చిత్రం: భక్త తుకారాం (1966)
రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: ఆదినారాయణ రావు
గానం: ఘంటసాల
సాకీ: హరి ఓం... హరి ఓం... హరి ఓం... ఆ... ఆ... ఆ...
పల్లవి: ఘనా ఘన సుందరా కరుణా రసమందిరా. ఆ..
ఘనా ఘన సుందరా కరుణా రసమందిరా. ఆ..
అది పిలుపో మేలుకొలుపో నీ పిలుపో మేలుకొలుపో
అది మధుర మధుర మధురమౌ ఓంకారమో
పాండురంగ... పాండురంగ...
ఘనా ఘన సుందరా.. ఆ... కరుణా రసమందిరా. ఆ..
చరణం 1: ప్రాభాత మంగళపూజావేళ
నీ పద సన్నిధి నిలబడి... నీ పదపీఠిక తలనిడి
ప్రాభాత మంగళపూజావేళ
నీ పద సన్నిధి నిలబడి... నీ పదపీఠిక తలనిడీ..ఈ.ఈ
నిఖిల జగతి నివాళులిడదా... నిఖిల జగతి నివాళులిడదా
వేడదా... కొనియాడదా... పాండురంగ... పాండురంగ...
ఘనా ఘన సుందరా.. ఆ... కరుణా రసమందిరా. ఆ..
చరణం 2: గిరులూ ఝరులూ విరులూ తరులూ...
నిరతము నీ పాద ధ్యానమే... నిరతము నీ నామగానమే
గిరులూ ఝరులూ విరులూ తరులూ
నిరతము నీ పాద ధ్యానమే... నిరతము నీ నామ గానమే..ఏ.ఏ.
సకల చరాచర లోకేశ్వరేశ్వరా... సకల చరాచర లోకేశ్వరేశ్వరా
శ్రీకరా... భవహరా...పాండురంగ... పాండురంగ...
ఘనా ఘన సుందరా.. ఆ... కరుణా రసమందిరా. ఆ..
ఘనా ఘన సుందరా.. ఆ...
పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...
పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...
పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి