1946 లో విడులయిన 'హరిదాసు' అనే తమిళ భక్తిరస చిత్రాన్ని చూసి స్పందించి, ఆ స్ఫూర్తితో ఎన్.టి.ఆర్., వారి సోదరుడు త్రివిక్రమ రావు తెలుగుదనాన్ని జోడించి, కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో, తోటకూర వెంకటరాజు (టి.వి.రాజు) సంగీత నేతృత్వం లో నిర్మించిన భక్తిరస చిత్రం పాండురంగ మహాత్మ్యం. ఈ చిత్రానికి చక్కని సాహిత్యం అందించారు సముద్రాల రామానుజాచార్య (జూనియర్). ఇక్కడ చెప్పవలసినదేమిటంటే సాహిత్యం లోని పదాలపై, ముఖ్యంగా పద్యాలపై మాస్టారికున్న పట్టు. నవరస భావాలను తన గళంలో పుణికి పుచ్చుకుని ఆనందం గాని, ఆవేదన గాని అనుభవించి, పాడి మనను కదిలించగల మేధావి మాస్టారు. దానికి తగిన అభినయం "ఏ పాద సీమ కాశీ ప్రయాగ" పద్యంలో ఎన్.టి.ఆర్. అద్భుతంగా చూపించారు.
తల్లిదండ్రులు మనకు పూజ్యనీయులు, ప్రత్యక్ష దేవతలు.
Thanks to Nandamuri Leela Arjuna Dharma Teja for up loading this video clip to You Tube
చిత్రం: పాండురంగ మహత్యం (1957)
రచన: సముద్రాల జూనియర్
సంగీతం: టి.వి.రాజు
గానం: ఘంటసాల
అమ్మ.. నాన్న.. | ||
ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్రభూములకన్న విమలతరము | ||
ఏ పాద పూజ రమాపతి చరణాబ్జ పూజలకన్నను పుణ్యతమము | ||
ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలిన అమృతఝరము.. | ||
ఏ పాద స్మరణ నాగేంద్ర శయను ధ్యానమ్ము కన్నను మహానందకరము | ||
అట్టి పితరుల పదసేవ ఆత్మ మరచి ఇహ పరమ్ముల కడమై తపించువారి | ||
కావగలవారు లేరు, లేరు ఈ జగాన వేరే | ||
నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా! నాన్నా! ఆ..ఆ.. | ||
అమ్మా! నాన్నా!.....అమ్మా… నాన్నా… |
"అమ్మ నాన్నలు చాలు ప్రత్యక్ష దైవాలు ఆశీస్సు పది వేలు" అని అన్న పదజాలంలో ఎంత అర్థముంది!!!ఎన్ని జన్మ లెత్తినా యెన్ని తపాలు జేసినా కన్నవారి ఋణం ఎలా తీర్చుకుంటాము!యెంత చక్కని పద్యం!!!యెంత మధురంగా పాడాదు మాస్టారు!!ప్రతి సంతానం విని నేర్చుకోవలసిన పద్యరాజమిది!!
రిప్లయితొలగించండి"అమ్మ నాన్నలు చాలు ప్రత్యక్ష దైవాలు ఆశీస్సు పది వేలు" అని అన్న పదజాలంలో ఎంత అర్థముంది!!!ఎన్ని జన్మ లెత్తినా యెన్ని తపాలు జేసినా కన్నవారి ఋణం ఎలా తీర్చుకుంటాము!యెంత చక్కని పద్యం!!!యెంత మధురంగా పాడాదు మాస్టారు!!ప్రతి సంతానం విని నేర్చుకోవలసిన పద్యరాజమిది!!
రిప్లయితొలగించండిnamo namaha. baagunnaaraa Sir!?
రిప్లయితొలగించండిmeku entho dhanyvadhamulu.
రిప్లయితొలగించండి