నేటి బాలలే రేపటి పౌరులు, కొందరు భావి నేతలు. బడాయి తెలియని బడి పిల్లలకు దైనందిన విషయాల మీద ఆసక్తి, అవగాహన ఎక్కువ. తమ చుట్టూ జరుగుతున్న సంఘటనలు, జరిగిన సందర్భాలు వారిని ఎంతో ప్రభావితులను చేస్తాయి. "పిట్ట కొంచెము కూత ఘనము" అన్నట్లు లౌక్యమెరుగని ఆ చిన్న వయసులోనే తమకే అధికారం ఇస్తే ఎలా పరిపాలించగలరో, సమాజంలో ఏయే మార్పులు చేస్తారో నిర్భయంగా చెప్పగలరు. నేటి విద్యార్ధులను చక్కని భావి పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యత గురువులది. అధ్యాపకులకు విద్యార్ధులకు మధ్య గల అనుబంధాన్ని ప్రశ్నోత్తరాల రూపంలో దేశభక్తి, ప్రబోధాత్మకతకు స్ఫూర్తినిచ్చే గీతంలో, "దేశమంటే మట్టికాదోయ్! దేశమంటే మనుషులోయ్!" అన్నమానవతావాద ప్రబోధకుడు మరియు ఆధునికాంధ్ర కవితా వైతాళికుడు గురజాడ నినాదాన్ని కలుపుకుని మహాకవి శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన గీతం "పసిడి మెరుగుల బాలల్లారా". ఈ పాటను 1958 లో విడుదలైన "ఆడ పెత్తనం" చిత్రంలో అంజలీదేవి, అక్కినేని, మరియు కొంతమంది పిల్లలపై చక్కని బడి ప్రాంగణంలో చిత్రీకరించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం సాలూరు రాజేశ్వర రావు. ఈ చిత్రంలో ఒక పాటకు మాస్టర్ వేణు బాణీ కట్టారు.
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!
Thanks to RajashriTelugu for up loading the video to You Tube.
చిత్రం: | ఆడ పెత్తనం | ||
రచన: | శ్రీరంగం శ్రీనివాసరావు | ||
సంగీతం: | ఎస్.రాజేశ్వర రావు & మాస్టర్ వేణు | ||
గానం: | ఘంటసాల వెంకటేశ్వర రావు, పి.సుశీల, బృందం | ||
పల్లవి: | ఘంటసాల: | పసిడి మెరుగుల బాలల్లారా పాలబుగ్గల కూనల్లారా | | పసిడి మెరుగుల | |
ఎవరో చెప్పండి, మీరు ఎవరో చెప్పండి | |||
చరణం: | బృందం: | నేటి బాలలం, భావి పౌరులం, తెలుగు సంపదకు వారసులం | | నేటి బాలలం | |
దేశానికి పరిపాలకులం, మన దేశానికి పరిపాలకులం | |||
సుశీల: | ముద్దు ముద్దుగా దేశం అంటూ పెద్ద మాటలే అంటున్నారే | | ముద్దు ముద్దుగా | | |
దేశం దేశం అంటే ఏమో తెలుసా చెప్పండి | |||
మీకు తెలుసా చెప్పండి | |||
బృందం: | మట్టీ, మన్నూ దేశం కాదు, చెట్టూ-చేమా దేశం కాదు | | మట్టీ మన్నూ | | |
మనమే దేశం, దేశమే మనం | | మనమే | | ||
దేశం అంటే మనుష్యులే, ఏ దేశం అయినా మనుష్యులే | |||
ఇద్దరు: | పసిడి మెరుగుల బాలల్లారా పాలబుగ్గల కూనల్లారా | ||
మీరన్నది నిజమే, యిక వస్తుందా దినమే | |||
చరణం: | ఘంటసాల: | మనమే దేశం అయితే, మనిషే దేశం అయితే | | మనమే దేశం | |
కొందరికెందుకు సౌఖ్యం? మరి కొందరికెందుకు కష్టము? | |||
బృందం: | కొందరు మాత్రం దేశ సంపదను కొల్లగొట్టుతూ కులుకుతువుంటే | | కొందరు మాత్రం | | |
కూడూ గుడ్డా కరువైపోయే మాడే ప్రజలే మిగిలేరు | |||
అల్లాడే ప్రజలే మిగిలేరు | |||
సుశీల: | మీరే పాలకులైతే, అధికారం మీదే అయితే | | మీరే పాలకులైతే | | |
ఏయే పనులను చేస్తారు? మీరేయే మార్పులు తెస్తారు? | |||
బృందం: | చెయ్యలేని పని చేస్తాం మనము, మొయ్యలేనిదీ మోస్తాం మనము | | చెయ్యలేని పని | | |
అధికారం మా చేతికి వస్తే, చేసేదేదో చెబుతాము, చెప్పేదంతా చేస్తాము | |||
సుశీల: | మనదేశమనే రైలు బండిని మంచి మార్గమున నడిపిస్తాం | ||
బృందం: | మనదేశమనే రైలు బండిని మంచి మార్గమున నడిపిస్తాం | ||
సుశీల: | సమానత్వమను స్టేషన్ చేరగ చకచక చకచక పయనిద్దాం | ||
బృందం: | సమానత్వమను స్టేషన్ చేరగ చకచక చకచక పయనిద్దాం | ||
ఘంటసాల: | కరువు రాక్షసిని హతమారుస్తాం | ||
బృందం: | హతమారుద్దాం | ||
సుశీల: | శాంతిదేవతకు పట్టం కడతాం | ||
బృందం: | పట్టం కడతాం | ||
ఘంటసాల: | కరువు రాక్షసిని హతమారుస్తాం | ||
సుశీల: | శాంతిదేవతకు పట్టం కడతాం | ||
ఇద్దరు: | మనుషుల తత్త్వం మార్చేస్తాం, మరో ప్రపంచం సాధిస్తాం | ||
మరో ప్రపంచం సాధిస్తాం |
Thanks to Sri Bollapragada Someswara Rao garu for providing the movie poster from Chandamama.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి