1966 లో రవీంద్ర ఆర్ట్ పిక్చర్సు పతాకంపై ఎన్.టి.ఆర్., అంజలీదేవి, కాంచన ప్రముఖ తారాగణంగా నిర్మించిన చక్కని కుటుంబ చిత్రం డాక్టర్ ఆనంద్. ఈ చిత్రం యొక్క విశేషాలను ఈ లింకులో చూడవచ్చు. తల్లిదండ్రులు చక్కెర బొమ్మల్లాంటి పిల్లలతో అందంగా కట్టుకున్న బొమ్మరిల్లు మల్లెల వంటి మనసులతో విలసిల్లుతుందని 'మనసు'కవి ఆత్రేయ వ్రాసిన చక్కని గీతం చక్కని చల్లని యిల్లు. ప్రతికూల వాతావరణంలో ఇదేపాట సుశీల ఏకగళంలో ఉందీచిత్రంలో. ఇందులోదే ఘంటసాల, సుశీల పాడిన మరొక యుగళగీతం "నీలాల కన్నులతో ఏలాగో చూశావు ఎందుకనో". అలాగే దేవులపల్లి రచించిన సుశీల గానం చేసిన 'నీల మోహనా రారా' మరొక మధురమైన పాట. ఈ చిత్రానికి మాటలు, కొన్ని పాటలు ఆచార్య ఆత్రేయ వ్రాసారు. ఈ చిత్రానికి సంగీతం కె.చి.మహదేవన్. ఈ చిత్రకథను పోలినదే తరువాతి కాలంలో వచ్చిన ఎ.ఎన్.ఆర్., కృష్ణకుమారి, జయలలిత నటించిన భార్యాబిడ్డలు చిత్రం.
(ఆడియోలో పూర్తి పాట వుంది)
చిత్రం: | డాక్టర్ ఆనంద్ (1966) | |
రచన: | ఆత్రేయ | |
సంగీతం: | కె.వి. మహదేవన్ | |
గానం: | ఘంటసాల, సుశీల, బృందం | |
నిర్మాణం: | రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి | |
పల్లవి: | ఘంటసాల: | చక్కని చల్లని యిల్లు, చక్కెర బొమ్మలు పాపలు |
మల్లెల మనసులు విరజల్లు, మమతల కలలకు పందిళ్ళు | ||
బృందం: | చక్కని చల్లని యిల్లు, చక్కెర బొమ్మలు పాపలు | |
మల్లెల మనసులు విరజల్లు, మమతల కలలకు పందిళ్ళు | ||
అందరు: | చక్కని చల్లని యిల్లు, చక్కెర బొమ్మలు పాపలు | |
చరణం: | ఘంటసాల: | అమ్మా, నాన్నా కట్టినవి |
బృందం: | అమ్మా, నాన్నా కట్టినవి | |
ఘంటసాల: | అల్లరి పిల్లలు పుట్టినవీ.. అహహహ | |
బృందం: | అల్లరి పిల్లలు పుట్టినవి | |
సుశీల: | ముద్దుల ముద్దలు పెట్టినవి | |
ముల్లోకాలకు స్వర్గమిదీ..ఈ.. | ||
బృందం: | అహహహా.. అహహహా...అహహహా | |
చక్కని చల్లని యిల్లు, చక్కెర బొమ్మలు పాపలు | ||
చరణం: | ఘంటసాల: | మనసు పెరిగితే ఒకటౌతాము, వయసు పెరిగితే వేరౌతాము |
సుశీల: | మనసు పెరిగితే ఒకటౌతాము, వయసు పెరిగితే వేరౌతాము | |
ఇద్దరు: | పెరిగే మీరు, తరిగే మేము, ప్రేమనిక్కడే చవి చూద్దా..ము | |
అహహహా.. అహహహా...అహహహా | ||
బృందం: | చక్కని చల్లని యిల్లు, చక్కెర బొమ్మలు పాపలు | |
మల్లెల మనసులు విరజల్లు, మమతల కలలకు పందిళ్ళు | ||
చక్కని చల్లని యిల్లు, చక్కెర బొమ్మలు పాపలు | ||
అహహహా.. అహహహా...అహహహా |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి