1966 లో పతాకం పై కాంతారావు, రాజశ్రీ జంటగా నిర్మించబడిన పౌరాణిక చిత్రం భీమాంజనేయ యుద్ధం. ఈ చిత్రం లో ఇద్దరు ప్రముఖ వెయిట్ లిఫ్టర్లు దండమూడి రాజగోపాలరావు భీమునిగా, కామినేని ఈశ్వరరావు ఆంజనేయునిగా నటించారు. దండమూడి ఇదే పాత్రను నర్తనశాల, వీరాభిమన్యు, చిత్రాలలో చేశారు. ఈ చిత్రానికి జయజయ జానకి రామా అనే పాటను రచించినది "రాజశ్రీ" పేరున అనువాద చిత్రాలకు సంభాషణలు, పాటలు పకడ్బందీగా వ్రాయగలిగిన దిట్ట, విజయనగరలో పుట్టిన ఇందుకూరి రామకృష్ణం రాజు. ఈ పాటను గానం చేసినది ఘంటసాల, ఉడతా సరోజిని. సంగీతం టి.వి.రాజు (తోటకూర వెంకటరాజు) సమకూర్చారు.
వీడియో, పోస్టరు పొందుపరచిన శ్రీ బొల్లాప్రగడ సోమేశ్వరరావు గారికి కృతజ్ఞతలు.
పల్లవి: | ఘంటసాల: | జయజయ జానకి రామ |
ఇద్దరు: | జయజయ జానకి రామ | |
ఘంటసాల: | రఘుకుల సోమా, పావన నామా | |
ఇద్దరు: | రఘుకుల సోమా, పావన నామా | |
జయజయ జానకి రామ, రామా | ||
జయజయ జానకి రామ | ||
చరణం: | ఘంటసాల: | ఖలులను ద్రుంచి సుజనుల కావగ |
ధరణిని వెలసిన దశరథ రామా! | ||
ఇద్దరు: | ఖలులను ద్రుంచి సుజనుల కావగ | |
ధరణిని వెలసిన దశరథ రామా! | ||
ఘంటసాల: | శివుని ధనస్సును భంగము చేసి | |
ఇద్దరు: | శివుని ధనస్సును భంగము చేసి | |
ఘంటసాల: | సీతను గైకొన్న కల్యాణ రామా! | |
ఇద్దరు: | జయజయ జానకి రామ, రామా | |
జయజయ జానకి రామ | ||
చరణం: | ఘంటసాల: | అల విభీషణుడు అభయము కోరా |
ఆదరించి కరుణించిన రామా! | ||
ఇద్దరు: | అల విభీషణుడు అభయము కోరా | |
ఆదరించి కరుణించిన రామా! | ||
ఘంటసాల: | దశకంధరుని రణమున దునిమి | |
ఇద్దరు: | దశకంధరుని రణమున దునిమి | |
ఘంటసాల: | లోకశాంతి నెలకొల్పిన రామా! | |
ఇద్దరు: | జయజయ జానకి రామ, రామా | |
జయజయ జానకి రామ | ||
ఘంటసాల: | తారకరామా! దనుజ విరామా, మేఘశ్యామా! శ్రీరామా! | |
సరోజిని: | తారకరామా! దనుజ విరామా, మేఘశ్యామా! శ్రీరామా! | |
ఇద్దరు: | భూమి సుతామా, సద్గుణధామా, పాహి పాహి పట్టాభిరామా! | |
జయజయ జానకి రామ, రామా | ||
జయజయ జానకి రామ | ||
రఘుకుల సోమా, పావన నామా | ||
జయజయ జానకి రామ | ||
జయజయ రాం, జానకి రాం | ||
జయజయ రాం, జానకి రాం |