1962 సంవత్సరంలో విడుదలైన పద్మిని పిక్చర్స్ సంస్థ నిర్మించిన గాలిమేడలు చిత్రం నుండి ఘంటసాల మాస్టారు రేణుక తో పాడిన "ఈ మూగ చూపేలా బావ" అనే ఈ యుగళం రచన సముద్రాల సీ., స్వరపరచినది టి.జి.లింగప్ప. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, దేవిక, ఎస్.వి. రంగారావు, జగ్గయ్య ,నాగయ్య,రమణారెడ్డి, ఎం వి రాజమ్మ,రాజనాల. ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు బి.ఆర్.పంతులు (బడగూర్ రామకృష్ణయ్య పంతులు). ఈయన తెలుగువాడు, కర్ణాటకలో పెరిగాడు.
గాలి
మేడలు చిత్రంకోసం గాయని రేణుక పాడిన ఒకే ఒక పాట “ఈ మూగచూపేలా”. సినిమాలో దీనిని ఎన్.టి.ఆర్.,
దేవికలపై చిత్రీకరించారు. ఈ రేణుక కుమార్తె మనకు చిరపరిచితమైన తెలుగు, తమిళ, కన్నడ,
హిందీ భాషలలో ఎన్నో పాటలు పాడిన కర్నాటక, హిందుస్తానీ సంగీతంలో ప్రవేశమున్న సినీ నేపథ్యగాయని
అనురాధా శ్రీరామ్ పరశురాం. ఈ చిత్ర నిర్మాత బి.ఆర్.పంతులు ఇదే చిత్రాన్ని ఏకకాలంలో
కన్నడ భాషలో “గాలిగోపుర” అనే పేరుతో రాజ్ కుమార్, లీలావతి ప్రధాన తారాగణంగా నిర్మించారు.
కన్నడ చిత్రానికి ఇవే బాణీలతో మాస్టారు, రేణుక ఆలపించారు.
#00 | యుగళం: | పాట: | ఈ మూగ చూపేలా బావా |
---|---|---|---|
నిర్మాణం | పద్మిని పిక్చర్స్ | ||
చిత్రం: | గాలి మేడలు (1962) | ||
రచన: | సముద్రాల రాఘవాచార్య | ||
సంగీతం: | టి.జి.లింగప్ప | ||
గానం: | ఘంటసాల, రేణుక | ||
ప: | రే: | ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా | |
ఘం: | ఓ.. హో.. మాటాడదే బొమ్మా నీ దరి నే చేరి మాటాడనా | ||
రే: | ఓ..ఓ..ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా | ||
ఘం: | ఓ.. హో.. మాటాడదే బొమ్మా | ||
చ: | రే: | రెప్పెయ్యకుండా ఒకే తీరున నువ్వు చూస్తే నాకేదో సిగ్గౌతది | |
ఘం: | ఓ.. హో.. హో...ఓ..ఓ | ||
రే: | రెప్పెయ్యకుండా ఒకే తీరున నువూ చూస్తే నాకేదో సిగ్గౌతది | ||
ఘం: | ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే -2 | ||
చెయ్యి చేయీ చేరా విడిపోవులే | |||
రే: | ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా | ||
ఘం: | ఓ.. హో.. మాటాడదే బొమ్మా | ||
చ: | రే: | చల్లగ నీ చేయి నన్నంటితే చటుకున నా మేను ఝిల్లంటది | |
ఘం: | ఆ.హా.. హా...హా... ఆ..ఆ.. | ||
రే: | చల్లగ నీ చేయి నన్నంటితే చటుకున నా మేను ఝిల్లంటది | ||
ఘం: | నా ముందు నిలుచుండి నువ్వు నవ్వితే -2 | ||
నా మనసే అదోలాగ జిల్లంటదే... | |||
రే: | ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా | ||
ఘం: | ఓ.. హో.. మాటాడదే బొమ్మా | ||
చ: | రే: | జాగ్రత్త బావా చెయీ గాజులు ఇవే కన్నచిన్నారి తొలిమోజులూ | |
ఘం: | ఓ.. హో.. హో... హో ... ఓ..ఓ.. | ||
రే: | జాగ్రత్త బావా చెయీ గాజులు ఇవే కన్నచిన్నారి తొలిమోజులూ | ||
ఘం: | చాటేనే ఎలుగెత్తి ఈ గాజులే -2 | ||
ఈ వేళా మరేవేళ మన రోజులే | |||
రే: | ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా | ||
ఘం: | ఓ.. హో.. మాటాడదే బొమ్మా |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి