1968 సంవత్సరంలో విడుదలైన విజయాసంస్థ నిర్మించిన ఉమా చండీ గౌరీ శంకరుల కధ చిత్రం నుండి ఘంటసాల-పి.సుశీల పాడిన ఏమిటో ఈ మాయా కలలోని అనే ఈ యుగళగీతం రచనపింగళి, స్వరపరచినది పెండ్యాల.
#1726 | యుగళం | పాట: | ఏమిటో ఈ మాయ | |
---|---|---|---|---|
పతాకం: | విజయా | |||
చిత్రం: | ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1966) | |||
సంగీతం: | పెండ్యాల నాగేశ్వర రావు | |||
రచన: | పింగళి | |||
గానం: | ఘంటసాల, పి. సుశీల | |||
దర్శకత్వం | కె.వి. రెడ్డి | |||
నిర్మాత: | కె.వి. రెడ్డి | |||
సాకీ | ఆ.. ఆ... | |||
పల్లవి : | ఘంటసాల: | ఏమిటో ఈ మాయా... కలలోని కథ వలెనాయే... | ||
ఏమిటో ఈ మాయా... కలలోని కథ వలెనాయే... | ||||
ఏమిటో ఈ మాయా | ||||
సుశీల : | వాని నరసీ... వాని నొరసీ... మనసు విరిసెనే.... | |||
తానుగా నను తాకెనే... అది నిజమే కారాదా... | ||||
ఏమిటో ఈ మాయా... కలలోని కథ వలెనాయే... | ||||
ఏమిటో ఈ మాయా | ||||
చరణం : | ఘంటసాల: | నాటిదో, ఏనాటిదో... నేటి యీ చెలిమి.... | ||
నాటిదో, ఏనాటిదో... నేటి యీ చెలిమి.... | ||||
మేలుగా ఒక లీలగా... కల నిజమే కారాదా... | ||||
ఏమిటో ఈ మాయా... కలలోని కథ వలెనాయే... | ||||
ఏమిటో ఈ మాయా | ||||
చరణం : | సుశీల: | ఆ...ఆ.. ఆ... | ||
కనులు కలిసి... మనసు తెలిసి... మేనులే సొలసి... | ||||
కనులు కలిసి... మనసు తెలిసి... మేనులే సొలసి... | ||||
ఉంటిమని.... కలగంటికదా... అది నిజమే కారాదా... | ||||
ఏమిటో ఈ మాయా... కలలోని కథ వలెనాయే... | ||||
ఏమిటో ఈ మాయా | ||||
చరణం : | ఘంటసాల: | ఎన్ని జన్మల పరిచయముతో... నన్ను పిలిచేనో...సఖీ... | ||
ఎన్ని జన్మల పరిచయముతో... నన్ను పిలిచేనో | ||||
మేలుగా ఒక లీలగా... కల నిజమే కారాదా... | ||||
ఏమిటో ఈ మాయా... కలలోని కథ వలెనాయే... | ||||
ఏమిటో ఈ మాయా | ||||
చరణం: | సుశీల: | వరుని కొరకై జీవితమంతా, విరహబాధయేనా... | ||
వరుని కొరకై జీవితమంతా, విరహబాధయేనా... | ||||
మాయయే మటుమాయమై కల నిజమే కారాదా... | ||||
ఏమిటో ఈ మాయా... కలలోని కథ వలెనాయే... | ||||
ఏమిటో ఈ మాయా |