వికట కవిత్వానికి పెట్టింది పేరు అయిన ఒకానొక కవి దిగ్గజం యొక్క చరిత్రను మధురమైన పద్యాలు, పాటలతో తెనాలి రామకృష్ణ (1956) పేరున తెరకెక్కించారు బి.ఎస్.రంగా దర్శకత్వంలో విక్రమ్ ప్రొడక్షన్స్ సంస్థ వారు. చారిత్రాత్మకమైన సంఘటనలతో, సన్నివేశాలతో కూడిన ఈ చిత్రం ద్వారా తెలుగు తన మాతృభాష కానప్పటికీ, తనకు గల మక్కువను "దేశ భాషలందు తెలుగు లెస్స" అని నొక్కి వక్కాణించిన శ్రీ కృష్ణదేవరాయల వంటి కవి-సార్వభౌముని గురించి, వారి ఆస్థాన కవి కూటమియైన "భువనవిజయం"లోని కవిదిగ్గజాలలో రామకృష్ణుని వంటి అసాధారణమైన మరియు దేవీ వరప్రసాదియైన కవి గురించి మనకు తెలుస్తుంది. విజయనగర సామ్రాజ్యానికి సందర్శకులు గా వచ్చిన నరసరాజు వంటి ఎందరో ప్రముఖ కవి సత్తములను తన సమయస్ఫూర్తి తో, ప్రతిభతో భంగ పరచిన వికటకవి రామకృష్ణుడు. ముఖ్యంగా ఈ చిత్రంలోని పద్యాలకు జీవం పోసిన ప్రతిభాశాలి, వరవడి దిద్దిన సంగీత నిఘంటువు ఘంటసాల మాస్టారి గానం ఈ చరిత్ర మన కళ్ళముందే జరుగుతున్న అనుభూతిని కలిగిస్తుంది. ఈ చిత్రంలో కృష్ణదేవరాయలు గా ఎన్.టి.ఆర్., వికటకవిగా ఎ.ఎన్.ఆర్. అద్భుతంగా నటించారు. ఒకరసారి ఒక పండితుడు రాయలవారు కొలువుచేసి యుండగా వచ్చి తాను కొండవీటి సీమనుండి వచ్చానని, అనవేమారెడ్డిని ప్రశంసిస్తూ తాను చెప్పిన "రాజనందన రాజ రాజాత్మజులు సాటి తలప నన్నయ వేమ ధరణి పతికి, భావ భవ భోగ సత్కళాభావములను” పద్యానికి అర్ధం వివరించగలవారున్నారాయని ప్రశ్నించగా, అందుకు బదులుగా రామకృష్ణుడు తన యుక్తిని ఉపయోగించి ఆ కవిని ఓడిస్తాడు. అదీ ఈ సంఘటన.
చిత్రం: | తెనాలి రామకృష్ణ (1956) | |
రచన: | తెనాలి రామకృష్ణ | |
సంగీతం: | విశ్వనాథన్-రామ్మూర్తి | |
గానం: | ఘంటసాల | |
మేకతోకకు మేకతోక మేకకుతోక మేకతోకా మేకతోక | ||
మేకతోకకు మేకతోక మేకకుతోక మేకతోకా మేకతోక | ||
మేకతోకకు మేకతోక మేకకుతోక మేకతోకా మేకతోక | ||
మేకతోకకు మేకతోక మేకకుతోక మేకతోకా మేకతోక | ||
మేక తొకతోక మెకమేక తోకమేక | ||
మేక తొకతోక మెకమేక తోకమేక | ||
మేక తొకతోక మెకమేక తోకమేక | ||
మేక తొకతోక మెకమేక తోకమేక |
ఈ పద్యం అర్థం రాయగలరు.
రిప్లయితొలగించండిworst and foolish comedy scene.
రిప్లయితొలగించండి