రాజ్యం పిక్సర్స్ పతాకంపై లక్ష్మీ రాజ్యం చంద్రమతిగా, ఎస్.వీ.ఆర్. హరిశ్చంద్రునిగా 1956 లో నిర్మించిన అద్భుతమైన చిత్రం హరిశ్చంద్ర. తరువాత ఇదే కథను సత్య హరిశ్చంద్ర గా ఎన్.టి.ఆర్. తో నిర్మించారు. హరిశ్చంద్ర చిత్రంలో విశ్వామిత్రునిగా గుమ్మడి, అతని శిష్యుడు నక్షత్రకునిగా రేలంగి నటించారు. చిత్రం ఆద్యంతము పాటలు పద్యాలో. ఈ పద్యాలకు ప్రాణం పోసారు ఘంటసాల మాస్టారు. ఈ చిత్రం నుండి కాశీ విశ్వేస్వరుని పై ఘంటసాల లీల, సరస్వతి బృందంతో పాడిన పాటను విని ఆనందించండి.
చిత్రం: | హరిశ్చంద్ర (1956) | |
రచన: | జంపన | |
సంగీతం: | సుసర్ల దక్షిణామూర్తి | |
గానం: | ఘంటసాల, పి.లీల, సరస్వతి, బృందం | |
బృందం: | సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివా-2 | |
ఓం హరహరమహదేవ, హరహరమహదేవ, శంభో | ||
ఘంటసాల: | ప్రభో..ఓ..ఓ.. | |
బృందం: | హరహరమహదేవ | |
ఘంటసాల: | దయాకరో | |
బృందం: | హరహరమహదేవ | |
ఘంటసాల: | కృపాళో..ఓ...ఓ.. శంభో మహాదేవ | |
బృందం: | శంభో మహాదేవ | |
హరహరమహదేవ్ శంభో హరహరమహదేవ్ -3 | ||
పల్లవి: | ఘంటసాల: | జయ కాశీవిశ్వనాథా..ఆ..ఆ..! మము కాపాడుమా జగన్నాథా!-2 |
బృందం: | హరహరమహదేవ్ శంభో హరహరమహదేవ్ -2 | |
పి.లీల: | అమ్మా!..ఆ..ఆ.., అమ్మా..ఆ..ఆ.. | |
చల్లని తల్లివి గౌరీ.ఈ..ఈ. నీ సంతతి నీవే కావకున్న | ||
ఉల్లాకాలలో దారేదమ్మా అమ్మా మా జీవితాలకు నీడేదమ్మా అమ్మా | ||
బృందం: | హరహరమహదేవ్ శంభో హరహరమహదేవ్ -2 | |
చరణం: | ఘంటసాల: | ఆ..ఆ… సదమలానంద తేజోమయా ఆ.ఆ..ఆ.. |
సకలలోక పాలకా..ఆ.. సర్వేశ్వరా, శంభో..ఓ..ఓ.. | ||
నిత్యము సత్యము నిర్మల కర్మము -2 | ||
నెలకొల్పుట నీ విధి కాదా-2 | ||
కాశీవిశ్వనాథా..ఆ...! మము కాపాడుమా జగన్నాథా! | ||
మము కాపాడుమా జగన్నాథా | ||
బృందం: | హరహరమహదేవ్ శంభో హరహరమహదేవ్ -2 | |
చరణం: | పి.లీల: | ఆ..ఆ.. అనాథ హృదయమే ఆలయమైతే బాధ యేలనయ్యా |
బ్రతుకు భారమౌనటయ్యా | ||
అనాథ హృదయమే ఆలయమైతే బాధ యేలనయ్యా | ||
బ్రతుకు భారమౌనటయ్యా | ||
ఘంటసాల: | ఆ..కాశీ విశ్వనాథా! | |
సరస్వతి: | ఆ..కాశీ విశ్వనాథా..ఆ..ఆ మము కాపాడుమా జగన్నాథా | |
మము కాపాడుమా జగన్నాథా | ||
ముగ్గురు: | ఆ..పావనమౌ నీ నామ స్మరణే శాంతినొసంగునుగా ప్రభో | |
పావనమౌ నీ నామ స్మరణే శాంతినొసంగునుగా ప్రభో | ||
బృందం: | హరహరమహదేవ్ శంభో హరహరమహదేవ్ -2 | |
ఘంటసాల: | ఆ..ఆ..ఆ.. | |
బృందం: | హరహరమహదేవ్ శంభో హరహరమహదేవ్ -2 | |
ఘంటసాల: | హే! మాతా, హే! అంబే, హే! ప్రభో.. | |
బృందం: | హరహరమహదేవ్ శంభో హరహరమహదేవ్ -2 |
Thanks to Priyansh Doneparthy for up loading the video to You Tube.