బాబూ మూవీస్ సంస్థ పతాకంపై నిర్మాత సి. సుందరం, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, రామ్మోహన్, కృష్ణ, సంధ్య, సుకన్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా 1966 ల్నో నిర్మించిన తెలుగు చలనచిత్రం కన్నెమనసులు. ఈ చిత్రం ఈ నలుగురు నటులకు మొదటి చిత్రం. ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ స్వరపరచిన నాలుగు గీతాలను ఆత్రేయ వ్రాయగా, అందులో మూడు ఏకగళగీతాలు ఘంటసాల మాస్టారు, ఒక ఏకగళ గీతాన్ని సుశీలమ్మ పాడారు. ఇక్కడ రామ్మోహన్ పై చిత్రించిన ఈ ఉదయం నా హృదయం అనే మధురగీతాన్ని పొందుపరుస్తున్నాను.
గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.
1, జనవరి 2022, శనివారం
ఈ ఉదయం నా హృదయం - కన్నె మనసులు నుండి ఘంటసాల మాస్టారు పాడిన మధుర గీతం
బాబూ మూవీస్ సంస్థ పతాకంపై నిర్మాత సి. సుందరం, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, రామ్మోహన్, కృష్ణ, సంధ్య, సుకన్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా 1966 ల్నో నిర్మించిన తెలుగు చలనచిత్రం కన్నెమనసులు. ఈ చిత్రం ఈ నలుగురు నటులకు మొదటి చిత్రం. ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ స్వరపరచిన నాలుగు గీతాలను ఆత్రేయ వ్రాయగా, అందులో మూడు ఏకగళగీతాలు ఘంటసాల మాస్టారు, ఒక ఏకగళ గీతాన్ని సుశీలమ్మ పాడారు. ఇక్కడ రామ్మోహన్ పై చిత్రించిన ఈ ఉదయం నా హృదయం అనే మధురగీతాన్ని పొందుపరుస్తున్నాను.
#1491 | ఏకగళం | పాట: | ఈ ఉదయం నా హృదయం |
---|---|---|---|
పతాకం: | బాబూ మూవీస్ | ||
చిత్రం: | కన్నె మనసులు | ||
సంగీతం: | కె. వి. మహదేవన్ | ||
రచన: | ఆత్రేయ | ||
గానం: | ఘంటసాల | ||
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు | ||
నిర్మాత: | సి. సుందరం | ||
పల్లవి: | ఘంటసాల: | ఈ ఉదయం నా హృదయం | |
పురులు విరిసి ఆడింది పులకరించి పాడింది | |||
పురులు విరిసి ఆడింది పులకరించి పాడింది | |||
ఈ ఉదయం ఊ.... ఊ..... ఊ.... | |||
చరణం: | ఘంటసాల: | పడుచు పిల్ల పయ్యెదలా పలుచని వెలుగు పరచినది | |
పడుచు పిల్ల పయ్యెదలా పలుచని వెలుగు పరచినది | |||
కొండల కోనల మలుపుల్లో కొత్త వంపులు చూపినదీ...ఈ | |||
ఈ ఉదయం ఊ.... ఊ..... ఊ.... | |||
చరణం: | ఘంటసాల: | చిగురాకులతో చిరుగాలీ సరసాలాడి వచ్చినది | |
చక్కలిగింతలు పెట్టినదీ వేసవికే చలి వేసినదీ | |||
ఓహోహోహో హొహో, ఓహోహోహో హొహో | |||
ఈ ఉదయం ఊ.... ఊ..... ఊ.... | |||
చరణం: | ఘంటసాల: | సరసున జలకాలాడేదెవరో, తేటిని వెంట తిప్పేదెవరో | |
సరసున జలకాలాడేదెవరో, తేటిని వెంట తిప్పేదెవరో | |||
రేయికి సింగారించే కలువో, పగలే వగలు రగిలే కమలమో | |||
ఈ ఉదయం నా హృదయం | |||
పురులు విరిసి ఆడింది పులకరించి పాడింది | |||
పురులు విరిసి ఆడింది పులకరించి పాడింది |
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి