గాన గంధర్వునికే సాధ్యం. "భావ తీవ్రత, ఆర్ద్రత లేని హృదయంనుండి ఉత్తమమైన కళ వ్యక్తమయ్యే అవకాశం లేదు. అందుచేత కళాకారుడు కళాసాధనతో తుల్యంగా జీవిత అనుభావాలనుండి ఉన్నతమైన హృదయ సంస్కారాన్ని కలిగించుకోవలసి ఉంది"  ఈ మాట చెప్పింది వేరెవరో కాదు. స్వయంగా ఘంటసాల వెలుబరచిన అభిప్రాయం.

రాగేశ్రీ  ఆరోహణంలో 'n-S-G-m-D-n-S' మరియు అవరోహణంలో  S'-n-D-m-G-R-S స్వరాలమీద నడుస్తుంది. హిందూస్థాని సంగీత పద్ధతిలో ఖమాజ్ థాట్ దీని పుట్టినిల్లు. థాట్ అనగా ఈ జనకరాగంలోని ముఖ్య జన్యరాగాలన్నిటిని ఘంటసాల గళం పలికింది (రాగేశ్రీ, జంజూటి, దేశ్, తిలక్ కామోద్, జైజవంతి). ఖమాజ్ థాట్ మేళం, కర్ణాటక మేళమైన హరికాంభోజికి సమానము. రాగేశ్రీ రాగముయొక్క  మూర్ఛన, హిందూస్థాని పద్ధతిలో ఇలా ఉంటుంది.: "స-గా3-మ1-దా2-నీ2-సా" "స-నీ2-దా2-మ2-గా3-మ1-గ3-రి2-స-ని2-దా2-ని2-స". కొంతవరకు నాటకురంజి రాగానికి రాగేశ్రీ దగ్గరగా ఉంటుంది. ఈ ఔడవ షాడవ రాగంలో గాంధార -నిషాదాలు వాది-సంవాది స్వరాలు (మధ్యమ - షడ్జ స్వరాలు అనియూ వాదన కలదు). పకడ్ (అంటే స్వరసంచార విన్యాసం): రిసా, నిదనిసమగా, మదనిదా, గమదనిసా - సానిదామగారీస; మరి కొన్ని రాగేశ్రీ వరసలు: , దా నీ సగ, గమ, మగరి, , గమదనిద, నిదగమ, సానిద, , గమగరిస, గమదనిస, దనిసాగా, గా మా(గ)రి, .  ఈ స్వరాల యోజన, రాగేశ్వరిని (రాగ - ఈశ్వరి) రాగాలకు రాణినిజేసి ప్రణయగీతాలకు ప్రణవనాదత్వం సిద్ధించింది. కోమల గాంధారస్వర ప్రయోగంతో(G2 సాధారణ) రాగేశ్రీ రాగం బాగేశ్రీగా మారిపోతుంది. అన్యస్వరస్పర్శతోనే అపురూపమైన బాణీలను సృష్టించే సినిమా సంగీతంలో "ఈ పాట ఖఛ్ఛితంగా ఇలాంటి రాగనిబద్ధమని" ఎప్పుడూ అనలేము. ఘంటసాల ఎన్నో చోట్ల రాగేశ్రీలో లేని పంచమాన్ని ప్రయోగించి సరిక్రొత్త బాణీలను కట్టారు.

ప్రథమంగా రాగేశ్రీ రాగాన్ని తెలుగు సినిమాలలో వినిపించినది ఘంటసాల అనవచ్చు. స్వీయ సంగీత దర్శకత్వంవహించిన చిత్రాలలొ రాగేశ్రీ విహారం వినిపిస్తుంది. ఈ రాగం ఆయనకు చాలా ప్రియమైనదిగా మనకు తెలుస్తుంది. ఆయన గాయన ప్రతిభ అత్యున్నత స్థాయిలో వెలిగిన రెండు దశాబ్దాలలో (1950-1970) ఘంటసాల రాగేశ్రీ రాగాధారితమైన ఎన్నో బాణీలను కట్టారు. "పాతాళ భైరవి" నుండి "రహస్యం" వరకు ఆయన సంగీత దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలలో రాగేశ్రీరాగం చోటుచేసుకొంది. ఘంటసాల సంగీత దర్శకత్వం నిర్వహించిన చిత్రాలలో వినబడే రాగేశ్రీ వైఖరిని గమనిస్తే, ఈ రాగం ఆధారంగా చేసుకొని ఆయన ఎన్నో ప్రయోగాలను చేసినట్టు తెలుస్తుంది. "ఎంతఘాటు ప్రేమయో" (1951 - పాతాళభైరవి), "ఇది నాచెలి" (1953 - చంద్రహారం), "అన్నానా భామిని" (1957 - సారంగధర)"చమకు చమకు తార" (1959 - పెళ్ళిసందడి), "ఊయలలూగీ నా హృదయం" (1960 - అభిమానం), "ఈ మరపేల ఈ వెరపేల" (1960- భక్త రఘునాథ్) "రాగాలా సరాగాల" (1960 - శాంతినివాసం), "మగరాయా" (1967 - రహస్యం)

రాగేశ్రీ రాగాధారితమై ఆయన ప్రథమంగా బాణీ కట్టిన పాట "ఎంత ఘాటు ప్రేమయో".  ఎంతఘాటు (దనిసగగగ) ప్రేమయో (గమపామగా) అన్నపుడు, ఈ జాబిలి (పమగమమమ) మరికొన్నిచోట్ల రాగేశ్రీ రాగంలోలేని పంచమాన్ని ప్రయోగించారు. ఈ అన్యస్వర ప్రయోగమే పాటకు ఒక క్రొత్తదనాన్ని ప్రసాదించి ప్రఖ్యాతిని తెచ్చింది. ఒక భావం మనసులో ఎగసి నిలువడానికై ఇలాంటి అన్యస్వర ప్రవేశ ప్రక్రియను ఘంటసాల ఎన్నో సందర్భాల్లో చేశారు. ఉదాహరణకు, లవకుశలోని "సందేహించకు మమ్మా" పాటలో "రఘుకులేశుడే ధర్మము వీడి" అనునపుడు మమమమామమ గగమమగరిస" అంటూ స్వరకల్పనచేసి హిందోళంలో లేని రిషభ స్వరాన్ని తెచ్చి, "ధర్మము వీడి" అంటే ధర్మాన్ని వర్జించుటగాని జరిగితే, అనే అసంభావ్యాన్ని అన్యస్వరప్రయోగంతో చేసి చూపించే ప్రతిభ ఆయనకే చెల్లు. ఇక వినండి రాగేశ్రీ స్వరవిహారంలో మాస్టారి గేయ గాయన విలాసం.

ఎంతఘాటు ప్రేమయో - పాతాళ భైరవి 
పమగరిసనీ..
దనిసగగ గమపామగ గమపనిప గమపామ గమపమగరి  నిరిసనిదా.
ఈ జాబిలి..
పమగమమమ పదమపపప గమపదదా నిసదనిపదా
గగమపసస పదదపమమ గగమగరిసా రిగరిసనిదా..
మూర్చన: దనిసగమదనిస సనిదపమగరిస

రెండేళ్ళ తరవాత ఈరాగంలోనే బాణీ కట్టినా, "ఇదినాచెలి" పాట "ఎంతఘాటు ప్రేమయో"లా వినిపించదు. ఇక్కడ "దనిసగగగ గమపామగా" స్వరాలలో "దనిస" మంద్రలోఉంటే, ఇది నా చెలి (గమదనిసానిద) గాంధారాదిగా పై షడ్జం తాకి ధైవతంలో నిలుస్తుంది. రెండు పాటలను విభిన్న  సందర్భములకు అన్వయించేలా, ఒకటి మంద్రలోనూ మరొకటి మధ్యమస్థాయిలోనూ మొదలయ్యే విధంగా స్వరాలు అమర్చబడ్డాయి.  "ఇదినా చెలి" పాటలో అన్యస్వరాలు అంతగా వినిపించవు.

ఇదినాచెలి ఇదినాచెలి
గమదానిసా సరినినాదనీ నిసదనిమదా నీసానిదమా గాపాగరిసా దనిసగమపా (వాద్యం)
గమదనిసానిద  గమరిగమారిస సరిసదానిగా...గమదమగ రిగమరిస.
మనసులోని మమతలన్ని కనులముందు నిలచినటుల
దదదనిద మమదగగమ    సగమదాద     దససససస
వన్నెలతో
దనిసగమగస నీసనిదా గమదసనిద గమాగారిస
సనిసా రిగరిసనీ దనిసా నిపమా గమపాగరిస
ఇది నా చెలి - చంద్రహారం

అన్నానా భామిని
సాగరిమమగగా సారీనిదా దపదసా...అనంతరం రాగశ్రీ "అన్నానా భామిని" లో సరికొత్త రూపం దాల్చింది. దాటువరస, జంటవరసల క్రమంలో మొదలై మంద్ర ధైవత గమకంతో పల్లవి కూర్చబడింది.
అన్నానా భామిని - సారంగధర

రాగాలా సరాగాల
1960 లో శాంతినివాసం చిత్రానికై ఘంటసాల బాణికట్టిన "రాగాలా సరాగాలా", సాంఘికానికి సహజంగా, స్వరాలకు లాలిత్యం తోడై యుగళగీతాలకు అగత్యమైన లఘునృత్యపు అడుగుల లయానికి దీటుగా తయారయ్యింది. "సవాల్ జవాబ్" రూపంలో స్వరఖండికలను పటలాలుగా మలిచి మొదలైయ్యే ఈ పాట జనాదరణీయమయింది.
మాదాసా దసానిపమా | గాపానీ పనీపమగా | సాగామాపగమా దనిసానిదమా
రాగాలా సరాగాల - శాంతినివాసం
 
మగరాయా
"రహస్యం" చిత్రంలో ని " మగరాయా" పాటకు రాగేశ్రీని సుశాస్త్రీయంగా ఉపయోగీంచారు ఘంటాసాల. రాగేశ్రీ రాగసిద్ధి, పరిణత, ప్రతిభాలక్షణాలన్నీ అభివ్యక్తమయ్యే అంశాన్ని ఈ పాటలో మనం గమనించవచ్చు. పాట మధ్యన అకారాలూ, గమకాలూ, స్వరప్రస్తారాలు, నేపథ్యంలోని వాయిద్యవరసల సంయోజనము ఇవన్నిటిని  ఘంటసాల ఎంతో దీక్షతో సరిదిద్ది, మరెప్పుడూ వినని సరికొత్త బాణీని సృష్టించారు.

మగరాయా, వలరాయా ఈ వయ్యారి  నీ సొమ్మురా....
దనిరిససా, దనిగరిరీ గమ సనిసనిద  మారినిసా రినిరిసనిదా
వాద్యం interlude :
నిసనిదమగరిసనీని | దనిదమగరిసనిదాద |
దదపమ రీరి నినిదమ గాగ రిరిసనిదా
గమదనిస దనిసాసానిదమా| గమదనిస దనిసాసానిదమా |గమదనిసా దనిసాసా గమదనిసా (అకారం: ఘంటసాల)
చిక్కని వెన్నెల చిందే  వేళ (సనిసనిదదద దనిపమ పమమ)
అందని అందాలు అందేవేళా (గమరిస నిసనిదని రిససా పమమా నిదదా నిసనిదా)
మనసే మల్లెల్ల పానుపు వేయ (దనిసగ రిసనిని నిసనిస నిదమమ నిదనిద)
ఆ. సా..నిదమ నిదనీ దమగా ససగగమమదద సా నిసమగసనిదా...
సగమదనిస మరిసనిదనిసా గమదనిసా గమదనిసా  (ఘం)
మగరాయా - రహస్య


తాళలేరా మదనా
రాగమాలికలకు ఎన్నో నిదర్శనాలున్నా, పాండవవనవాసము చిత్రంలోని" ఓ వన్నెకాడ" నృత్యగీతం యొక్క చరణం "తాళలేరా" రాగేశ్రీ నిబద్ధము.
తాళలేరా మదనా ...
దనిసానిదమగరి నిససనిదా, దనిసాగా, గమదానీ, దససాగా..సనిదని
తాళలేరా మదనా - పాండవ వనవాసము (జానకి)

రాగేశ్రీ రాగాధారితమైన మరికొన్ని పాటలు

ఈ మరపేల
చిత్రం: భక్తరఘునాథ్, పాట: ఈ మరపేల రచన: సముద్రాల
బాగేశ్రీ ఛాయలతో పి.లీల రాగాలాపన సాగుతూ మొదలయ్యె పాటలో అక్కడక్కడ రాగశ్రీ రాగం మెరుపులను కనవచ్చు.
ఈ మరపేల - భక్త రఘునాథ్ (పి.లీల)
ఊయలలూగీ
చిత్రం: అభిమానం  పాట: ఊయలలూగీ, రచన: శ్రీ శ్రీ
అచ్చంగా రంగళించుకొన్న రాగేశ్రీ రాగమే వినబడుతుంది. సస మగ గమపమరిస నిసదనిసా...
ఊయలలూగీ - అభిమానం


ఇవిగాక, రాగేశ్రీ రాగం నేపథ్యసంగీతంలోనూ, రాగమాలికలలోనూ ఘంటసాలచే ఎన్నో చిత్రాలలో ప్రయోగించబడింది. ఘంటసాల స్వరసంయోజించిన / పాడిన ఇంకా ఎన్నో పాటలు నేను గమనించకో, లేక నా స్మరణలో లేకనో పేర్కొనలేక ఉండవచ్చు. సహృదయులు తెలిపితే ఉత్తరోత్తరంగా ఈ వ్యాసంలో ఆ వివరాలను ఈ బ్లాగు అధినేత, శ్రీ సూర్యంగారు ఎప్పటికప్పుడు సరిజేర్చగలరు. సమకాలీనులైన సంగీతదర్శకులు సైతమూ ఈ రాగ ఛాయను అందుకొని బాణీలను కట్టారు. ఉదాహరణకు: "నీ నీడలోన" (సువర్ణ సుందరి), "ఆడేపాడే పసివాడ" (పెళ్ళికానుక), సిగలోకి విరులిచ్చి (సుమంగళి), "కన్నుల్లో నీ బొమ్మ చూడు" పాటలో 'పున్నమ వన్నెలలో" అనే చరణం (విమల), మరియు "మందర మాటలు విని మౌడ్యమ్మున కైకేయి" (కలసివుంటే కలదు సుఖం).
చమక్ చమక్ తార - పెళ్ళి సందడి
 
మనవిసేయవే - రేచుక్క- పగటిచుక్క

యెనధారియర్ వనితామణి (తమిళం)



బడేగులాం సాహిబ్ మరియు తదితర గాయకులు ఆలపించిన రాగేశ్రీ రాగనిబద్ధమైన పాటలను ఇక్కడ వినగలరు.


లతా మంగేష్కర్ - "మానేనా", సంగీతం:మదన్‌ మోహన్‌, చిత్రం: జాగిర్ 
 (1959)


బడే గులాం ఆలీ ఖాం సాహిబ్ 
మాధుర్యంతో గాంభీర్యాన్ని పెనవేసి, సాహిత్య భావ క్షీరాన్ని స్వరమధువులో కలిపితే అదే ఘంటసాల ముద్ర. కవిభావానికి దీటైన శ్రుతి - వీనుల విందుగా పొదిగిన స్వరగతి - ఆయన గొంతులో సరసాలాడే నియతిని నెమరు వేసుకొంటూ మరొక్క రాగంతో మళ్ళీ కలుద్దాము. 
అందరికి మన్మథనామ ఉగాది శుభాకాంక్షలు.

10 కామెంట్‌లు:

  1. బంగారం రంగు నచ్చని వారు ఉండరు. అలాంటి బంగారానికి సువాసన ఉంటే ఇంకా బాగుంటుంది, సరే దానికి రుచి కూడా ఉంటే చెప్పక్కర్లేదు అద్భుతంగా ఉంటుంది. రంగూ, సువాసనా, రుచీ గల బంగారం లాంటి పాటలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి.పాట రచన రంగు లాంటిది (రచయిత) , దానికి సువాసన అద్దేవాడు సంగీత దర్శకుడు , ఇంకా ఆ పాటకు రుచి కలిగించేది గాయకులు.
    రాగేశ్రి \ భాగేశ్రి పై మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  2. చంద్రమౌళి గారు & సూర్యనారాయణ గారు, చక్కటి వ్యాసానికి ధన్యవాదాలు.

    భగవద్గీతలోని ’విద్యా వినయ సంపన్నే’, ’శక్నోతీహైవ యస్సోఢుం’, ’పుణ్యో గన్ధః పృధివ్యాం’, ’దైవీ హ్యేషా గుణమయీ’ మరియు ’చతుర్విధా భజన్తే మాం’ శ్లోకాలు కూడ రాగేశ్రీలోనే చేసారని సంగీతరావుగారు చెప్పగా విన్నాను. వీటిలో 3వ, 5వ శ్లోకాలలో కొన్ని అన్యస్వరాలు వాడేరని కూడా ఆయన చెప్పారు. మీరేమంటారు?

    ఒక చిన్న సవరింపు, ’మనవి సేయవే’ అనే పాట ’రేచుక్క పగటి చుక్క (1959) లోనిది, ’రేచుక్క (1955)’ లోనిది కాదు.

    రామ ప్రసాద్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. thanks for reminding these slokas. Like in most other songs, ghantasala seems to have used panchamam in them.

      తొలగించండి
    2. రామ ప్రసాద్ గారు, మీ సూచనకు ధన్యవాదములు. పొరపాటు సవరించాను.

      తొలగించండి
    3. శ్రీ ప్రసాద్ గారు,

      మీరన్నది తథ్యం. రాగశాల ప్రతివ్యాసంలోనూ ఆయారాగనిభద్ధ మైన పద్యాలు/శ్లోకాలను గుర్తించే యత్నం చేస్తున్నాం. మన్మథ నామ సంవత్సరం మాయ ఏమోగాని ఆ విషయం మరిచిపోయాను. ప్రముఖంగా మీరు పేర్కొన్న భగవద్గీత శ్లోకాలన్నిటికి, ఘంటసాలకు అతిప్రియమైన రాగేశ్రీ రాగమే ఆధారం. శ్రీయుతులు సంగీతరావుగారు లాంటి విద్వాంసులు, మాస్టారి నికటవర్తి ఈ విషయాన్ని చెప్పియుంటె దానికంటే నిదర్శనమేమున్నది. ఆయన భగవద్గీత శ్లోకాలగురించి చెప్పారని ఎక్కడో చదివాను. ఆయన మాటలను వినే అవకాశం కలుగలేదు. ఈ విషయాన్ని గుర్తించి తెలుపిన మీకు చాలా కృతజ్ఞుణ్ణీ.
      ఆ ఐదు శ్లోకాలనూ మనసులో అనుకొంటూ వాటి స్వరాల ధాటిని గమనించాను. ఆ స్వరాలు ఇలా ఉంటాయి.

      చతుర్విధా భజంతేమాం..||

      నిసాససా నిసాసాసా నిసానిదద నిదాపప
      పానీదనీని దాపమా పాదాప మగరీగారిస (ఎక్కువగా అన్యస్వరమైన పంచమం వినిపిస్తుంది)

      విద్యావినయసంపన్నే ||

      దాదా నిసని దామామ గామగరిస నీససా
      దనిసాగా మదాదాదా దాదనీద నిససాసససా (శాస్రియ మైన రాగేశ్రీ - అన్యస్వరాలు లేవు)

      పుణ్యోగంధః పృథివ్యాంచ ||

      దనీస నిదామమ గమామా మామా గామారీస
      నిసానిద దానిసా గామమామామా దదానీద నిసాససా (శాస్రియ మైన రాగేశ్రీ - అన్యస్వరాలు లేవు)

      దైవీ హ్యేషాం గుణమయీ |

      దానీపామా గగమగరినిదా దనిసాగా గమామామా
      సగమదాదదా దదానీద దానీదా నిససాససా (ఒక్కచోట పంచమం అన్యస్వరంగా వచ్చింది)

      శక్నోతీహైవయస్సోఢుం |

      నిసాసాసా నీసనిదా మపమాగగా
      సాగామామా మదాసద మామా మదానిద నిసాసస (శాస్రియ మైన రాగేశ్రీ - మదాసద అంటూ ని వర్జంచేయడం శ్లోకగాయనానికి వన్నెతెచ్చింది)

      చంద్రమౌళి

      తొలగించండి
  3. మంచి వ్యాసం. ధన్యవాదములు.
    పాండవ వనవాసం లోని 'హిమగిరి సొగసులు' కూడా ఇదే రాగం కదా? పంచమం తో పాటు సాధారణ గాంధారం కూడా వినిపిస్తుంది.
    ఈ రాగాన్ని ఘంటసాల కాకుండా ఇతర సంగీత దర్శకులు వాడిన పాటలు ఉన్నాయా?

    రిప్లయితొలగించండి
  4. in lava kusa (1963) , music on veena is played without any song when sita is in ayodhya (after the dialogue why dont you play veena instead of sitting like a doll) and sita sleeps , and Sri Rama enters the hall. My question is which raga / kirtana was that music played on veena? Thanks in advance. aslkrao@gmail.com

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Thanks for identifying an interesting situation. It is a lullaby tune (jOlapAta varasa).Mastaru has carefully used the lower and mid-octave notes only to get the effect of pleasant lullaby tune. A swing from Rishabham to Pamchamam is really innovative to get that effect of light swing. Looking at the swaras used, it is based on KAPI ragam.

      తొలగించండి
  5. ఈ వ్యాసం చాలా బాగుంది సార్.ఎంతో వివరణాత్మకంగా ఉంది.

    రిప్లయితొలగించండి

విన్నపము

ఘంటసాల మాస్టారి పాటలు, పద్యాలు, శ్లోకాల సాహిత్యాన్ని సేకరించి అభిమానులందరికి అందించాలనే చిన్న తాపత్రయం ఈ 'ఘంటసాల" బ్లాగు ఉద్దేశం. ఏవైనా పొరపాట్లు దొర్లి వుంటే ఆయా పోస్టుల దిగువన గాని, లేదా ఇ-లేఖ ద్వారా గాని తెలియజేయగలరు. నా ఇ-లేఖ చిరునామా: suryvulimiri@gmail.com

మాస్టారు పాడిన నేరు చిత్రాలు

చి-అంతస్తులు-1965 (4) చి-అంతా మనవాళ్ళే-1954 (1) చి-అందం కోసం పందెం-1971 (2) చి-అగ్గి బరాటా-1966 (1) చి-అత్తా ఒకింటి కోడలే-1958 (1) చి-అన్నపూర్ణ-1960 (1) చి-అప్పుచేసి పప్పుకూడు-1959 (5) చి-అమరశిల్పి జక్కన్న-1964 (2) చి-అమాయకుడు-1968 (1) చి-ఆడ పెత్తనం-1958 (2) చి-ఆత్మగౌరవం-1966 (1) చి-ఆనందనిలయం-1971 (1) చి-ఆప్తమిత్రులు-1963 (1) చి-ఆరాధన-1962 (2) చి-ఆస్తిపరులు-1966 (1) చి-ఇద్దరు పెళ్ళాలు-1954 (1) చి-ఇద్దరు మిత్రులు-1961 (3) చి-ఉమాచండీగౌరీశంకరుల కధ-1968 (1) చి-ఉమాసుందరి-1956 (3) చి-ఉయ్యాల జంపాల-1965 (1) చి-ఉషాపరిణయం-1961 (1) చి-ఋష్యశృంగ-1961 (1) చి-ఏకవీర-1969 (1) చి-కనకదుర్గ పూజా మహిమ-1960 (2) చి-కన్నకొడుకు-1973 (1) చి-కన్యాశుల్కం-1955 (2) చి-కలసివుంటే కలదుసుఖం-1961 (2) చి-కాంభోజరాజుకథ-1967 (1) చి-కాళహస్తి మహత్మ్యం-1954 (10) చి-కీలుగుఱ్ఱం-1949 (4) చి-కుంకుమ రేఖ-1960 (1) చి-కులగౌరవం-1972 (1) చి-కృష్ణ లీలలు-1959 (3) చి-కృష్ణప్రేమ-1961 (3) చి-కొడుకు కోడలు-1972 (1) చి-గాలిమేడలు-1962 (2) చి-గుండమ్మకథ-1962 (1) చి-గుడిగంటలు-1964 (1) చి-గుణసుందరి కథ-1949 (1) చి-గులేబకావళి కథ-1962 (4) చి-గృహప్రవేశము-1946 (1) చి-గృహలక్ష్మి-1967 (3) చి-చండీరాణి-1953 (1) చి-చంద్రహారం-1954 (3) చి-చంద్రహాస-1965 (1) చి-చరణదాసి-1956 (2) చి-చింతామణి-1956 (1) చి-చిట్టి తమ్ముడు-1962 (1) చి-చిలకా-గోరింక-1966 (1) చి-చివరకు మిగిలేది!-1960 (1) చి-చెంచు లక్ష్మి-1958 (1) చి-జగదేకవీరుని కథ-1961 (3) చి-జయం మనదే-1956 (1) చి-జయభేరి-1959 (3) చి-జయసింహ-1955 (3) చి-జరిగిన కథ-1969 (1) చి-జీవన తరంగాలు-1973 (1) చి-జైజవాన్‌-1970 (1) చి-టైగర్ రాముడు-1962 (1) చి-డా.ఆనంద్-1966 (1) చి-డా.చక్రవర్తి-1964 (1) చి-తెనాలి రామకృష్ణ-1956 (5) చి-తేనె మనసులు-1965 (1) చి-తోడికోడళ్ళు-1957 (1) చి-తోడికోడళ్ళు-1977 (1) చి-దీపావళి-1960 (2) చి-దేవకన్య-1968 (1) చి-దేవత-1965 (1) చి-దేవదాసు-1953 (1) చి-దేవాంతకుడు-1960 (1) చి-దేశద్రోహులు-1964 (1) చి-దొరికితే దొంగలు (1) చి-ద్రోహి-1948 (1) చి-ధర్మదాత-1970 (1) చి-ధర్మాంగద-1949 (1) చి-నమ్మినబంటు-1960 (1) చి-నర్తనశాల-1963 (2) చి-నలదమయంతి-1957 (1) చి-నవగ్రహపూజా మహిమ-1964 (1) చి-నాదీ ఆడజన్మే-1965 (1) చి-నిరుపేదలు-1954 (1) చి-నిర్దోషి-1951 (1) చి-నిర్దోషి-1967 (1) చి-పరమానందయ్య శిష్యుల కథ-1966 (2) చి-పరోపకారం-1953 (2) చి-పల్నాటి యుద్ధం-1947 (3) చి-పల్నాటి యుద్ధం-1966 (1) చి-పల్లెటూరి పిల్ల-1950 (1) చి-పల్లెటూరు-1952 (4) చి-పవిత్ర బంధం-1971 (1) చి-పవిత్ర హృదయాలు-1971 (1) చి-పసుపు కుంకుమ-1955 (1) చి-పాండవ వనవాసం-1965 (5) చి-పాండురంగ మహత్మ్యం-1957 (1) చి-పాతాళ భైరవి-1951 (1) చి-పిచ్చి పుల్లయ్య-1953 (1) చి-పిడుగు రాముడు-1966 (1) చి-పూజాఫలం-1964 (1) చి-పెండ్లి పిలుపు-1961 (1) చి-పెద్ద మనుషులు-1954 (2) చి-పెళ్ళి కాని పిల్లలు-1961 (2) చి-పెళ్ళి చేసి చూడు-1952 (3) చి-పెళ్ళి సందడి-1959 (1) చి-పెళ్ళినాటి ప్రమాణాలు-1958 (3) చి-పేదరాశి పెద్దమ్మ కథ-1968 (2) చి-పొట్టి ప్లీడరు-1966 (1) చి-ప్రపంచం-1950 (1) చి-ప్రమీలార్జునీయం-1965 (2) చి-ప్రియురాలు-1952 (1) చి-ప్రేమ నగర్-1971 (1) చి-ప్రేమ-1952 (1) చి-బంగారు గాజులు-1968 (1) చి-బండ రాముడు-1959 (1) చి-బందిపోటు-1963 (1) చి-బడి పంతులు-1972 (1) చి-బభ్రువాహన-1964 (3) చి-బలే బావ-1957 (1) చి-బాల భారతం-1972 (1) చి-బాలనాగమ్మ-1959 (4) చి-బాలభారతం-1972 (1) చి-బాలరాజు కథ-1970 (1) చి-బాలరాజు-1948 (2) చి-బాలసన్యాసమ్మ కథ-1956 (1) చి-బావమరదళ్ళు-1961 (1) చి-బికారి రాముడు-1961 (1) చి-బొబ్బిలి యుద్ధం-1964 (1) చి-బ్రతుకుతెరువు-1953 (1) చి-భక్త అంబరీష-1959 (2) చి-భక్త జయదేవ-1961 (1) చి-భక్త తుకారాం-1973 (3) చి-భక్త రఘునాథ్-1960 (2) చి-భక్త రామదాసు-1964 (1) చి-భక్త శబరి-1960 (1) చి-భట్టి విక్రమార్క-1960 (1) చి-భలే అమ్మాయిలు-1957 (1) చి-భాగ్యదేవత-1959 (1) చి-భాగ్యరేఖ-1957 (1) చి-భామా విజయం-1967 (2) చి-భీమాంజనేయ యుద్ధం-1966 (4) చి-భీష్మ-1962 (5) చి-భూకైలాస్-1958 (4) చి-భూలోకంలో యమలోకం-1966 (1) చి-మంచి మనసుకు మంచి రోజులు-1958 (1) చి-మంచి మనసులు-19 (1) చి-మంచిరోజులు వచ్చాయి-1972 (1) చి-మనదేశం-1949 (3) చి-మనసు మమత (1) చి-మనుషులు-మమతలు-1965 (1) చి-మరపురాని కథ-1967 (2) చి-మర్మయోగి-1964 (1) చి-మల్లీశ్వరి-1951 (3) చి-మహాకవి కాళిదాదు-1960 (2) చి-మహామంత్రి తిమ్మరుసు-1962 (3) చి-మాయాబజార్-1957 (3) చి-మూగ మనసులు-1964 (2) చి-మోహినీ భస్మాసుర-1966 (1) చి-యశొద కృష్ణ-1975 (1) చి-యోగి వేమన-1947 (1) చి-రంగుల రాట్నం-1967 (1) చి-రక్త సిందూరం-1967 (1) చి-రక్షరేఖ-1949 (1) చి-రణభేరి-1968 (2) చి-రహస్యం-1967 (2) చి-రాజ మకుటం-1960 (1) చి-రాజకోట రహస్యం-1971 (2) చి-రాజు పేద-1954 (2) చి-రాము-1968 (2) చి-రుణానుబంధం-1960 (1) చి-రేణుకాదేవి మహాత్మ్యం-1960 (1) చి-రోజులు మారాయి-1955 (1) చి-లక్ష్మమ్మ-1950 (2) చి-లక్ష్మీ కటాక్షం-1970 (2) చి-లవకుశ-1963 (1) చి-వదినగారి గాజులు-1955 (1) చి-వరుడు కావాలి-1957 (1) చి-వాగ్దానం-1961 (3) చి-వారసత్వం-1964 (2) చి-వాల్మీకి-1963 (1) చి-విచిత్ర కుటుంబం-1969 (2) చి-విజయం మనదే-1970 (1) చి-వినాయక చవితి-1957 (5) చి-విమల-1960 (2) చి-విష్ణుమాయ-1963 (1) చి-వీర కంకణం-1957 (2) చి-వీరాంజనేయ-1968 (2) చి-వెలుగు నీడలు-1961 (2) చి-వెలుగునీదలు-1961 (1) చి-శకుంతల-1966 (1) చి-శభాష్ పాపన్న-1972 (1) చి-శభాష్ రాజా-1961 (1) చి-శభాష్ రాముడు-1959 (1) చి-శాంతి నివాసం-1960 (1) చి-శోభ-1958 (1) చి-శ్రీ గౌరీ మహత్మ్యం-1956 (4) చి-శ్రీ వేంకటేశ్వర వైభవం-1971 (1) చి-శ్రీ సత్యనారాయణ మహత్యం-1964 (2) చి-శ్రీ సింహాచలక్షేత్ర మహిమ-1965 (1) చి-శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ-1966 (1) చి-శ్రీకృష్ణ కుచేల-1961 (2) చి-శ్రీకృష్ణ తులాభారం-1966 (1) చి-శ్రీకృష్ణ పాండవీయం-1966 (3) చి-శ్రీకృష్ణ విజయం-1971 (1) చి-శ్రీకృష్ణమాయ-1958 (2) చి-శ్రీకృష్ణార్జున యుద్ధం-1963 (1) చి-శ్రీవేంకటేశ్వర మహత్మ్యం-1960 (1) చి-శ్రీవేంకటేశ్వర వైభవం-1971 (2) చి-షావుకారు-1950 (2) చి-సంతానం-1955 (5) చి-సంపూర్ణ రామాయణం-1972 (4) చి-సంసారం-1950 (3) చి-సతీ అనసూయ-1957 (2) చి-సతీ సక్కుబాయి-1965 (3) చి-సతీ సులోచన-1961 (2) చి-సత్య హరిశ్చంద్ర-1965 (2) చి-సప్తస్వరాలు-1969 (1) చి-సారంగధర-1957 (2) చి-సీతారామ కల్యాణం-1961 (2) చి-సుమంగళి-1965 (1) చి-స్వప్న సుందరి-1950 (3) చి-స్వర్గసీమ-1945 (1) చి-స్వర్ణ మంజరి-1962 (1) చి-హంతకులొస్తున్నారు జాగ్రత్త-1966 (1) చి-హరిశ్చంద్ర-1956 (2)

సహగాయనీ గాయకులు

గా-ఎ.పి.కోమల తో (3) గా-ఎం.వి.రాజమ్మ తో (1) గా-ఎస్.జానకి తో (5) గా-గానసరస్వతి తో (1) గా-గోపాలరత్నం తో (1) గా-ఘంటసాల (79) గా-ఘంటసాల-పి.సుశీల (3) గా-ఘంటసాల-బృందం (5) గా-జమునారాణి తో (2) గా-జి.వరలక్ష్మి తో (1) గా-జిక్కి తో (1) గా-జిక్కీ తో (4) గా-జిక్కీ-బాలసరస్వతి తో (1) గా-జిక్కీతో (5) గా-పలువురి తో (1) గా-పి.కన్నాంబ తో (1) గా-పి.బి.శ్రీనివాస్ తో (3) గా-పి.భానుమతి తో (11) గా-పి.లీల తో (21) గా-పి.సుశీల తో (49) గా-పి.సుశీల-బృందంతో (2) గా-పిఠాపురం తో (1) గా-బాలసరస్వతి తో (3) గా-బృందం తో (35) గా-బృందంతో (2) గా-బెంగుళూరు లత తో (1) గా-బెజవాడ రాజరత్నం తో (2) గా-భానుమతి-పిఠాపురం తో (1) గా-మాధవపెద్ది (5) గా-రాధాజయలక్ష్మి తో (2) గా-రేణుక తో (1) గా-లతా మంగేష్కర్ తో (1) గా-వి.జె.వర్మతో (1) గా-వి.సరళ తో (2) గా-శరావతి తో (1) గా-శోభారాణితో (2) గా-శ్రీదేవి తో (1) గా-సరోజిని తో (1) గా-సి.కృష్ణవేణి తో (2) గా-సుందరమ్మ తో (1) గా-సుశీల-బృందం తో (1)

మాస్టారి పాటల సంగీత దర్శకులు

స-విజయభాస్కర్ (1) సం -A.M.రాజా (1) సం- ఘంటసాల (1) సం-అద్దేపల్లి (1) సం-అశ్వత్థామ (4) సం-అశ్వద్ధామ (1) సం-ఆదినారాయణ రావు (5) సం-ఆదినారాయణరావు (2) సం-ఆర్.గోవర్ధనం (2) సం-ఆర్.సుదర్శనం (2) సం-ఆర్.సుదర్శనం-ఆర్.గోవర్ధనం (1) సం-ఎం.రంగారావు (1) సం-ఎల్.మల్లేశ్వరరావు (3) సం-ఎస్.పి.కోదండపాణి (12) సం-ఓగిరాల (1) సం-ఓగిరాల-అద్దేపల్లి (2) సం-ఓగిరాల-టి.వి.రాజు (4) సం-కె.ప్రసాదరావు (1) సం-కె.వి. మహదేవన్ (2) సం-కె.వి.మహదేవన్ (15) సం-గాలి పెంచల (6) సం-ఘంటసాల (79) సం-జె.వి.రాఘవులు (1) సం-జోసెఫ్-విజయాకృష్ణమూర్తి (2) సం-జోసెఫ్.వి.కృష్ణమూర్తి (1) సం-టి.ఆర్.పాప (1) సం-టి.ఎం.ఇబ్రహీం (1) సం-టి.చలపతిరావు (9) సం-టి.జి.లింగప్ప (3) సం-టి.వి.రాజు (31) సం-నాగయ్య-ఓగిరాల (1) సం-నాగయ్య-తదితరులు (1) సం-పామర్తి (5) సం-పామర్తి-సుధీర్ ఫడ్కె (1) సం-పామర్తి-సుధీర్ ఫడ్కే (1) సం-పి.శ్రీనివాస్ (2) సం-పెండ్యాల (38) సం-బాబురావు (1) సం-బాలాంత్రపు (1) సం-బి.గోపాలం (2) సం-బి.శంకర్ (1) సం-మణి-పూర్ణానంద (1) సం-మల్లేశ్వరరావు (1) సం-మాస్టర్ వేణు (12) సం-ముగ్గురు దర్శకులు (2) సం-రాజన్‌-నాగేంద్ర (2) సం-రాజు-లింగప్ప (2) సం-రాజేశ్వరరావు-హనుమంతరావు (1) సం-రామనాథన్‌ (3) సం-రామనాథన్‌-పామర్తి (1) సం-విజయా కృష్ణమూర్తి (3) సం-విశ్వనాథన్‌-రాఘవులు (1) సం-విశ్వనాథన్‌-రామ్మూర్తి (5) సం-వై.రంగారావు (1) సం-సర్దార్ మల్లిక్ - పామర్తి (1) సం-సాలూరు (44) సం-సాలూరు-గోపాలం (1) సం-సి. ఆర్. సుబ్బరామన్ (1) సం-సుదర్శనం-గోవర్ధనం (12) సం-సుబ్బయ్యనాయుడు (2) సం-సుబ్బురామన్ (1) సం-సుబ్బురామన్‍-విశ్వనాథన్ (1) సం-సుసర్ల (18) సం-హనుమంతరావు (2) సం-MSV-రామ్మూర్తి-పామర్తి (1)

మాస్టారి పాటల రచయితలు

ర-అనిసెట్టి (13) ర-అనిసెట్టి-పినిసెట్టి (1) ర-ఆత్రేయ (18) ర-ఆదినారాయణ రావు (1) ర-ఆరుద్ర (39) ర-ఉషశ్రీ (1) ర-ఎ.వేణుగోపాల్ (1) ర-కాళిదాసు (3) ర-కాళ్ళకూరి (1) ర-కొసరాజు (17) ర-కోపల్లి (1) ర-గబ్బిట (2) ర-గోపాలరాయ శర్మ (1) ర-ఘంటసాల (1) ర-చేమకూర. (1) ర-జంపన (2) ర-జయదేవకవి (1) ర-జాషువా (1) ర-జి.కృష్ణమూర్తి (3) ర-తాండ్ర (1) ర-తాపీ ధర్మారావు (8) ర-తిక్కన (2) ర-తిరుపతివెంకటకవులు (1) ర-తోలేటి (12) ర-దాశరథి (8) ర-దీక్షితార్ (1) ర-దేవులపల్లి (3) ర-నార్ల చిరంజీవి (1) ర-పరశురామ్‌ (1) ర-పాలగుమ్మి పద్మరాజు (3) ర-పింగళి (26) ర-బమ్మెఱ పోతన (2) ర-బాబ్జీ (1) ర-బాలాంత్రపు (3) ర-బైరాగి (1) ర-భాగవతం (1) ర-భావనారాయణ (1) ర-భుజంగరాయ శర్మ (1) ర-మల్లాది (8) ర-ముద్దుకృష్ణ (3) ర-రాజశ్రీ (2) ర-రామదాసు (1) ర-రావులపర్తి (1) ర-రావూరి (1) ర-వసంతరావు (1) ర-వారణాసి (2) ర-విజికె చారి (1) ర-వీటూరి (4) ర-వేణు (1) ర-వేములపల్లి (1) ర-శ్రీశ్రీ (28) ర-సదాశివ బ్రహ్మం (9) ర-సముద్రాల జూ. (20) ర-సముద్రాల సీ. (42) ర-సి.నా.రె. (2) ర-సినారె (24) ర-సుంకర (1) ర-సుంకర-వాసిరెడ్డి (1) ర-సుబ్బారావు (1) రచన-ఘంటసాల (1) రచన-దాశరధి (2) రచన-దేవులపల్లి (2) రచన-పానుగంటి (1) రచన-పింగళి (2) రచన-బలిజేపల్లి (1) రచన-సముద్రాల సీ. (1)