1964 లో విడుదలైన, ఎం.జి.ఆర్ నటించిన తమిళ చిత్రానికి తెలుగు డబ్బింగ్ ఉషా సంస్థ వారి దొంగనోట్లు. ఈ చిత్రానికి మాటలు పాటలు వ్రాసినది అనిశెట్టి. చిత్ర సంగీత దర్శకులు పెండ్యాల శ్రీనివాస్. ఘంటసాల మాస్టారు ఈ చిత్రానికి మూడు పాటలు పాడారు. అందులో రెండు పి.సుశీల తో యుగళ గీతాలు, ఒకటి వారి ఏకగళ గీతం. ఏకగళ గీతమైన "ఇలలో న్యాయం లేదు సుమా"ను ఇక్కడ పొందు పరుస్తున్నాను. ఈ పాట యొక్క దృశ్యఖండికను పొందుపరచిన వారు బ్యాంక్ ఆఫ్ ఘంటసాల. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. పాట వివరాలను, పోస్టర్లను పొందుపరచిన వారు ఘంటసాల గళామృతము - పాటల పాలవెల్లి నిర్వాహకులు, ప్రముఖంగా కొల్లూరు సుబ్బారావు గారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.
చిత్రం: | దొంగనోట్లు (1964) | ||
సంగీతం: | పెండ్యాల శ్రీనివాస్ | ||
గానం: | ఘంటసాల | ||
రచన: | అనిసెట్టి | ||
పల్లవి: | ఇలలో న్యాయం లేదు సుమా, ఇది కలికాలం మరువకుమా | ||
నరులే వెలుగును కనలేరు, దేవుడు కలడని మరిచేరు | |||
ఒక దేవుడు కలడని మరిచేరు | |||
చరణం: | బ్రతికెదవేలా హీనముగా, మార్చుము నీ మది కోవెలగా | ||
వేషం, ఈర్ష్యా విడనాడు, లక్ష్యం కొఱకై పోరాడు | |||
లక్ష్యం కొఱకై పోరాడు, హె! | | ఇలలో | | ||
చరణం: | లోకం నడుచును నీ బాట, లోభించునులే నీ మాట | ||
సాహసివై భువి చరియించు, మది కలచేలా మరి భీతేల? | |||
కలచేలా మరి భీతేల, హె! | | ఇలలో | | ||
చరణం: | మనసున పెంచు మంచితనం, పోరి జయించు స్వార్ధగుణం | ||
త్యాగజ్యోతిని వెలిగించు, ఆశయసాధన ఫలియించు | |||
నీ ఆశయసాధన ఫలియించు, హె! | | ఇలలో | | ||
ఒహొహో...ఒహొహో...అహహా...అహహా... | |||
అహహా..హహహా...ఒహొహో...ఒహొహో.. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి