1966 సంవత్సరంలో విడుదలైన శ్రీ శంభు ఫిలింస్ సంస్థ నిర్మించిన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కధ చిత్రం నుండి ఘంటసాల మాస్టారు ఎస్.జానకి తో పాడిన కుశలమా నీకు (సంతోషం) అనే ఈ యుగళం రచన పింగళి, స్వరపరచినది పెండ్యాల. ఈ చిత్రంలో తారాగణం ఎన్.టి. రామారావు, ఎస్.వి. రంగారావు, రేలంగి, లింగమూర్తి, జమున, గిరిజ, ఛాయాదేవి. ఈ చిత్రానికి నిర్మాత డి.లక్ష్మీనారాయణ చౌదరి మరియు దర్శకుడు ఎ.కె.శేఖర్.
యుగళగీతం: | కుశలమా..కుశలమా.. | ||
---|---|---|---|
నిర్మాణం: | శ్రీ శంభు ఫిలింస్ | ||
చిత్రం : | శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966) | ||
సంగీతం : | పెండ్యాల | ||
రచన : | పింగళి నాగేంద్ర రావు | ||
గానం : | జానకి, ఘంటసాల | ||
పల్లవి : | జానకి: | కుశలమా. ఆ ఆ, కుశలమా. ఆ ఆ. | |
కుశలమా.. ఆ ఆ ఆ కుశలమా.. ఆ ఆ ఆ | |||
ఎటనుంటివో ప్రియతమా.. | |||
నీ విలాసము, నీ ప్రతాపము, కుశలముగా..సిరి సిరి.. | |||
చరణం: | జానకి: | నను నీ...వు, నిను నే...ను, తనివితీరగా, తలచుకొనీ.. ఈ. ఈ | |
నను నీవు, నిను నేను, తనివితీరగా తలచుకొనీ | |||
పెనగొను ప్రేమలు విరిసికొనీ, తనువులు మరచేమా..ఆ ఆ ఆ | |||
ఘంటసాల: | కుశలమా. ఆ ఆ, కుశలమా. ఆ ఆ. | ||
ఎటనుంటివో ప్రియతమా.. | |||
నీ పరువము, నీ పరవశమూ, కుశలముగా..సిరి సిరీ.. | |||
చరణం : | ఘంటసాల: | కలలోనో, మదిలో..నో.. ఓ పిలచినటుల నే, ఉలికిపడీ.. | |
కలలోనో, మదిలోనో, పిలచినటులనే ఉలికిపడీ | |||
ఉల్లము విసిరే, వలపుగాలిలో, మెల్లగ కదిలేమా..ఆ..ఆ ఆ | |||
జానకి: | కుశలమా. ఆ ఆ, కుశలమా. ఆ ఆ. | ||
ఎటనుంటివో ప్రియతమా.. | |||
నీ విలాసము..నీ ప్రతాపము కుశలముగా..సిరి సిరి.. | |||
చరణం 3 : | జానకి: | కొలనెటనైనా కనుపించగనే ..ఏ ఏ ఏ.., తలతువా, నీ.. విజయేశ్వరినీ | |
కొలనెటనైనా కనుపించగనే, తలతువా నీ విజయేశ్వరినీ | |||
ఘంటసాల: | కలగానముతో నీ చెలి నేనని నాలో నిలీచితివే... | ||
ఇద్దరు: | కుశలమా. ఆ ఆ, కుశలమా. ఆ ఆ. | ||
ఎటనుంటివో ప్రియతమా..కుశలమా.. | |||
కుశలమా. ఆ ఆ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి