లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ సంస్థ 1970 లో బాపు దర్శకత్వంలో అలనాతి బాలనటుడు మాస్టర్ ప్రభాకర్ టైటిల్ పాత్రలో నిర్మించిన చక్కని పిల్లల చిత్రం బాలరాజు కథ. మామ మహదేవన్6 ఈ చిత్రానికి మధురమైన మరపురాని పాటలను స్వరప్రిచారు. నిజజీవితంలో తారసపడే వ్యక్తుల ద్వారా చక్కని సూక్తులను పిల్లలు ఎంత బాగా తెలుసుకుంటారో వాటిని ఎలా పాటించాలో అన్న ఇతివృత్తాన్ని చాల చక్కగా చూపించారు బాపు గారు. ఈ చిత్రం లోని పాటలన్నీ ఆణిముత్యాలె. అందులో మహాబలిపురం మహాబలిపురం అన్న పాట జనమెరిగిన చక్కని పాట. ఎదే చిత్రానికి ఘంటసాల మాస్టారు, సుశీల పాడిన ఒక చక్కని పాటను ఇక్కడ పొందుపరుస్తున్నాను. మనసుకు హత్తుకునేలా చక్కన్ని సాహిత్యాన్ని అందించారు కొసరాజు.
చిత్రం: |
బాలరాజు కథ (1970)
|
|
సంగీతం: |
కె.వి. మహదేవన్
|
|
సాహిత్యం: |
కొసరాజు
|
|
గానం: |
ఘంటసాల, సుశీల
|
|
సుశీల: |
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటేయొద్దు
|
|
ఏమిటీ రహస్యం స్వామీ ఏమిటీ విచిత్రం
|
||
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటేయొద్దు
|
||
ఏమిటీ రహస్యం? స్వామీ ఏమిటీ విచిత్రం?
|
||
సుశీల: |
ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతు ఉంటారెందుకు?
|
|
ఇంకొక్క రాతికి చేతులెత్తుకొని మొక్కుతు
ఉంటారెందుకు?
|
||
ఒక్క రాయిని కాలికిందేసి తొక్కుతు ఉంటారెందుకు?
|
||
ఇంకొక్క రాతికి చేతులెత్తుకొని మొక్కుతు
ఉంటారెందుకు?
|
||
ఘంటసాల: |
అది వీధిలోన పడి ఉన్నందుకు
|
|
అది వీధిలోన పడి ఉన్నందుకు
|
||
ఇది గుడిలో బొమ్మై కూర్చున్నందుకూ
|
||
సుశీల: |
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటెయొద్దు
|
|
ఏమిటీ రహస్యం స్వామీ ఏమిటీ విచిత్రం
|
||
సుశీల: |
మనిషికి ఒక పెళ్ళే చాలంటూ దేవుడు కేటేట
పెళ్ళేందుకు?
|
|
ఊరుమీద పడి చందాలెందుకు
|
||
మనిషికి ఒక పెళ్ళే చాలంటూ దేవుడు కేటేట
పెళ్ళేందుకు?
|
||
ఊరుమీద పడి చందాలెందుకు
|
||
ఘంటసాల: |
లోకులు చూచి తరించుటకు - 2
|
|
పలుగాకుల బొజ్జల పెంచుటకు -2
|
||
సుశీల: |
మహమ్మదీయులు పిలిచే దేవుడు
|
|
క్రైస్తవులంతా కొలిచే దేవుడు
|
||
ఏడుకొండల వేంకటేశ్వరుడు గోవిందా గోవిందా
|
||
శ్రీశైలంలో మల్లిఖార్జునుడు
|
||
వారూ వీరూ ఒకటేనా వేరువేరుగా ఉన్నారా
|
||
శ్రీశైలంలో మల్లిఖార్జునుడు
|
||
వారూ వీరూ ఒకటేనా వేరువేరుగా ఉన్నారా
|
||
ఘంటసాల: |
సర్వవ్యాపి నారాయణుడు..ఊ..
|
|
సర్వవ్యాపి నారాయణుడు
|
||
ఎక్కడ జూచిన ఉంటాడు
|
||
ఆ స్వామి కొరకెనే శోధిస్తున్నా
|
||
తీర్ధాలన్నీ తిరుగుతు ఉన్నా
|
||
సుశీల: |
ఆఁ అట్టా రండి దారికి
|
|
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు
|
||
మీరొక్క దెబ్బతో తేల్చారు
|
||
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన దేవుడు ఉంటాడన్నారు
|
||
మీరొక్క దెబ్బతో తేల్చారు
|
||
ఎక్కడ బడితే అక్కడ ఉంటే ఇక్కడకెందుకు వచ్చారు
|
||
ఏ రాతికి మొక్కను వచ్చారు
|
||
అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటేయొద్దు
|
||
ఏమిటీ రహస్యం? స్వామీ ఏమిటీ విచిత్రం?
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి