కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఎవరికైనా బాకీ ఉంటె ఆ బాకీ ఈ జన్మలో తీర్చ లేక పొతే, రాబోయే జన్మలో ఋణపడి వున్న వారి కడుపున పుట్టి లేదా వారింట చేరి ఆ ఋణం తీర్చుకుంటామని మనవాళ్ళ నమ్మకం. అందువలన ఆ ఋణం వేరొకరి యింట పిల్లలుగా పుట్టి, లేదా పశువులుగానో, పెంపుడు జంతువులు గానో పుట్టి తల్లిదండ్రులకు లేదా యజమానికి సేవ చేసి తీర్చుకుంటాము. అందుకే అన్నారు "రుణానుబంధ రూపేణ పశుపత్నీ సుతాలయా!" అని. ఈ ఇతివృత్తంతో తీసిన అంజలీ పిక్చర్సు చిత్రం రుణానుబంధం. అనుకోని పరిస్థితులలో అగ్నిప్రమాదానికి బలైన ఒక జమీందారు ఏకైక కుమారుడ్ని, తనకు ఏ సంబంధము లేకపోయినా, పెంచి పెద్ద చేసి డాక్టరును చేయాలన్న సత్సంకల్పంతో ఒక స్త్రీ (అంజలీదేవి) పల్లె వదలి పట్నానికి వెళ్ళి బాధ్యత నిర్వహించే సన్నివేశాలతో అంజలీ పిక్చర్సు పతాకం పై రూపొందించిన ఈ చిత్రానికి ఆదినారాయణ రావు సంగీతం సమకూర్చారు. అక్కినేని, గిరిజ, రేలంగి, గుమ్మడి తతిమ్మా తారాగణం. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు నాలుగు పాటలు పాడారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్ "ఏనాటిదొ ఈ బంధం" అన్న పాట కలకాలం సున్నిత మనస్కుల గుండెలను కలచి కదిలించే సముద్రాల జూనియర్ సందేశాత్మక గీతం. ఇదే పాట చిత్రం మధ్యలో వేరొక సాకీతో అదే బాణీతో సాగుతుంది. మొదటి పాట ఒక సాధువు పాడతాడు, రెండవ పాట నేపధ్యంలో వినిపిస్తుంది. ఆ రెండు పాటల దృశ్య, శ్రవణ, సాహిత్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.
చిత్రం: | ఋణానుబంధం (1960) | ||
రచన: | సముద్రాల జూనియర్ | ||
సంగీతం: | ఆదినారాయణ రావు | ||
గానం: | ఘంటసాల | ||
సాకీ: | ఋణానుబంధ రూపేణ పశుపత్నీ సుతాలయా | ||
పల్లవి: | ఏనాటిదొ ఈ బంధం ఈ జీవుల సంబంధం | ||
తెలియగరాని ఈ అనుబంధం | |||
ఋణానుబంధం అంతా ఋణానుబంధం | | ఏనాటిదొ | | ||
చరణం: | ఆహా..ఆ.. కడుపున కన్న తల్లొకరు | ||
కనని తల్లియై పెంచేదొకరు | | కడుపున | | ||
పుట్టేదీ ఒక చోటా.. పెరుగుట వేరొక చోట | |||
హు.. ఎవరికి ఎవరో.. ఏమౌతారో | |||
ఋణానుబంధం అంతా ఋణానుబంధం | |||
చరణం: | ఆహా..జీవితమే చదరంగం | ||
జీవుల పావుల రణరంగం | | జీవితమే | | ||
దేవునకది తెరలాటా.. తెలియదు మనకే బాట | |||
హు.. ఎవరికి ఎవరో.. ఏమౌతారో | |||
ఋణానుబంధం అంతా ఋణానుబంధం | | ఏనాటిదొ | | ||
* * * * | |||
సాకీ: | ఆపదలన్నీ సహించాలీ | ||
అన్నమాట సాధించాలీ | | అన్నమాట | | ||
పల్లవి: | మాటే జీవిత లక్ష్యం, మాటే మానవ ధర్మం | ||
మాటకు నిలచి మనగలవారి చరిత సార్ధకం | |||
వారి బ్రతుకె సార్ధకం | | మాటే జీవిత | | ||
చరణం: | ఓహో..ఓ.. కడుపున కన్న తల్లొకరు | ||
కనని తల్లియై పెంచేదొకరు | | ఓహో.. కడుపున | | ||
పుట్టేదీ ఒక చోటా.. పెరుగుట వేరొక చోట | |||
ఎవరికి ఎవరో.. ఏమౌతారో | |||
ఋణానుబంధం అంతా ఋణానుబంధం | |||
మాటే జీవిత లక్ష్యం, మాటే మానవ ధర్మం | |||
మాటకు నిలచి మనగలవారి చరిత సార్ధకం | |||
వారి బ్రతుకె సార్ధకం | | మాటే జీవిత | | ||
వారి బ్రతుకె సార్ధకం |
chaala manchi paaTa guruvugaaruu ! manam mee swagruhamlO ee cinema choosaamu...gnaapakaalu ! :-)
రిప్లయితొలగించండిఅవును ఫణీ. చాల మంచి చిత్రం, చక్కని పాటలు.
తొలగించండిThanks for posting very good songs
రిప్లయితొలగించండిVery nice
రిప్లయితొలగించండి