తెలుగువారి మంగళ
గళవేల్పు ఘంటసాల
మాస్టారు చలన
చిత్రాలలోనే కాకుండా ఎన్నోచలనచిత్రేతర గీతాల
సంపుటముల (Private Albums) కోసం చక్కని
శాస్త్రీయ మరియు
లలిత
గీతాలను స్వరపరచి గానం
చేసారు .
అందులో
కొన్ని
ఆయన
స్వీయ
రచనలు .
అలాంటివి దాదాపు
ఎనభై
పైచిలుకు పాటలున్నాయి . అవికాక
మరెన్నో అలభ్యమైన రచనలు
ఉన్నాయి . అయితే
ఈ
పాటలను ,
వాటి
సాహిత్యాన్ని విశ్లేషించి , అందులోని రాగాలను , మాస్టారి గానవైవిధ్యాన్ని వివరించి ఆ
సమగ్ర
విషయాలను తనదైన
చక్కని
శైలిలో
ప్రస్తావిస్తూ మన ఘంటసాల సంగీత వైభవం అనే
పుస్తక
రూపంలో
ముద్రించారు నల్గొండ వాస్తవ్యులు , విశ్రాంత తెలుగు
ఉపాధ్యాయులు , శ్రీ
నాదబ్రహ్మ సంగీత
కళాశాల
ప్రధానోధ్యాపకులు శ్రీ
ఎం . పురుషోత్తమాచార్యుల
వారు .
ఈ
పుస్తకంలో మాస్టారు పాడిన
గణేశుని గీతాలు ,
వేంకటేశ్వరుని భక్తిగీతాలు , జయదేవుని అష్టపదులు , అన్నమయ్య సంకీర్తనలు , జిల్లెళ్ళమూడి అమ్మపై
పాడిన
భక్తిగీతాలు , శాస్త్రీయ రచనలు ,
లలిత
గీతాలు ,
జానపద
గీతాలు
యక్షగానం , బుఱ్ఱకథలు , స్వీయ
రచనలు ,
సత్యసాయిబాబా పై
పాడిన
భక్తి
గీతాలు ,
ఆకాశవాణిలో ప్రసారమయిన మరియు
దేశవిదేశాలలో మాస్టారు ఇచ్చిన
కచేరీలలో ఆలాపించిన ప్రైవేట్ గీతాలు
ఇవన్నీ
పొందుపఱిచారు .
డా.మహాభాష్యం చిత్తరంజన్
సమగ్ర సురుచిర భాష్యం : ఈ సంకలనానికి ముందుమాటగా ప్రముఖ లలిత గీతాల రచయిత , గాయకులు మరియు సంగీత దర్శకులు శ్రీ డా . మహాభాష్యం చిత్తరంజన్ ( శ్రీ నాగరంజని లలిత సంగీత అకాడమీ అధ్యక్షులు ) గారు
" తెలుగుజాతికే గర్వకారణమయిన సుమధుర గాయక చక్రవర్తి శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు గారు . మాస్టారు గానంచేసిన అనేకమైన చలనచిత్రేతర గీతాల వివరాలను ఈ తరం వారికి అందించాలనే సత్సంకల్పంతో డా . కె . వి . రావు గారి రూపకల్పనతో సంగీత సాహిత్య విద్వన్మణి శ్రీ డా . ఎం . పురుషోత్తమాచార్యుల సమతులన విశ్లేషణతో ఆవిర్భవించిన బృహద్గ్రంధమిది . నిజానికిది ఒక సుదీర్ఘ పరిశొధనా గ్రంథం "
అని పేర్కొన్నారు .
శ్రీ పుట్టా మంగపతి
చివరి చూపు : మాస్టారితో అనుబంధం కలిగిన ఒకప్పటి హెచ్ . ఎం . వి . కళాకారులు , భాండాగార నిర్వాహకులు మరియు సలహాదారులు అయిన శ్రీ పుట్టా మంగపతి గారు తన స్పందనను ఈ విధంగా తెలియజేసారు . " ఘంటసాల గారితో ఎన్నో వైవిధ్యమైన గీతాలను వారి స్వీయసంగీతంలో పాడించి , ప్రైవేట్ గ్రామఫోను రికార్డులుగా విడుదల చేయించిన అదృష్టము నాకు దక్కిందని గర్వపడటమే కాకుండా నిత్యం సంతోషిస్తూ ఉన్నాను . చివరకు భారతీయ చరిత్రలో శాశ్వతముగా నిలిచిపోయే ' భగవద్గీత ' ను మాస్టారిచే గానం చేయించే అదృష్టం కూడా దక్కింది . ఆ రికార్డింగు తరువాత కారులో తిరిగివెళ్ళబోతూ కారు తలుపు వేస్తూ మాస్టారు నన్ను ఒక చూపు చూశారు . ఆ చూపులో ఎన్నోభావాలు కనిపించాయి . బహుశా అదే చివరి చూపు కాబోలు ". మాస్టారు గానం చేసిన
" వెంకన్ననామమే భక్తీతొ కొలిచితే " మరియు
" కాలయాపనము చేసి తపించేవు నరుడా " అన్న రెండు భక్తి , తత్వరస గుళికలు ' రవి ' అన్న పేరుతో శ్రీ మంగపతి గారు రచించినవే.
శ్రీమతి ఘంటసాల సావిత్రి
మధుర స్మృతులు : శ్రీ పురుషోత్తమాచార్యుల వారు ఈ గ్రంథాన్ని మాస్టారి శ్రీమతి ఘంటసాల సావిత్రమ్మ గారికి అంకితమిచ్చారు . ఆవిడ
" పురుషోత్తమాచార్యుల వారు ఈ పుస్తకప్రతిని కాకు పంపి నా అభిప్రాయం తెలియజేయమని నాకు పంపారు . ఆ ప్రతిని చదువుతున్నప్పుడు నా మనస్సు ఆ పాత రోజులలో మామయ్య ప్రతి పాటకు , పద్యానికి చేసిన బాణీలు గుర్తుకు వచ్చి ఎంతో మధురానుభూతిని పొందాను . మామయ్య బాణీలను స్వరపరచుకొని గానం చేస్తూ మధ్య మధ్య నా అభిప్రాయం అడుగుతూ ఉండేవారు . మా మధ్య జరిగిన అప్పటి సంభాషణలు పదే పదే గుర్తుకు వచ్చి మనసు పులకరించింది . చారిత్రాత్మకమైన ఈ పరిశోధనా గంథాన్ని చక్కని సంగీత , సాహిత్య విశ్లేషణతో రచించిన శ్రీ పురుషోత్తమాచార్యుల వారికి , వారి కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య , అష్టైశ్వర్యములు ప్రసాదించాలని ఆ భగవంతుని మనసారా వేడుకుంటున్నాను " అని తన స్పందన తెలియజేసారు .
డా. శారద, డా. కె.వి.రావు
తీరిన కోరికలు : ఈ గ్రంథం ఒక చక్కని రూపాన్ని ధరించడానికి పునాది హైదరాబాదు వాస్తవ్యులు మరియు ప్రముఖ ఘంటసాల ఆరాధకులు శ్రీ డా . కె . వి . రావు గారు , వారి సతీమణి డా . శారద గార్ల సత్సంకల్పం . వారికున్న రెండు కోరికలలో మాస్టారి ప్రైవేట్ గీతాలకు , పద్యాలకు కూచిపూడి నృత్యరూపకంగా ప్రదర్శింపబడటం కొన్ని సంవత్సరాలక్రితం పిన్నవయసులోనే ' బాలశ్రీ ' పురస్కారం పొందిన కుమారి లలితా సింధూరి ద్వారా జరిగింది . తరువాతి కోరిక వారి ఆప్తమిత్రులు శ్రీ పురుషోత్తమాచార్యుల వారి ద్వారా
" మన ఘంటసాల సంగీత వైభవం " పుస్తకం ద్వారా ఈడేరింది . " ఘంటసాల గారు గానం చేసిన గీతాలు ఈనాటికీ చెక్కుచెదరకుండా ఉండటానికి కారణము వారు తన మనోనేత్రముతో కవిహృదయంలో జొరబడి వారి భావాలను గ్రహించి గానం చేయగల అద్వితీయ ప్రతిభయే " నని డా . కె . వి . రావు గారి అభిప్రాయం .
రచయిత పరిచయం
డా.ఎం.పురుషోత్తమాచార్య
శ్రీ ఎం . పురుషోత్తమాచార్య
గారు
1948 లో
నల్గొండ జిల్లా
హుజూర్
నగర్
లో
శ్రీమతి మంగతాయమ్మ మరియు
శ్రీ
వేంకట
నరసింహాచార్య పుణ్యదంపతులకు జన్మించారు . శ్రీ పురుషోత్తమాచార్యుల వారు
ఎన్నో
రేడియో
నాటక
రచనలు ,
పద్యనాటకాలు , వ్యాసాలు వ్రాసారు . సునాదయోగి త్యాగయ్య చరిత్రను హరికథగా వ్రాసారు . అలాగే
వారికి
1998 లో
ఘంటసాల
కమెండేషన్ ( మచిలీపట్నం ), 2008 లో ద్వారకానాధ శాస్త్రి పరిశోధక పురస్కారం , 2011 లో వరూధిని - ఉత్తమ
నాటక
రచయిత
గా
నంది
నాటక
పురస్కారం లభించాయి . ఈ
గ్రంథంలో పొందుపరచిన గీతాలను శ్రీ
పురుషోత్తమాచార్యుల వారు
వస్తురీత్యా విభజన
చేసి ,
గీతాలను విని
వ్రాతప్రతిని తయారుచేసుకుని , తదుపరి
సాహిత్యపరంగా భావం ,
అర్థాలు , విశేషాలు వివరిస్తూ , స్వరకల్పన , గాయన
విధానం ,
సాహిత్యంతో అనుసంధానం , నేపథ్య
సంగీతం ,
వాద్యసంగీత ధోరణి
మరియు
వాద్యవాదనావైభవం అనే
అంశాలను తీసుకుని సునిశితంగా విశ్లేషించారు . మాస్టారు పాడిన పాటల వర్గీకరణ ఈ విధంగా వుంది:
*
భక్తి
గీతాలు
*
బుఱ్ఱ
కథలు
*
శాస్త్రీయ
రచనలు
*
స్వీయరచనలు
- రికార్డైనవి
*
దేశభక్తి
గేయాలు
*
స్వీయరచనలు
- రికార్డు కానివి
*
జానపద
గేయాలు
*
పాడించిన
బాణీలు
*
లలిత
గీతాలు
*
ఆకాశవాణి
సేవలు
ఈ
రచన
చేయడం
తమ
" అపూర్వసుకృతం " అని రచయిత
స్పందన . అంతేకాక మాస్టారు పాడిన ప్రైవేట్ పద్యాల కోసం ప్రత్యేకించి శ్రీ పురుషోత్తమాచార్యుల వారు మరొక గ్రంథ రచన చేస్తున్నారు . దానిని త్వరలోనే ప్రచురిస్తామని వారు తెలిపారు .
పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం
VIDEO
" మన ఘంటసాల సంగీతవైభవం " ప్రతులకు శ్రీ
కె . వి . రావు గారిని
సంప్రదించండి .
శ్రీ కె . వి . రావు గారి చిరునామా :
28, 4 వ అంతస్తు ,
ఇం . నెం . 1-1-79, భాగ్యనగర్ అపార్ట్ మెంట్స్ ,
ఆర్ . టి . సి . క్రాస్
రోడ్స్ ,
శ్రీ
మయూరి
సినిమా
ప్రక్కన ,
హైదరాబాదు - 500 020.
సెల్
నంబరు :
98487 42320.
త్వరలో
శ్రీ
పురుషోత్తమాచార్య గారు
విశ్లేషించిన మాస్టారి చలనచిత్రేతర గీతాలను వారి
సౌజన్యంతో మన
" ఘంటసాల "
బ్లాగులో ప్రచురిస్తాము అని
తెలియజేయుటకు నాకెంతో సంతోషంగా వుంది .
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
భవదీయుడు
సూర్యనారాయణ వులిమిరి , నార్త్
కరోలినా , అ . సం . రా .
మన ఘంటసాల సంగీత వైభవం పుస్తకము గురించి తెలియ చేసినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిసంతోషం సుబ్బారావు గారు.
తొలగించండి