1967 లో శివాజీ గణేశన్ ద్విపాత్రాభినయంతో ఎ.పి.నాగరాజన్ దర్శకత్వంలో విడుదలయిన సరస్వతీ శపథం (డబ్బింగ్) చిత్రపు మాతృక తమిళభాషలో అదే పేరుతో నిర్మించబడిన చిత్రం. "కథా పరంగా త్రిమూర్తుల పత్నులు జ్ఞానం గొప్పదని సరస్వతి (సావిత్రి), ధనం గొప్పదని లక్ష్మి (దేవిక), కాదు వీరత్వమే గొప్పదని పార్వతి (పద్మిని) వాదించుకుంటారు. ఆపై నారదుని (శివాజీ గణేశన్) ప్రమేయంతో అది వివాదంగా మారుతుంది. అయితే వాళ్ళ వాళ్ళ వాదనలను నిరూపించడానికి ఆ ముగ్గురు సురదేవేరులు భూలోకంలోని ఒకదేశంలో నివసిస్తున్న ముగ్గురు వ్యక్తులపై తమ శక్తిని
ప్రయోగిస్తారు. మూగవాడైన విద్యాపతి కి (శివాజీ గణేశన్!) వాగ్దేవి వాక్కునివ్వడమే కాక అతన్ని
గొప్ప పండితుడిని చేస్తుంది. లక్ష్మీదేవి సంకల్పంతో నిస్సంతుగా మరణించబోతూవున్న ఆ దేశపు రాజు పంపిన ఆస్థాన ఏనుగు సెల్వాంబికై (కె.ఆర్.విజయ) అనే బిచ్చగత్తె మెళ్ళో పూలమాల వేయడం వలన ఆమె మహారాణి అవుతుంది. పార్వతీదేవి ప్రమేయంతో పరమ పిరికివాడైన మాల్య
(జెమినీ గణేశన్) అనేవాడు అపర
సాహసవంతుడిగా, వీరుడిగా మారతాడు. అతడు దేశానికి ప్రధాన సేనాపతి అవుతాడు. ఈ
ముగ్గురు వ్యక్తుల
మధ్య నేను
గొప్పంటే నేను గొప్పనే వాదోపవాదాలు పెరిగి చివరకు త్రిమూర్తులు, నారదుడు, త్రిమాతల ప్రమేయం తో కథ సుఖాంతమవుతుంది."
ఈ చిత్రపు వివరాలు (ఇక్కడ) పొందుపరచిన సౌమ్య గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు మూడు పాటలు పాడారు. "దేవుని గృహమది ఎచట?" అనే పాటను ఇక్కడ పొందు పరుస్తున్నాను. ఈ అరుదైన, అపురూపపైన పాట యొక్క దృశ్య ఖండికను పదిలపరచి పొందుపరచిన బ్యాంక్ ఆఫ్ ఘంటసాల వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇతర వివరాలను సమీకరించన ఘంటసాల గళామృతము - పాటల పాలవెల్లి నిర్వాహకులకు ధన్యవాదాలు.
ఈ చిత్రపు వివరాలు (ఇక్కడ) పొందుపరచిన సౌమ్య గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు మూడు పాటలు పాడారు. "దేవుని గృహమది ఎచట?" అనే పాటను ఇక్కడ పొందు పరుస్తున్నాను. ఈ అరుదైన, అపురూపపైన పాట యొక్క దృశ్య ఖండికను పదిలపరచి పొందుపరచిన బ్యాంక్ ఆఫ్ ఘంటసాల వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇతర వివరాలను సమీకరించన ఘంటసాల గళామృతము - పాటల పాలవెల్లి నిర్వాహకులకు ధన్యవాదాలు.
చిత్రం: | సరస్వతీ శపథం (డబ్బింగ్) 1967 | |
సంగీతం: | కె.వి.మహదేవన్ | |
గానం: | ఘంటసాల | |
రచన: | ఆరుద్ర |
సాకీ: | కలడు కలండనువాడు కాపురముండేది ఎచటా? | ||
కనబడునది ఎచటో..ఓ… | |||
పల్లవి: | దేవుని గృహమది ఎచట? -2 | ||
అది ఇచటా, వేరెచటా? దేవుని గృహమది ఎచట? -2 | |||
అనుపల్లవి: | తరగని జ్ఞానం, తెరిచిన హృదయం నిలిచెడిదెచటో అచట -2 | ||
దేవుని గృహమది ఎచట? | |||
చరణం: | భోగము, పొంకము చెలగెడు హృదయం | ||
బొంకులే పెరిగినకాడు | | భోగము | | ||
రాగం, నాదం అలరెడు హృదయం | |||
దేవుడు తిరిగెడు పెరడు | | రాగం | | ||
దేవుని గృహమది ఎచట? | |||
చరణం: | మెఱిసే నగలు, ఆడంబరములు దేవుని మక్కువ కాదే -2 | ||
అచటో కన్ను, ఇచటో కన్ను ఆలయవిధమే కాదే -2 | |||
అలలై, కలలై కవితల వరలే పలుకులే దేవునిచోటు -2 | |||
ఇవియే దైవం అనునది తెలిసిన ఎన్నడూ వుండదు లోటు-2 | |||
దైవం ఎన్నడు ఉంచడు లోటు | |||
దేవుని గృహమది ఎచట? అది ఇచటా, వేరెచట? | |||
దేవుని గృహమది ఎచటా? | |||
సప్తకళలవారెచటా? దైవం అచటే! | |||
ధర్మము కలవారెచటా? దైవం అచటే! | |||
పేరిమిగలవారెచటా? దైవం అచటే! | |||
ప్రేమల మనువారెచటా? దైవం అచటే! | |||
దేవుని గృహమది ఎచట? |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి