| చిత్రం: | మోహినీ భస్మాసుర (1966) | |
| ఆధారం: | భాగవతం | |
| సంగీతం: | సాలూరు రాజేశ్వర రావు | |
| గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు |
| పద్యం: | ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుప, అంసోత్తరీయంబుపై | |
| పాదాబ్జంబులపై, కపోలతటిపై, పాలిండ్లపై నూత్న మ | ||
| ర్యాదన్ జెందు కరంబు క్రిందగుట, మీదైనా కరంబుంట మే | ||
| ల్కాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే | ||
| పద్యం: | కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ చెందరే | |
| వారేరీ సిరి మూట గట్టుగొని పోవన్ జాలిరే ఉర్విపై | ||
| పేరైనన్ గలదే, శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశః కాములై | ||
| ఈరే కోర్కెలు, వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా.. | ||
| పద్యం: | నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన, దు | |
| ర్మరణంబైన, కులాంతమైన నిజమున్ రానిమ్ము పోనిమ్ము పో | ||
| హరియైనన్ హరుడైన నీరజభవుండభ్యాగతుండైననౌ | ||
| తిరుగన్ నేరదు నాదు జిహ్వ, వినుమా ధీవర్య! వేయేటికిన్ |

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి